ప్రధాన మంత్రి కార్యాలయం
‘ప్రబుద్ధ భారత’ 125వ వార్షికోత్సవాల ను ఉద్దేశించి ఈ నెల 31న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
Posted On:
29 JAN 2021 2:04PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ప్రబుద్ధ భారత’ 125వ వార్షికోత్సవాల ను ఉద్దేశించి ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ప్రసంగించనున్నారు. రామకృష్ణ మఠానికి చెందిన మాస పత్రిక ‘ప్రబుద్ధ భారత’ ను స్వామి వివేకానంద 1896వ సంవత్సరం లో ప్రారంభించారు. ప్రబుద్ధ భారత 25వ వార్షికోత్సవాన్ని మాయావతి లోని అద్వైత ఆశ్రమం నిర్వహిస్తోంది.
‘ప్రబుద్ధ భారత’ ను గురించి
భారతదేశ ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానం తాలూకు సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ‘ప్రబుద్ధ భారత’ పత్రిక ఒక ముఖ్యమైన సాధనం గా ఉంటూ వచ్చింది. ఈ పత్రిక ప్రచురణ ను చెన్నై (ఇదివరకటి మద్రాసు) లో ప్రారంభించడం జరిగింది. రెండు సంవత్సరాల కాలం పాటు అక్కడ ఆ పత్రిక ప్రచురణ కొనసాగి, ఆ తరువాత అల్మోడా నుంచి ప్రచురితమైంది. తదనంతరం, 1899వ సంవత్సరం ఏప్రిల్ లో పత్రిక ప్రచురణ స్థానాన్ని అద్వైత ఆశ్రమానికి మార్చడమైంది. ఇక ఆ పత్రిక ను అక్కడి నుంచే ప్రచురిస్తూ వస్తున్నారు.
మహనీయులు కొందరు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, చరిత్ర, మనస్తత్వ శాస్త్రం, కళ, తదితర సామాజిక అంశాల పై వారి రచన ల ద్వారా ‘ప్రబుద్ధ భారత’ పుస్తకం పైన వారిదైన ముద్ర ను వేశారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్, బాల గంగాధర్ తిలక్, సిస్టర్ నివేదిత, శ్రీ అరవిందో, పూర్వ రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్ తదితర ప్రముఖులు వారి రచనల ను ‘ప్రబుద్ధ భారత’ పత్రిక కు అందిస్తూ వచ్చారు.
‘ప్రబుద్ధ భారత’ పత్రిక తాలూకు పాత సంచికలన్నిటిని అద్వైత ఆశ్రమం ఆన్ లైన్ లోని తన వెబ్‌సైట్ ద్వారా అందుబాటు లో ఉంచేందుకు కృషి చేస్తోంది.
***
(Release ID: 1693200)
Visitor Counter : 277
Read this release in:
Gujarati
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada