ప్రధాన మంత్రి కార్యాలయం

జలవాయు అనుకూలత శిఖర సమ్మేళనం-2021 లో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 25 JAN 2021 8:50PM by PIB Hyderabad

ఆదరణీయులారా,

     జలవాయు అనుకూలత శిఖర సమ్మేళనాన్ని భారతదేశం స్వాగతం పలుకుతున్నది.  దీనికి ప్రధాని శ్రీ మార్క్ రూటే నాయకత్వం వహించడాన్ని ప్రశంసిస్తోంది కూడాను.

జలవాయు పరివర్తన అంశం ప్రస్తుతం గతం లో కంటే చాలా ఎక్కువ మహత్వాన్ని సంతరించుకొన్నది.  అంతేకాదు, అభివృద్ధి కోసం భారతదేశం చేస్తున్న కృషి లో దీనికి ప్రముఖమైన పాత్ర కూడా ఉంది.

దీనికి తోడు, ఇది భారతదేశ అభివృద్ధి ప్రయత్నాలలో, కీలకమైన అంశంగా ఉంది. 

మేము మాతో ఓ వాగ్దానం చేసుకొన్నాము అది ఏమిటి అంటే..

*     మేము పారిస్ ఒప్పందం లక్ష్యాలను అందుకోవడమే కాదు, వాటిని మించి ముందుకు సాగిపోతాము;

*     మేము పర్యావరణ క్షీణత ను అరికట్టడమే కాదు, పర్యావరణాన్ని సంరక్షించే దిశ లో చర్యలను తీసుకొంటున్నాము; ఇంకా,

*     మేము కొత్త సామర్థ్యాల ను ఆవిష్కరించడమే కాదు, వాటిని ప్రపంచాన్ని మంచిది గా తీర్చిదిద్దడం కోసం ఇతర దేశాలకు కూడా జోడిస్తాము.. అని.  


మా కార్యాలే మా వచనబద్ధత ను సూచిస్తాయి.


మేము 2030వ సంవత్సరానికల్లా 450 గీగావాట్ నవీకరణయోగ్య శక్తి సామర్థ్యాన్ని సాధించాలి అని లక్ష్యం గా పెట్టుకొన్నాం.

మేము ఎల్ఇడి లైట్ లను ప్రోత్సహిస్తున్నాము; ఏటా 38 మిలియన్ టన్ను ల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను నిలువరిస్తున్నాము.

మేము క్షీణించిపోయిన 26 మిలియన్ హెక్టార్ ల భూమి ని 2030వ సంవత్సరానికల్లా పునరుద్ధరించబోతున్నాం.

మేము గ్రామీణ ప్రాంతాలలోని 80 మిలియన్ కుటుంబాలకు వంట చేసుకొనేందుకు శుద్ధమైన ఇంధనాన్ని అందిస్తున్నాము.

మేము 64 మిలియన్ కుటుంబాలకు నీటి ని గొట్టపు మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నాము.

దీనికి తోడు, మన కార్యక్రమాలు ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు.

అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) లోనూ, కొఎలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్‌ఐ) లు ప్రపంచ జలవాయు  భాగస్వామ్యాన్ని బలవత్తరం గా తీర్చిదిద్దాయి.

ప్రపంచవ్యాప్తం గా మౌలిక సదుపాయాల ప్రతిఘాతుకత్వాన్ని పెంపు చేయడానికి సిడిఆర్‌ఐ తో కలసి పని చేయవలసిందిగా గ్లోబల్ కమిశన్  ఆన్ అడాప్టేశన్ కు నేను పిలుపునిస్తున్నాను.  మరి, నేను మీ అందరినీ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అంశం పై ఈ సంవత్సరాంతం నాటికి భారతదేశం లో జరిగే మూడో అంతర్జాతీయ సమావేశానికి తరలిరావలలసింది గా ఆహ్వానిస్తున్నాను.

ఆదరణీయులారా,

ప్రకృతి తో కలసిమెలసి సద్భావన తో జీవించాలని భారతదేశ సభ్యతాగత విలువ లు మాకు బోధిస్తున్నాయి.

భూ గ్రహం తో మనకు ఉన్న సంబంధం ఒక తల్లి కి తన బిడ్డ తో ఉన్న అనుబంధం లాంటిది అని మా ప్రాచీన గ్రంథం యజుర్వేదం మాకు నేర్పుతున్నది.

మనం గనక ధరణి మాత పట్ల శ్రద్ధ వహించామంటే, ఆమె మనలను చక్క గా పెంచి పోషిస్తూ ఉంటుంది.

జలవాయు పరివర్తన కు అనుకూలంగా నడుచుకోవడానికి గాను, మన జీవన శైలి ని సైతం ఈ ఆదర్శానికి అనుగుణంగా మలచుకోవాలి.

మనం మరింత ముందుకు సాగడానికి ఈ భావనే మనకు మార్గాన్ని చూపెట్టాలి.

మీ అందరికీ ఇవే నా ధన్యవాదాలు.


 

****

 


(Release ID: 1692452) Visitor Counter : 253