ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 25వ తేదీన ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కర్ అవార్డు గ్రహీతలతో ముచ్చటించనున్న - ప్రధానమంత్రి
Posted On:
24 JAN 2021 3:27PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పి.ఎం.ఆర్.బి.పి) అవార్డు గ్రహీతలతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 జనవరి, 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంభాషించనున్నారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కూడా హాజరుకానున్నారు.
భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కర్ ఆధ్వర్యంలోని బాల శక్తి పురస్కారాలను - అసాధారణమైన సామర్ధ్యాలు, ఆవిష్కరణలు, విద్యా విషయక విజయాలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజిక సేవ, ధైర్యం వంటి రంగాలలో విశేషమైన విజయాలు సాధించిన బాల,బాలికలకు ప్రదానం చేస్తోంది. ఈ సంవత్సరం, పి.ఎం.ఆర్.బి.పి-2021 కింద వివిధ విభాగాల నుండి దేశవ్యాప్తంగా 32 మంది అభ్యర్థులను, బాల శక్తి పురస్కారాల కోసం ఎంపికయ్యారు.
****
(Release ID: 1692027)
Visitor Counter : 160
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam