ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా దేశంలోని కుమార్తెలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి
Posted On:
24 JAN 2021 12:18PM by PIB Hyderabad
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, దేశంలోని కుమార్తెలందరికీ, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు, శ్రీ మోదీ, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా, మనం, మన దేశంలోని కుమార్తెలందరినీ మరియు వారు వివిధ రంగాలలో సాధించిన విజయాలనూ అభినందిస్తున్నాము. అందుబాటులో విద్య, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, లింగ సున్నితత్వాన్ని మెరుగుపరచడంతో సహా, బాలికల సాధికారతపై దృష్టి సారించే అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.” అని పేర్కొన్నారు.
బాలికలకు సాధికారత కల్పించడంతో పాటు, మన కుమార్తెలకు గౌరవ ప్రదమైన జీవితాన్నీ, అవకాశాలనూ కల్పించడం కోసం కృషి చేస్తున్నవారందరినీ కూడా, ప్రధానమంత్రి మరో ట్వీట్ లో అభినందించారు.
*****
(Release ID: 1691931)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam