ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

6వ రోజుకల్లా భారత్ లో దాదాపు 10.5 లక్షల

మందికి కోవిడ్ టీకా; అనేక దేశాలకంటే అధికం

భారీగా పెరిగిన కోవిడ్ పరీక్షల సామర్థ్యం:

19 కోట్లు దాటిన మొత్తం పరీక్షలు

Posted On: 22 JAN 2021 11:00AM by PIB Hyderabad

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారి మీద పోరులో భారతదేశం మరో కీలకమైన మైలురాయి దాటింది. సార్వత్రిక టీకాల కార్యక్రమంలో భాగంగా జనవరి 22 ఉదయం 7 గంటలకల్లా దాదాపు పదిన్నర లక్షల

 ( 10,43,534) మందికి  కోవిడ్ టీకాలు ఇవ్వటం పూర్తి చేసింది. గడిచిన 24 గంటలలో 4049 శిబిరాలలో 2,37,050 మందికి టీకాలివ్వగా ఇప్పటివరకు నడిపిన శిబిరాల సంఖ్య 18,167 కు చేరింది.

 

క్రమసంఖ్య

రాష్ట్రం / కేంద్రపాలితప్రాంతం    

టీకా లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

1,032

2

ఆంధ్రప్రదేశ్

1,15,365

3

అరుణాచల్ ప్రదేశ్

4,682

4

ఆస్సాం

10,676

5

బీహార్

63,541

6

చండీగఢ్

753

7

చత్తీస్ గఢ్

22,171

8

దాద్రా, నాగర్ హవేలి

184

9

డామన్, డయ్యూ

94

10

ఢిల్లీ

18,844

11

గోవా

426

12

గుజరాత్

34,865

13

హర్యానా

45,893

14

హిమాచల్ ప్రదేశ్

5,790

15

జమ్మూ కశ్మీర్

6,847

16

ఝార్ఖండ్

11,641

17

కర్నాటక

1,38,807

18

కేరళ

35,173

19

లద్దాఖ్

240

20

లక్షదీవులు

369

21

మధ్యప్రదేశ్

38,278

22

మహారాష్ట్ర

52,393

23

మణిపూర్

1,454

24

మేఘాలయ

1,785

25

మిజోరం

2,537

26

నాగాలాండ్

3,187

27

ఒడిశా

1,13,623

28

పుదుచ్చేరి

759

29

పంజాబ్

12,532

30

రాజస్థాన్

32,379

31

సిక్కిం

773

32

తమిళనాదు

42,947

33

తెలంగాణ

97,087

34

త్రిపుర

9,272

35

ఉత్తరప్రదేశ్

22,644

36

ఉత్తరాఖండ్

8,206

37

పశ్చిమ బెంగాల్

53,988

38

ఇతరములు

32,297

                                                          మొత్తం

10,43,534

 

పరీక్షల విషయంలో కూడా భారత్ భారీ సంఖ్యలు నమోదు చేసుకుంది. కోవిడ్ నిర్థారణ పరీక్షల మౌలిక వసతులు పెంచటంతో  కోవిడ్ మీద భారత పోరు మరింత వేగం పుంజుకుంది.  మొత్తం కోవిడ్ పరీక్షల సంఖ్య 19 కోట్లు దాటింది. గడిచిన 24

 

గంటలలో  8,00,242 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు దేశంలో జరిపిన మొత్తం కోవిడ్ పరీక్షల

సంఖ్య 19,01,48,024 అయింది..

 

నిర్థారణ పరీక్షలు విస్తృతం చేయటం వలన పాజిటివ్ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల శాతం 5.59% కు చేరింది.   

 

గడిచిన కొద్ది వారాలుగా ఉన్న ధోరణినే కొనసాగిస్తూ భారత్ లో చికిత్సపొందుతూ ఉన్నవారి శాతం 1.78% కు పడిపోయింది.  ప్రస్తుతం కోవిడ్ చికిత్స అందుకుంటున్నవారి సంఖ్య 1,88,688 గా నమొదైంది.. 

18,002మంది గత 24 గంటలలో కోలుకున్నారు.  దీనివలన చికిత్సపొందుతున్నవారి సంఖ్య నికరంగా  గత 24 గంటలలో 3,620 తగ్గింది.

మొత్తం ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,02, 83,708 కి చేరగా కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా మరింత పెరిగి 1,00,95,020 కు చేరింది. ఇది  54.5 రెట్లు ఎక్కువ. కోలుకున్నవారి శాతం పెరుగుతూ  96.78% చేరింది.

 

గత 24 గంటలలో కోలుకున్నవారిలో 84.70% మంది 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు. కేరళలో అత్యధికంగా 6,229 మంది కొలుకోగా, మహారాష్ట్రలో 3,980 మంది, కర్నాటకలో 815 మంది తాజాగా కోలుకున్నారు. 

 

గడిచిన 24 గంటలలో తాజాగా పాజిటివ్ నిర్థారణ అయినవారు 14,545 మంది కాగా వీరిలో  84.14% మంది ఎనిమిది రాష్టాలకు చెందినవారున్నారు.  కేరళలో  6,334 కేసులు, మహారాష్ట్రలొ 2886 కేసులు, కర్నాటకలో 674 కేసులు నమోదయ్యాయి.

 

గత 24 గంటలలో 163 మంది కోవిడ్ బాధితులు  మరణించారు. వారిలో  82.82% మంది తొమ్మిది రాష్టాలకు చెందినవారు. మహారాష్టలో అత్యధికంగా 52 మంది చనిపోగా కేరళలో 21 మంది చనిపోయారు.

***




(Release ID: 1691207) Visitor Counter : 225