హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్–19 కు వ్యతిరేకంగా ప్రపంచంలోని చరిత్రాత్మక అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శాస్త్రవేత్తలందరినీ అభినందించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం కరోనాపై పోరాటంలో కీలకమైన దశను దాటిందని అన్నారు.

ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమం భారతదేశ శాస్త్రవేత్తల అపారమైన సామర్థ్యాన్ని , మన నాయకత్వ శక్తిని ప్రదర్శిస్తుందని తెలిపారు.

మోడీ నేతృత్వంలోని 'నవ భారత్' విపత్తులను అవకాశాలుగా, సవాళ్లను విజయాలుగా మార్చుకునే దేశం. ఈ 'మేడ్ ఇన్ ఇండియా' వ్యాక్సిన్ ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి నిదర్శనం.

మానవాళికి ముప్పుగా మారిన అతిపెద్ద సంక్షోభాన్ని అంతం చేసే దిశలో విజయవంతం అయిన కొద్ది దేశాలలో భారతదేశం ఒకటని మంత్రి అన్నారు.

ఈ అద్భుత విజయానికి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆత్మనిర్భర్ భారత్ కు ఇది నిదర్శనం.

ఈ చారిత్రాత్మక రోజున, మన కరోనా యోధులందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Posted On: 16 JAN 2021 2:40PM by PIB Hyderabad

కోవిడ్–19 కు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్‌ను ప్రారంభించిన చారిత్రాత్మక క్షణాన కేంద్ర హోం మంత్రి  అమిత్ షా శాస్త్రవేత్తలందరినీ అభినందించారు. వరుస ట్వీట్ల ద్వారా ఆయన పలు విషయాలను తెలిపారు “ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం కరోనాపై పోరాటంలో కీలకమైన దశను దాటింది. ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమం భారతదేశ శాస్త్రవేత్తల  అపారమైన సామర్థ్యాన్ని , మన నాయకత్వ శక్తిని ప్రదర్శిస్తోంది. మానవత్వానికి వ్యతిరేకంగా మారిన అతిపెద్ద సంక్షోభాన్ని అంతం చేసే దిశలో విజయవంతం అయిన కొద్ది దేశాలలో భారతదేశం ఒకటి. ఈ అద్భుత విజయానికి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు”  అని పేర్కొన్నారు. కొత్త ఆత్మనిర్భర్ భారత్ ఎదుగుదల ఇదేనని ఆయన అన్నారు. మోడీ  నేతృత్వంలోని 'నవ భారత్' విపత్తులను అవకాశాలుగా, సవాళ్లను విజయాలుగా మార్చే భారతదేశం అని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక రోజున, కరోనా యోధులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు  అమిత్ షా. 'మేడ్ ఇన్ ఇండియా' వ్యాక్సిన్ ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి నిదర్శనమని అన్నారు.

***



(Release ID: 1690302) Visitor Counter : 148