మంత్రిమండలి

సౌర శ‌క్తి రంగం లో స‌హ‌కారం కోసం భార‌త‌దేశానికి, ఉజ్బెకిస్తాన్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం పై సంత‌కాల‌కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 20 JAN 2021 11:50AM by PIB Hyderabad

సౌర శ‌క్తి రంగం లో స‌హ‌కారం కోసం భార‌త‌దేశాని కి, ఉజ్బెకిస్తాన్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంత‌కాల అంశాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం దృష్టి కి తీసుకు రావ‌డ‌మైంది.

ఈ కింద పేర్కొన్న మేర‌కు ప‌ర‌స్ప‌రం గుర్తించిన రంగాల‌ లో భార‌త‌దేశానికి కి చెందిన నూతన మరియు న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి మంత్రిత్వ శాఖ ప‌రిధి లోని నేశన‌ల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ సోల‌ర్ ఎన‌ర్జి (ఎన్ఐఎస్ఇ) కి, ఉజ్బెకిస్తాన్ కు చెందిన ఇంట‌ర్ నేశన‌ల్ సోల‌ర్ ఎన‌ర్జి ఇన్స్ టిట్యూట్‌ (ఐఎస్ఇఐ) కి మ‌ధ్య ప‌రిశోధ‌న/ప‌్ర‌త్యక్ష నిరూపణ/ప‌్ర‌యోగాత్మ‌క ప‌థ‌కాల‌ ను గుర్తించ‌డం ఈ ఒప్పందం లో ప్ర‌ధాన కార్య రంగం గా ఉంది:
 
1)   సోల‌ర్ ఫోటోవోల్టిక్‌;

2)   నిలవ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలు;

3)   సాంకేతిక విజ్ఞానం బ‌ద‌లాయింపు.

ప‌ర‌స్ప‌ర ఒప్పందం ప్రాతిప‌దిక‌ న, అంత‌ర్జాతీయ సౌర కూట‌మి (ఐఎస్ఎ) స‌భ్య‌త్వ దేశాల లో ప్ర‌యోగ‌త్మ‌క ప‌థ‌కాన్ని అమ‌లు లోకి తీసుకు రావ‌డానికి, ఆ పథకం సేవలను వినియోగించుకోవడానికి ఉభ‌య ప‌క్షాలు కృషి చేయ‌నున్నాయి.



 

***



(Release ID: 1690294) Visitor Counter : 197