మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జెఇఇ (మెయిన్) 21-22 కింద 12వ తరగతిలో 75% మార్కులు రావాలన్న అర్హత ప్రమాణాన్ని మాఫీ
Posted On:
19 JAN 2021 2:12PM by PIB Hyderabad
గత విద్యా సంవత్సరంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఐఐటి జెఇఇ (అడ్వాన్స్‌డ్)లో 75% మార్కులను (12వ తరగతిలో) అర్హత ప్రమాణాన్ని జాయింట్ ఎంట్రెన్స్ పరీక్ష (మెయిన్)లో మాఫీ చేయాలన్న నిర్ణయాన్ని విద్యా మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకుంది. జెఇఇ (మెయిన్) ఆధారంగా రానున్న విద్యా సంవత్సరం 2021-2022లో ఎన్ ఐటి, ఐఐఐటి, ఎస్‌పిఎలు, ఇతర సిఎఫ్‌టిఐలలో అడ్మిషన్లలో ఈ నిర్ణయం వర్తిస్తుంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐటిలు), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఇఎస్‌టి), శిబ్‌పూర్ (వెస్ట్ బెంగాల్), ఇతర కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థలు (ఐఐటిలు మినహా సిఎఫ్‌టిఐలు) లలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల అడ్మిషన్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టిఎ) నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) ఆధారంగా ఉంటాయి.
ఐఐటిలు/ ఎన్ ఐటిలు/ ఐఐఐటిలు, అటువంటి సిఎఫ్‌టిలలో అర్హత సంపాదించే అభ్యర్ధుల అడ్మిషన్లు జెఇఇ ర్యాంకుల ఆధారంగా ఉంటాయి. వారు 12వ తరగతి పరీక్షలో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి లేదా ఆయా బోర్డులు నిర్వహించిన 12 వ తరగతి పరీక్షలలో అగ్రంలో ఉన్న 20శాతంలో ఉండాలి. ఎస్‌సి/ఎ స్‌టి విద్యార్ధులకు 12వ తరగతిలో అర్హత పొందేందుకు కనీసం 65% ఉండాలి.
విద్యార్ధుల సౌలభ్యం కోసం విద్యా సంవత్సరం 2021-2022లో అడ్మిషన్లకు అర్హత క్రైటీరియా 75%ని రద్దు చేస్తున్నట్టుగా జెఇఇ (అడ్వాన్స్‌డ్) పరీక్షల తేదీని ప్రకటిస్తూ విద్యా మంత్రి వెల్లడించారు.
***
(Release ID: 1690001)