ఆర్థిక మంత్రిత్వ శాఖ
జీఎస్టీ పరిహారం కొరత భర్తీ దిశగా 12వ విడత కింద సమాంతర రుణంగా రాష్ట్రాలకు రూ.6,000 కోట్లు విడుదల;
చట్టం మేరకు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటిదాకా మొత్తం రూ.72,000 కోట్లు విడుదల;
అదనపు రుణ సమీకరణకు రూ.1,06,830 కోట్ల మేర రాష్ట్రాలకు ఇచ్చిన అనుమతులకు ఇది అదనం
Posted On:
18 JAN 2021 5:39PM by PIB Hyderabad
దేశంలోని అన్ని రాష్ట్రాలకూ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిహారం కొరత భర్తీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని వ్యయాల విభాగం ఇవాళ 12 వారం వాయిదా కింద రూ.6,000 కోట్లు విడుదల చేసింది. ఇందులో 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లు, జీఎస్టీ మండలిలో సభ్యత్వంగల శాసనసభలతో కూడిన 3 కేంద్రపాలిత ప్రాంతాలకు (ఢిల్లీ, జమ్ముకశ్మీర్, పుదుచ్చేరి) రూ.483.40 కోట్లు విడుదలయ్యాయి. కాగా, మిగిలిన 5 రాష్ట్రాలు... అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలకు జీఎస్టీ అమలుకు సంబంధించి రాబడి లోటు లేదు.
దీంతో ఆయా రాష్ట్రాలు, శాసనసభలుగల కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ పరిహార కొరత భర్తీ కింద అంచనా వేసిన మొత్తంలో ఇప్పటిదాకా 65 శాతం నిధులు విడుదలయ్యాయి. ఇందులో రాష్ట్రాలకు రూ.65,582.96 కోట్లు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.6,417.04 కోట్లు వంతున అందాయి.
ఇక జీఎస్టీ అమలువల్ల ఏర్పడిన రూ.1.10 లక్షల కోట్ల కొరత భర్తీలో భాగంగా 2020 అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం అదనపు ప్రత్యేక రుణ వితరణ గవాక్షాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన రుణాలను వాటి తరఫున కేంద్రం ఈ గవాక్షంద్వారా సమీకరిస్తుంది. ఆ మేరకు 2020 అక్టోబరు 23 నుంచి ఇప్పటివరకూ 12 విడతల రుణ సమీకరణ పూర్తయింది.
ఈ వారంలో సదరు రుణాలను 4.4315 శాతం వడ్డీతో కేంద్రం సమీకరించగా, ఆ నిధులు 12వ విడతగా రాష్ట్రాలకు విడుదలయ్యాయి. మొత్తంమీద ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం 4.7024 శాతం సగటు వడ్డీతో రూ.72,000 కోట్లదాకా రుణం సమీకరించింది.
ఈ విధంగా జీఎస్టీ అమలువల్ల ఏర్పడిన రాబడి లోటు భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రుణ వితరణ గవాక్షం కింద రాష్ట్రాలకు నిధులు సమకూర్చడంతోపాటు అవి స్వయంగా రుణాలు సేకరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, అదనపు ఆర్థిక వనరుల సేకరణలో భాగంగా ‘ఆప్షన్-1’ని ఎంచుకున్న రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 0.50 శాతం మించకుండా మాత్రమే రుణ సమీకరణ చేసుకోవచ్చు. దీంతో రాష్ట్రాలు ఈ వెసులుబాటునే ఎంచుకున్నాయి. ఈ నిబంధనకు అనుగుణంగానే మొత్తం రూ.1,06,830 కోట్ల (జీఎస్‌డీపీలో 0.50 శాతం) అదనపు రుణ సమీకరణ కోసం 28 రాష్ట్రాలకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది.
ఇలా 28 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణ అనుమతి కింద మంజూరు చేసిన మొత్తాన్ని, ప్రత్యేక గవాక్షంద్వారా సమీకరించిన నిధులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేయడానికి సంబంధించిన వివరాలు అనుబంధంలో చూపబడ్డాయి.
18.01.2021 వరకు జీఎస్‌డీపీలో 0.50 శాతం అనుమతితో సేకరించిన అదనపు రుణం, ప్రత్యేక గవాక్షం ద్వారా సేకరించిన నిధులు అందుకున్న రాష్ట్రాలు/యూటీలవారీ వివరాలు
(Rs. in Crore)
S. No.
|
Name of State / UT
|
Additional borrowing of 0.50 percent allowed to States
|
Amount of fund raised through special window passed on to the States/ UTs
|
1
|
Andhra Pradesh
|
5051
|
1684.89
|
2
|
Arunachal Pradesh*
|
143
|
0.00
|
3
|
Assam
|
1869
|
724.96
|
4
|
Bihar
|
3231
|
2846.74
|
5
|
Chhattisgarh
|
1792
|
1184.82
|
6
|
Goa
|
446
|
612.31
|
7
|
Gujarat
|
8704
|
6723.29
|
8
|
Haryana
|
4293
|
3172.91
|
9
|
Himachal Pradesh
|
877
|
1251.83
|
10
|
Jharkhand
|
1765
|
643.65
|
11
|
Karnataka
|
9018
|
9045.61
|
12
|
Kerala
|
4,522
|
2525.64
|
13
|
Madhya Pradesh
|
4746
|
3311.47
|
14
|
Maharashtra
|
15394
|
8732.41
|
15
|
Manipur*
|
151
|
0.00
|
16
|
Meghalaya
|
194
|
81.59
|
17
|
Mizoram*
|
132
|
0.00
|
18
|
Nagaland*
|
157
|
0.00
|
19
|
Odisha
|
2858
|
2786.53
|
20
|
Punjab
|
3033
|
3661.36
|
21
|
Rajasthan
|
5462
|
2661.67
|
22
|
Sikkim*
|
156
|
0.00
|
23
|
Tamil Nadu
|
9627
|
4550.36
|
24
|
Telangana
|
5017
|
1206.87
|
25
|
Tripura
|
297
|
165.00
|
26
|
Uttar Pradesh
|
9703
|
4379.49
|
27
|
Uttarakhand
|
1405
|
1688.73
|
28
|
West Bengal
|
6787
|
1940.83
|
|
Total (A):
|
106830
|
65582.96
|
1
|
Delhi
|
Not applicable
|
4275.94
|
2
|
Jammu & Kashmir
|
Not applicable
|
1656.36
|
3
|
Puducherry
|
Not applicable
|
484.74
|
|
Total (B):
|
Not applicable
|
6417.04
|
|
Grand Total (A+B)
|
106830
|
72000.00
|
* These States have ‘NIL’ GST compensation gap
****
(Release ID: 1689760)
Visitor Counter : 220