ప్రధాన మంత్రి కార్యాలయం

ఐక్యతా విగ్ర‌హానికి రైలు ద్వారా చేరుకునే విధంగా అనుసంధాన‌త‌ ప‌ర్యాట‌కుల‌కు మేలు చేయ‌నుంది,ఇది ఉపాధి అవ‌కాశాల‌నూ క‌ల్పించ‌నుంది. :ప‌్ర‌ధాన‌మంత్రి

Posted On: 17 JAN 2021 2:17PM by PIB Hyderabad

గుజ‌రాత్‌లోని కెవాడియా కు అన్ని వైపుల నుంచి రైలుమార్గం ద్వారా అనుసంధానం కావ‌డం చిర‌స్మ‌ర‌ణీయం,ఇది ప్ర‌తి ఒక్క‌రికీ గ‌ర్వ‌కార‌ణం అని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల‌నుంచి గుజ‌రాత్‌లోని కెవాడియాకు  8 రైళ్ల‌ను  వ‌ర్చువ‌ల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించిన అనంత‌రం మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి ఈ విష‌యం తెలిపారు.
 కెవాడియా తో చెన్నై, వార‌ణాసి, రేవా, దాద‌ర్‌, ఢిల్లీ ల‌ను క‌ల‌ప‌డంతోపాటు కెవాడియా- ప్ర‌తాప్‌న‌గ‌ర్ ల‌మ‌ధ్య మెమూ స‌ర్వీసు, ద‌భోయ్‌-చందోడ్ మ‌ధ్య బ్రాడ్‌గేజ్‌, చందోడ్‌- కెవాడియా మ‌ధ్య కొత్త లైను ఏర్పాటు వంటివి కెవాడియా అభివృద్ధిలో నూత‌న అధ్యాయాన్ని లిఖించ‌నున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.
ఇది  అటు ప‌ర్యాట‌కుల‌కు, స్థానిక ఆదివాసీల‌కు నూత‌న స్వ‌యం ఉపాధి,  ఇత‌ర ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌నున్న‌ట్టు చెప్పారు. ఈ రైల్వే లైన్ న‌ర్మ‌దా తీరంలోని క‌ర్నాలి, పోయిచ‌,గ‌రుడేశ్వ‌ర్‌వంటి ఆధ్యాత్మిక కేంద్రాల‌ను క‌ల‌ప‌నున్న‌ట్టు కూడా ప్ర‌ధాని తెలిపారు.

***



(Release ID: 1689565) Visitor Counter : 107