ప్రధాన మంత్రి కార్యాలయం
టీకామందు అత్యవసరం గా అవసరం అయిన వారు దానిని ముందుగా అందుకొంటారు: ప్రధాన మంత్రి
మానవ కేంద్రితమైన దృష్టికోణం భారతదేశానికి టీకాకరణ కార్యక్రమం లో మార్గదర్శకం గా ఉంటుంది: ప్రధాన మంత్రి
ప్రజలు రక్షణ చర్యలను పాటిస్తూ ఉండాలని, వ్యాక్సీన్ ప్రోటోకాల్ ను అనుసరించాలని ఆయన జాగ్రత్త చెప్పారు
Posted On:
16 JAN 2021 1:35PM by PIB Hyderabad
కోవిడ్-19 టీకామందును ఇప్పించే కార్యక్రమం చాలా దయామయమైందిగాను, ముఖ్యమైన సూత్రాలతో కూడుకొన్నదిగాను ఉన్నదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆ టీకామందు ఎవరికి అత్యంత అవసరమో, వారే దానిని ముందుగా అందుకొంటారు అని ఆయన అన్నారు. ఎవరికి వ్యాధి సంక్రమణ తాలూకు అపాయం చాలా ఎక్కువ స్థాయి లో ఉందో, వారికి ఆ టీకామందు ను ముందుగా ఇప్పించడం జరుగుతుందన్నారు. మన వైద్యులు, నర్సులు, ఆసుపత్రుల పారిశుద్ధ్య కార్మికులు, పారా- మెడికల్ స్టాఫ్.. వీరికే టీకామందు ను అందుకొనేందుకు తొలి హక్కు ఉన్నది అని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆసుపత్రుల తో పాటు ప్రైవేటు రంగానికి చెందిన ఆసుపత్రులకు కూడా ఈ ప్రాధాన్యం లభిస్తుంది అని ఆయన అన్నారు. కోవిడ్-19 టీకామందు ను ఇప్పించే కార్యక్రమాన్ని ఈ శనివారం, అంటే జనవరి 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రారంభించిన సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడారు.
వైద్య సిబ్బంది తరువాత, అత్యవసర సేవల సభ్యులకు, దేశ భద్రత పరిరక్షణ కు బాధ్యులైన వారికి, దేశం లో శాంతి- భద్రత ల పరిరక్షణ కు బాధ్యులైన వారికి టీకామందు ను ఇప్పించడం జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. మన భద్రత బలగాలు, రక్షకభట సిబ్బంది, అగ్నిమాపక దళం సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వరుస గా ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. వీరి సంఖ్య సుమారుగా 3 కోట్లు ఉంటుందని, వారికి టీకామందును ఇప్పించడానికి అయ్యే ఖర్చు ను భారత ప్రభుత్వం భరిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమానికి చేసిన పటిష్టమైనటువంటి ఏర్పాటులను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, రెండు మోతాదులను తీసుకోవడాన్ని తప్పించుకోకుండా అప్రమత్తంగా ఉండండి అంటూ ప్రజలకు జాగ్రత్త చెప్పారు. టీకామందు తాలూకు రెండో డోసు ను తీసుకొన్న రెండు వారాల తరువాత మాత్రమే కరోనా కు వ్యతిరేకం గా తగినంత వ్యాధి నిరోధక శక్తి ని మానవ శరీరం తయారు చేసుకొంటుందని ఆయన చెప్తూ, టీకామందు ను వేయించుకొన్న తరువాత కూడా ప్రజలు వారి పరిధి లో రక్షణ చర్యలను తీసుకొంటూనే ఉండవలసిందిగా సూచించారు.
కరోనా కు వ్యతిరేకం గా పోరాటం సలిపినంత కాలం కనబరచిన ఓరిమి నే, టీకాకరణ కాలంలో సైతం కనబరచండి అంటూ దేశవాసులను శ్రీ మోదీ
అభ్యర్థించారు.
***
(Release ID: 1689057)
Visitor Counter : 284
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada