నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై 3.0) మూడవ దశ రేపు ప్రారంభం
Posted On:
14 JAN 2021 10:38AM by PIB Hyderabad
ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై 3.0) మూడవ దశ రేపు దేశంలోని అన్ని రాష్ట్రాలలో 600 జిల్లాల్లో ప్రారంభం కానున్నది. నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత(ఎంఎస్‌డిఇ) మంత్రిత్వ శాఖ నేతృత్వంలో, ఈ దశ కొత్త తరం, కోవిడ్-సంబంధిత నైపుణ్యాలపై దృష్టి పెడుతుంది.
2020-2021 పథకం వ్యవధిలో స్కిల్ ఇండియా మిషన్ పిఎమ్‌కెవివై 3.0 ఎనిమిది లక్షల మంది అభ్యర్థులకు శిక్షణను 2020-2021 గాను రూ. 948.90 కోట్ల వ్యయంతో అంచనా వేసింది. నైపుణ్యం కలిగిన నిపుణుల పటిష్ట సమీకరణ ను రూపొందించడానికి 729 ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలు (పిఎంకెకెలు), పిఎమ్‌కెకె కాని శిక్షణా కేంద్రాలు, స్కిల్ ఇండియా కింద 200 కి పైగా ఐటిఐలు పిఎంకెవివై 3.0 శిక్షణను ప్రారంభించనున్నాయి. పిఎమ్‌కెవివై 1.0, పిఎమ్‌కెవివై 2.0 నుండి పొందిన అభ్యాసం ఆధారంగా, ప్రస్తుత విధాన సిద్ధాంతానికి సరిపోయేలా మరియు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రభావితమైన నైపుణ్య పర్యావరణ వ్యవస్థను శక్తివంతం చేయడానికి ఈ పథకం క్రొత్త సంస్కరణను మంత్రిత్వ శాఖ మెరుగుపరిచింది.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన “స్కిల్ ఇండియా మిషన్”. భారతదేశాన్ని ప్రపంచంలోని ‘నైపుణ్య రాజధాని’గా మార్చాలనే దృష్టిని అన్‌లాక్ చేయడానికి 2015 జూలై 15 న తన ప్రధాన పథకం పిఎంకెవివై ప్రారంభించడం ద్వారా విపరీతమైన ఊతం ఇచ్చింది.
నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, సహాయ మంత్రి శ్రీ రాజ్ కుమార్ సింగ్, రాష్ట్ర నైపుణ్య మంత్రులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రేపు మధ్యాహ్నం 12.30 నుండి అనుసరించవచ్చు:
PMKVY Facebook: www.facebook.com/PMKVYOfficial
Skill India Facebook: www. facebook.com/SkillIndiaOfficial
Skill India Twitter: www.twitter.com/@MSDESkillindia
Skill India Twitter: www.twitter.com/@MSDESkillindiaSkill India YouTube: https://www.youtube.com/channel/UCzNfVNX5yLEUhIRNZJKniHg
>>>>>>>
(Release ID: 1688544)
Visitor Counter : 304
Read this release in:
Urdu
,
Assamese
,
Tamil
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam