రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఎఎఫ్ కోసం 83 తేలికపాటి యుద్ధ విమానాల (ఎల్‌సిఎ)ను హెచ్ఎఎల్ నుంచి సేకరించడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
13 JAN 2021 5:27PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజున న్యూ ఢిల్లీ లో సమావేశమైన మంత్రిమండలి 45,696 కోట్ల రూపాయల ఖర్చుతో ‘తేజస్’ ఎమ్‌కె-1ఎ యుద్ధ విమానాలు 73ని, ‘తేజస్’ ఎమ్‌కె-1 రకం శిక్షణ విమానాలు 10ని సేకరించడంతో పాటు, 1,202 కోట్ల రూపాయల విలువ కలిగిన మౌలిక సదుపాయాల ఆకృతి, అభివృద్ధిసంబంధ అనుమతులకు కూడా ఆమోదం తెలిపింది.
ఎమ్‌కె-1ఎ రకానికి చెందిన తేలికపాటి పోరాట విమానాన్ని దేశీయంగా రూపుదిద్ది, అభివృద్ధిపరచి అత్యాధునికమైన 4+ తరం యుద్ధ విమానంగా తయారు చేయడం జరిగింది. ఈ విమానానికి కీలకమైన యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే (ఎఇఎస్ఎ) రాడార్, బియాండ్ విజువల్ రేంజ్ (బివిఆర్) క్షిపణి, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (ఇడబ్ల్యు) స్యూట్, ఎయర్ టు ఎయర్ రిఫ్యూయలింగ్ (ఎఎఆర్) హంగులతో పాటు, భారతీయ వాయుసేన, ఐఎఎఫ్ తాలూకు కార్యకలాపాలకు అవసరం అయ్యే అన్ని ఏర్పాట్లు జతపరచి ఉన్నాయి. ఇవి 50 శాతం మేర దేశవాళీగా తీర్చిదిద్దిన సామగ్రిని కలిగి ఉండి, క్రమంగా 60 శాతం ఈ తరహా సామర్ధ్యాన్ని సంతరించుకొనే పోరాట విమానాలలో మొట్టమొదటి ‘‘బియువై (Buy-Indian-Indigenously Designed, Developed and Manufactured)’’ కేటగిరీ సేకరణ గా నిలుస్తోంది.
మంత్రివర్గం ఐఎఎఫ్ ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఆమోదం తెలిపింది. ఇది మరమ్మత్తులను గానీ లేదా సర్వీసింగును గానీ వారి బేస్ డిపో లో చేపట్టేందుకు వీలు కల్పిస్తుంది. దీని ద్వారా మిషన్ క్రిటికల్ సిస్టమ్స్ తాలూకు టర్న్ అరౌండ్ వ్యవధి తగ్గనుంది. అంతేకాదు, కార్యకలాపాలకు వినియోగించుకోవడం కోసం విమానం లభ్యత సైతం పెరగనుంది. ఇది ఐఎఎఫ్ కు తన విమానశ్రేణిని మరింత సమర్ధంగా ఉపయోగించుకోవడానికి మార్గాన్ని సుగమం చేయనుంది.
‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ లో భాగంగా భారతదేశం రక్షణ రంగం లో అత్యాధునిక సాంకేతికతల ను, వ్యవస్థల ను దేశీయంగానే రూపకల్పన చేసి, అభివృద్ధి పరచి, ఉత్పత్తిని చేపట్టేందుకు కావలసిన శక్తిని నిరంతరాయంగా పెంపొందించుకొంటోంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్,హెచ్ఎఎల్ తేలికపాటి పోరాట విమానాన్ని తయారు చేయడం ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమానికి మరింత ఊతాన్ని ఇవ్వనుంది. దీనితోపాటు, రక్షణ రంగ ఉత్పత్తి కి దేశీయతను చేకూర్చగలుగుతుంది. ఈ సేకరణ ప్రక్రియలో సుమారు 500 భారతీయ కంపెనీలు హెచ్ఎఎల్ తో కలసి పని చేయనున్నాయి. ఈ కార్యక్రమం భారతదేశ ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇకోసిస్టమ్ ను ఒక హుషారైనా ‘ఆత్మనిర్భర్ లేదా స్వయం సమృద్ధి’ తో కూడిన వ్యవస్థ గా మార్పు చెందడంలో ఒక ఉత్ప్రేరకం వంటి పాత్రను పోషించనుంది.
***
(Release ID: 1688322)
Visitor Counter : 221
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada