సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా కూడా ఆల్‌ ఇండియా స్టేషన్ మూసివేయబడదని స్పష్టం చేసిన ప్రసార భారతి

Posted On: 13 JAN 2021 11:57AM by PIB Hyderabad

ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా కూడా ఆల్‌ ఇండియా స్టేషన్ మూసివేయబడదని ప్రసార భారతి ఈ రోజు స్పష్టం చేసింది.

ఆకాశవాణి స్టేషన్లను మూసివేసినట్లుగా  భారతదేశంలోని వివిధ మీడియా సంస్థల్లో వస్తున్న తప్పుడు రిపోర్టింగ్ మరియు నిరాధార వార్తలపై ప్రసార భారతి స్పందించింది. ఆ వార్తలు, నివేదికలు నిరాధారమైనవని మరియు వాస్తవ విరుద్దమైనవని  స్పష్టం చేసింది.

ప్రసార భారతి  ఏ రాష్ట్రం లేదా కేంద్ర భూభాగంలో ఎక్కడా కూడా ఏఐఆర్ స్టేషన్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం లేదా మార్చడం లేదని పేర్కొన్నారు. అన్ని ఎయిర్‌ స్టేషన్లు భాషా, సామాజిక-సాంస్కృతిక మరియు జనాభా వైవిధ్యానికి అనుగుణంగా స్థానిక ప్రోగ్రామింగ్‌ను కొనసాగిస్తూనే ఉంటాయి. స్థానిక ప్రతిభను పెంపొందించాలన్న ఎయిర్‌ లక్ష్య సాధనకు కృషి చేస్తూనే  ఉంటాయి అని తెలిపింది.

2021-2022 మధ్యకాలంలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న అనేక కీలక ప్రాజెక్టులతో ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో, ఎఐఆర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు ప్రసార భారతి ప్రకటించింది. భారతదేశం అంతటా వందకు పైగా కొత్త ఎఫ్‌ఎం రేడియో ట్రాన్స్‌మిటర్లతో ప్రసార భారతి తన నెట్‌వర్క్‌ను విస్తరించింది.

కొన్ని వందల స్టేషన్లు మరియు అనేక వందల రేడియో ట్రాన్స్మిటర్లతో కూడిన ఎయిర్‌ నెట్‌వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజా సేవా ప్రసార నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇది బహుళ రీతుల్లో పనిచేస్తుంది. టెరెస్ట్రియల్ అనలాగ్ రేడియో (ఎఎఫ్‌ఎం, ఎండబ్లు,ఎస్‌డబ్లు), శాటిలైట్ డీటీహెచ్‌ రేడియో (డిడి ఫ్రీ డిష్ డీటుహెచ్ ), ఇంటర్నెట్ రేడియో (ఐవోఎస్‌/అండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో న్యూస్‌ఆన్‌ ఎయిర్‌ యాప్‌).

డిడి ఫ్రీడిష్ డిటిహెచ్ సర్వీస్‌లో 48 శాటిలైట్ రేడియో ఛానెల్‌లు అందుబాటులో ఉన్నాయి. తద్వారా భారతదేశం అంతటా ఉన్న ప్రేక్షకులు రేడియో స్టేషన్లలో స్థానిక మరియు ప్రాంతీయ గాత్రాలను వినడానికి అవకాశం ఉంది.

న్యూస్‌ఆన్‌అయిర్ యాప్‌లో సుమారు 200 లైవ్ రేడియో ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. ప్రసార భారతి 2020లో 300 మిలియన్ల వీక్షణలతో ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఈ 200+ లైవ్ రేడియో ప్రసారాలను యాక్సెస్ చేస్తున్న 2.5 మిలియన్ల మంది వినియోగదారులతో "వోకల్ ఫర్ లోకల్" కు కొత్త ప్రపంచ అర్ధాన్ని ఇచ్చారు.

ప్రసార భారతి  భారతదేశంలో డిజిటల్ టెరెస్ట్రియల్ రేడియోను ప్రవేశపెట్టే ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. కొన్ని ఎంపిక చేయబడ్డ ఎయిర్‌ ఛానెల్స్ ఇప్పటికే డిజిటల్ DRM టెక్నాలజీ ద్వారా అనేక నగరాలు / ప్రాంతాలలో రేడియో సేవలు మరియు లైవ్ స్పోర్ట్స్ కాకుండాశ్రోతలకు ప్రయోగాత్మక ప్రాతిపదికన అందుబాటులో ఉన్నాయి. ఈ నగరాలు / ప్రాంతాలలో శ్రోతలు డిజిటల్ మోడ్‌లో ఒకే రేడియో సిగ్నల్‌ను లభించే బహుళ రేడియో ఛానెల్‌ల ఎంపిక ద్వారా డిజిటల్ రేడియో అనుభూతిని ఆస్వాదించవచ్చు. డీఆర్ఎం ట్రాన్స్మిటర్లలో లభించే ఆకాశవాణి యొక్క ప్రత్యేక డిజిటల్ రేడియోలో ఎయిర్‌ న్యూస్‌ 24x7 ఛానల్‌ వార్తలు మరియు వర్తమాన విషయాలకు కేటాయించబడింది. అలాగే ఎయిర్‌రాగం 24x7 రేడియో సేవలు  స్థానిక / ప్రాంతీయ శాస్త్రీయ సంగీతం పాటు ప్రత్యక్ష క్రీడా వార్తలకు కేటాయించబడింది.


ప్రసార భారతి ఎఫ్ఎమ్ రేడియో కోసం డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించే ప్రణాళికలు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. భారతదేశంలో డిజిటల్ ఎఫ్ఎమ్ రేడియో యొక్క ప్రసారాలను అందించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు  చేయబడతాయి.

***(Release ID: 1688206) Visitor Counter : 206