సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

Posted On: 09 JAN 2021 11:39AM by PIB Hyderabad

శ్రీ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ 125వ జయంతిని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు గాను ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఈ రోజు జారీ చేడ‌మైంది. ఈ
నెల 23వ తేదీ నుంచి సంవ‌త్స‌రం పాటు జరిగే సంస్మరణ కార్యక్రమాలపై ఈ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఉన్న‌త స్థాయి క‌మిటీలో విశిష్ట పౌరులు, చరిత్రకారులు, రచయితలు, నిపుణులు, శ్రీ నేతాజీ సుభాష్‌ చంద్రబోష్‌ కుటుంబ సభ్యుల‌తో పాటుగా నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ (ఐఎన్ఎ) తో సంబంధం ఉన్న ప్రముఖ వ్యక్తులు స‌భ్యులుగా ఉండ‌నున్నారు. న్యూఢిల్లీతో పాటు కోల్‌కతా మరియు నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌తో సంబంధం ఉన్న ఇతర ప్రదేశాలలోను, భారతదేశంతో పాటు విదేశాలలో కూడా ఈ నేతాజీ సంస్మరణ కార్యక్రమాలను గురించి ఈ కమిటీ మార్గదర్శకత్వం చేయ‌నుంది.

హై లెవల్ కమిటీ గెజిట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://egazette.nic.in/WriteReadData/2021/224300.pdf

                           

**********


(Release ID: 1687479)