ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (సిసిఇఎ)
జమ్ము & కశ్మీర్ లో పారిశ్రామిక అభివృద్ధి కి గాను కేంద్రీయ రంగ పథకానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం
మొట్టమొదటిసారిగా ఒక పారిశ్రామిక ప్రోత్సాహక పథకం అనేది పారిశ్రామిక అభివృద్ధి ని బ్లాకు స్థాయి కి తీసుకుపోతోంది
ఈ పథకం అవధి 2037వ సంవత్సరం వరకు ఉంది, దీని మొత్తం ఖర్చు 28,400 కోట్ల రూపాయలు
ఈ పథకం కొత్త పెట్టుబడి ని ప్రోత్సహించడం ఒక్కటే కాకుండా 5 సంవత్సరాల పాటు 5 శాతం రేటు తో జమ్ము & కశ్మీర్ లో ప్రస్తుత పరిశ్రమలకు నిర్వహణ సంబంధి ఆర్థిక సాయాన్ని అందించి వాటిని పెంచి పోషిస్తుంది కూడాను
ఈ పథకం ప్రధాన ప్రయోజనమల్లా ఉద్యోగాలను కల్పించడం; దీనితో ఆ ప్రాంతం సామాజికంగాను, ఆర్థికంగాను అభివృద్ధి చెందుతుంది
ఈ పథకం లక్ష్యం జమ్ము & కశ్మీర్ లో తయారీ రంగం తో పాటు సేవల రంగం యూనిట్ లను అభివృద్ధి చేయాలన్నదే
ఈ పథకం లో కేంద్ర పాలిత జమ్ము & కశ్మీర్ ప్రాంతానికి ఒక మహత్వపూర్ణ పాత్ర ను సంకల్పించడమైంది
Posted On:
07 JAN 2021 12:51PM by PIB Hyderabad
జమ్ము & కశ్మీర్ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఒక కేంద్రీయ రంగ పథకాన్ని అమలుచేయాలని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోశన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండ్ ఇంటర్నల్ ట్రేడ్ చేసిన ప్రతిపాదన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) సమావేశం పరిశీలించి, ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 28,400 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో 2037 వ సంవత్సరం వరకు ఆమోదం తెలపడమైంది.
భారత ప్రభుత్వం కేంద్ర పాలిత జమ్ము & కశ్మీర్ ప్రాంతం లో పరిశ్రమల అభివృద్ధికి గాను కొత్త పారిశ్రామికాభివృద్ధి పథకాన్ని (జె&కె ఐడిఎస్, 2021) ని కేంద్రీయ రంగ పథకం గా రూపొందించింది. ఉద్యోగాల కల్పనే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం గా ఉంది. ఈ పథకం ఆ ప్రాంతం లో సామాజిక, ఆర్థిక అభివృద్ధి కి ప్రత్యక్షంగా తోడ్పాటును అందించనుంది. 2019 వ సంవత్సరం అక్టోబరు 31 వ తేదీ నాటి నుంచి వర్తింపు లోకి వచ్చేటట్లుగా జమ్ము & కశ్మీర్ ను ‘జె&కె పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2019’ ప్రకారం ‘కేంద్ర పాలిత జమ్ము & కశ్మీర్ ప్రాంతం’గా పునర్ వ్యవస్థీకరించడం అనే చారిత్రక పరిణామం సంభవించడాన్ని పరిగణన లోకి తీసుకొని, ప్రస్తుత పథకాన్ని జె & కె లో పరిశ్రమ రంగం, సేవల రంగాల నాయకత్వం లో అభివృద్ధి చోటు చేసుకొనేటట్లుగా అమలు లోకి తీసుకురావడం జరిగింది. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధి, నూతన పెట్టుబడిని ఆకర్షించడం ద్వారా వర్తమాన పరిశ్రమలను అభివృద్ధి చేస్తారు. తద్ద్వారా జమ్ము & కశ్మీర్ లోని తయారీ, సేవల రంగాలు అభివృద్ధి చెందగలుగుతాయి.
పథకం లో భాగంగా ఈ కింద ప్రస్తావించిన ప్రోత్సాహకాలు అందుబాటు లోకి రానున్నాయి:
1. మూలధన పెట్టుబడి ప్రోత్సాహకం : ప్లాంట్ & మెశీనరీ లో (తయారీ రంగం లో) పెట్టే పెట్టుబడి గాని, లేదా భవనాల నిర్మాణం మరియు ఇతర అన్ని మన్నికైన భౌతిక సంపత్తుల లో (సేవల రంగం లో) పెట్టే పెట్టుబడి పై గాని జోన్- ఎ లో 30 శాతం, జోన్- బి లో 50 శాతం రేటు తో మూలధన పెట్టుబడి ప్రోత్సాహకం లభిస్తుంది. 50 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి ని పెట్టే యూనిట్ లు ఈ ప్రోత్సాహకాన్ని అందుకొనేందుకు అర్హత ను పొందుతాయి. జోన్- ఎ లో 5 కోట్ల రూపాయలు, జోన్- బి లో 7.5 కోట్ల రూపాయలు గరిష్ఠ ప్రోత్సాహకం గా దక్కుతుంది.
2. మూలధన వడ్డీ తాలూకు ప్రభుత్వ ఆర్థిక సహాయం: తయారీ రంగం లో ప్లాంట్ & మెశీనరీ (తయారీ రంగం లో) గాని, లేదా భవనాల నిర్మాణం మరియు ఇతర అన్ని మన్నికైన భౌతిక సంపత్తుల లో (సేవల రంగంలో) పెట్టుబడికి గాను 500 కోట్ల రూపాయల వరకు రుణ రాశి పై గరిష్టం గా 7 సంవత్సరాల కు గాను 6 శాతం వార్షిక రేటు వంతున మూలధన వడ్డీ తాలూకు ప్రభుత్వ ఆర్థిక సహాయం (కేపిటల్ ఇంటరెస్ట్ సబ్ వెన్శన్) ఉంటుంది.
3. జిఎస్‌టి తో ముడిపడిన ప్రోత్సాహకం: 10 సంవత్సరాల కాలానికి ప్లాంట్ & మెశీనరీ (తయారీ రంగం లో) గాని లేదా భవనాల నిర్మాణం మరియు ఇతర అన్ని మన్నికైన భౌతిక సంపత్తుల లో (సేవల రంగంలో) పెట్టిన వాస్తవ పెట్టుబడి లో 300 శాతం అర్హమైన విలువ వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరం లో ప్రోత్సాహక రాశి మొత్తం అర్హత గల రాశి లో పదింట ఒక వంతు కు మించదు.
4. నిర్వహణ మూలధన వడ్డీ తాలూకు ప్రభుత్వ ఆర్థిక సహాయం: అన్ని ప్రస్తుత యూనిట్ లకు గరిష్ఠం గా 5 సంవత్సరాలకు గాను 5 శాతం వార్షిక రేటు తో ప్రోత్సాహకాన్ని ఇస్తారు. ప్రోత్సాహకం తాలూకు గరిష్ఠ పరిమితి ఒక కోటి రూపాయలు గా ఉంది.
పథకం తాలూకు ముఖ్య అంశాలు:
1. అటు చిన్న యూనిట్ లకు, ఇటు పెద్ద యూనిట్ లకు.. రెంటికీ ఆకర్షణీయంగా ఉండేటట్లు పథకాన్ని తీర్చిదిద్దడమైంది. ప్లాంట్ & మెశీనరీ లో 50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే చిన్న యూనిట్ లకు 7.5 కోట్ల రూపాయల వరకు మూలధన ప్రోత్సాహకం అందుతుంది. గరిష్టంగా 7 సంవత్సరాల కాలానికి మూలధన వడ్డీ తాలూకు ప్రభుత్వ ఆర్థిక సహాయం (కేపిటల్ ఇంటరెస్ట్ సబ్ వెన్శన్) 6 శాతం రేటు తో అందుతుంది.
2. కేంద్రపాలిత జమ్ము & కశ్మీర్ ప్రాంతం లో బ్లాకు స్థాయి కి పారిశ్రామిక అభివృద్ధి ని తీసుకుపోవాలన్నదే ఈ పథకం ఉద్దేశ్యం గా ఉంది. భారత ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక పథకాల లో ఇటువంటి పథకం ఇదే మొట్టమొదటిది. అంతేకాదు, ఇదియావత్తు కేంద్రపాలిత ప్రాంతం లో మరింత ఎక్కువ నిలకడతనం తో కూడినటువంటి, సమతులమైనటువంటి పారిశ్రామిక వృద్ధి ని సాధించడానికి చేపట్టిన ప్రయత్నం కూడాను.
3. జిఎస్‌టి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాన్ని జతపరచి పథకాన్ని వ్యాపార పరమైన సౌలభ్యానికి తగినట్లుగా సరళతరం గా మలచడం జరిగింది. జిఎస్‌టి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం పారదర్శకత్వం విషయం లో రాజీ కి తావు ఇవ్వకుండా నియమ పాలన భారాన్ని తగ్గించేందుకు కూడా పూచీ పడుతుంది.
4. ఈ పథకం అమలు లో, ఈ పథకం రిజిస్ట్రేషన్ లో కేంద్ర పాలిత జమ్ము & కశ్మీర్ ప్రాంతానికి ఒక ప్రధానమైన పాత్ర ను అప్పగించడం జరిగింది. క్లెయిములను స్వీకరించే కంటే ముందు ఒక స్వతంత్ర ఆడిట్ ఏజెన్సీ ద్వారా తగిన నియంత్రణలు, జాగ్రత్తలు తీసుకొనే వ్యవస్థ ను ఏర్పరచడమైంది.
5. ఇది జిఎస్‌టి ని తిరిగి చెల్లించడమో, లేదా వాపసు చేయడమో కాదు; కానీ, జమ్ము & కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి నష్టానికి పరిహారాన్ని అందించడం కోసం పారిశ్రామిక ప్రోత్సాహక అర్హత ను నిర్ధారించడంలో స్థూల జిఎస్ టి ని వినియోగించడం జరుగుతుంది.
6. ఇదివరకటి పథకాలలో అనేక ప్రోత్సాహకాలను ఇవ్వజూపడం జరిగింది. అయితే, వాటి సంపూర్ణ ఆర్థిక సహాయం ఈ కొత్త పథకాని కంటే చాలా తక్కువ గా ఉండింది.
ప్రధాన ప్రభావం మరియు ఉద్యోగాల కల్పన సామర్థ్యం:
1. ఈ పథకాన్ని కొత్త పెట్టుబడి ని ఆకర్షించడం తో పాటు, ఇప్పటికే ఉన్న పెట్టుబడులను పెంచి పోషించడం ద్వారా నిలకడతనం తో కూడిన అభివృద్ధిని, నైపుణ్యాల అభివృద్ధిని, ఉద్యోగ కల్పన పై ప్రాధాన్యాన్ని కట్టబెడుతూ, జమ్ము & కశ్మీర్ లో ఇప్పుడు నెలకొన్న పారిశ్రామిక వ్యవస్థ లో సమూల పరివర్తన ను తీసుకు రావడం కోసం ఉద్దేశించినటువంటిది. దీని ద్వారా జమ్ము & కశ్మీర్ జాతీయస్థాయి లోను, దేశం లో పారిశ్రామిక ప్రగతిని సాధించిన ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతోను పోటీ పడగలిగేటట్లు చూడటం దీని లక్ష్యంగా ఉంది.
2. ప్రతిపాదిత పథకం ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలను అందిస్తుందని, ఇదివరకు ఎన్నడూ ఎరుగని స్థాయిలో పెట్టుబడిని ఆకట్టుకొంటుందని ఆశించడం జరుగుతోంది. దీనికి అదనంగా, నిర్వహణ పరమైన మూలధన పెట్టుబడి తాలూకు వడ్డీ లో ప్రభుత్వ ఆర్థిక సహాయం కారణం గా ఈ పథకం ఇంచుమించు 35,000 మందికి పరోక్ష మద్ధతు ను ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంది.
ఈ పథకానికి అయ్యే వ్యయం:
ప్రతిపాదిత పథకం తాలూకు ఆర్థిక వ్యయం 2020-21 వ ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2036-37 ఆర్థిక సంవత్సరం మధ్య కాలం లో 28,400 కోట్ల రూపాయలు గా ఉంది. ఇంతవరకు వివిధ ప్రత్యేక ప్యాకేజీ పథకాల లో భాగం గా 1,123.84 కోట్ల రూపాయలను ఇవ్వడమైంది.
***
(Release ID: 1686842)
Visitor Counter : 308
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam