భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

అంటార్కిటికాకు 40వ శాస్త్రీయ అన్వేషణ యాత్ర ప్రారంభం

చార్టర్డ్ ఐస్ క్లాస్ నౌక ఎంవి వాసిలీ గోలోవ్నిన్ ప్రయాణం ప్రారంభించి 30 రోజుల్లో అంటార్కిటికాను చేరుకుంటుంది.

40మందితో కూడిన బృందాన్ని అక్కడ దింపి, ఏప్రిల్ 2021లో భారత్ కు తిరిగి వస్తుంది. తిరుగుప్రయాణంలో ముందు యాత్రకు వెళ్ళిన శీతాకాలపు బృందాన్ని తీసుకువస్తుంది

Posted On: 04 JAN 2021 4:41PM by PIB Hyderabad

అంటార్కిటికాకు 40వ శాస్త్రీయ అన్వేషణ యాత్ర‌కు స‌న్నాహాల‌ను సోమ‌వారంనాడు భార‌త్ ప్రారంభించింది. శ్వేత ఖండానికి ద‌క్షిణ ప్రాంతంలో భార‌త్ గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా దేశం చేస్తున్న శాస్త్రీయ అన్వేష‌ణ‌కి, కృషికి ఈ యాత్ర  సంకేతం. సుమారు 43మంది స‌భ్యుల‌తో కూడిన ఈ 40వ అన్వేష‌ణ యాత్రను జ‌న‌వ‌రి 5, 2021న గోవాలో జెండా ఊపి ప్రారంభిస్తారు. చార్టర్డ్  ఐస్ క్లాస్ నావ ఎంవి వాసిలీ గోలోవ్నిన్, గోవా నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి 30 రోజులలో అంటార్కిటికాను చేరుకుంటుంది. సుమారు 40మంది సభ్యులను అక్కడ వదిలిపెట్టి, ఏప్రిల్ 2021లో అది తిరిగి భారత్ కు రానుంది. తిరిగి వచ్చేటప్పుడు, ముందు యాత్రలో వెళ్ళిన శీతాకాలపు బృందాన్ని తీసుకురానుంది. 
అంటార్కిటికాకు భారత్ శాస్త్ర అన్వేషణ యాత్రలు 1981లో ప్రారంభమయ్యాయి. తొలి ప్రయాణంలో డాక్టర్ ఎస్ జెడ్ ఖాసిం నేతృత్వంలో 21మంది శాస్త్రవేత్తలు, సహాయక సిబ్బంది వెళ్ళారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన భారతీయ అంటార్కిటికా కార్యక్రమం అక్కడ దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అన్న పేర్లతో మూడు శాశ్వత పరిశోధన బేస్ స్టేషన్లను నేటి వరకు నిర్మించింది. ప్రస్తుతం భారత్ కు అంటార్కిటికాలో మైత్రి, భారతి అన్న రెండు నిర్వహణ పరిశోధన స్టేషన్లు ఉన్నాయి. మొత్తం భారతీయ అంటార్కిటికా కార్యక్రమాన్ని గోవాలోని ది నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (ఎన్సిపిఒ ఆర్) నిర్వహిస్తుంది.  
ఇంతకు ముందు అంటార్కిటికాకు వెళ్లిన 39వ భారత శాస్త్రీయ అన్వేషణ యాత్రను నవంబర్, 2019లో ప్రారంభించారు. ఇది వాతావరణ ప్రక్రియ, వాతావరణ మార్పుతో దానికి గల సంబంధం, ఉపరితల పరిణామం, పర్యావరణ ప్రక్రియలు, పరిరక్షణ, భౌగోళిక, సమీపతీర ప్రాంతాల పర్యావరణ వ్యవస్థ, పరిశీలనాత్మక పరిశోధన, పోలార్ సాంకేతికతపై దృష్టి పెట్టి 27 శాస్త్రీయ ప్రాజెక్టులను ప్రారంభించింది. వీటితో పాటుగా, జపాన్ కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ భాగస్వామ్యంతో రెండు అదనపు సహకార ప్రాజెక్టులను చేపట్టింది. తన మిషన్ ను పూర్తి చేసిన అనంతరం, అది మే,2020లో భారత్ కు తిరిగి వచ్చింది. మైత్రి, భారతిలో జీవ సహాయ వ్యవస్థల కార్యకలాపాలు, నిర్వహణ కోసైం అవసరమైన  ఆహారం, ఇంధనం, సరుకులు, స్నో మొబైల్స్ ను తిరిగి నింపింది. శీతాకాలపు కార్యకలాపాలు, నిర్వహణ కోసం 48మంది సభ్యులతో కూడిన బృందాన్ని అది అంటార్కిటికాకు తీసుకువెళ్లింది. కోవిడ్‌-19 మహమ్మారికి సంబంధించి ఉనికిలో ఉన్న సవాళ్ల కారణంగా 40వ భారతీయ అంటార్కిటికా యాత్ర శాస్త్రీయ, లాజిస్టిక్ కార్యకలాపాలు పరిమితంగా ఉండనున్నాయి. ఈ బృందం  వాతావరణ  మార్పు, భూగర్భ శాస్త్రం, సముద్ర పరిశీలనలు, విద్యుత్, ఐస్కాంత ప్రవాహాల కొలతలు, పర్యావరణ పర్యవేక్షణ వంటి కొనసాగుతున్న శాస్త్రీయ ప్రాజెక్టులకు తోడ్పడడం, ఆహారం, ఇంధనం, సరుకులు, విడిభాగాలు తిరిగి సరఫరా చేయడం, శీతాకాలపు సిబ్బందిని తిరిగి వెనక్కిపంపడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. అంటార్కిటికా ఖండాన్ని కోవిడ్-19 రహితంగా నిర్వహించేందుకు భారత్ కట్టుబడి ఉంది. కౌన్సిల్  ఆఫ్ మేనేజర్స్ ఆఫ్ నేషనల్ అంటార్కిటిక్ ప్రోగ్రామ్స్ (COMNAP) నిబంధనలకు అనుగుణంగా వ్యక్తులు, సామాగ్రి మోహరింపుకు సంబంధించిన అన్ని ప్రోటోకాళ్ళను ఈ యాత్ర అనుసరిస్తుంది. సరుకును ముందుగానే శానిటైజ్ చేయడం, పధ్నాలుగు రోజుల తప్పనిసరి క్వారెంటైన్ (యాత్రకు ముందు, తిరిగి వచ్చాక), ఐస్ క్లాస్ నౌకలో బయలుదేరేముందు ఆర్ టి- పిసి ఆర్ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. 

***



(Release ID: 1686135) Visitor Counter : 305