ప్రధాన మంత్రి కార్యాలయం
అటు రాశి పరంగా, ఇటు వాసి పరంగా కూడా ‘ఆత్మనిర్భర్ భారత్’ ను ఆవిష్కరించడం జరగాలి: ప‌్రధాన మంత్రి
ప్రపంచం లో మనం ఏ స్థాయి లో ఉన్నాము అనే దానికి మెట్రలాజి అనేది అద్దం పడుతుంది: ప‌్రధాన మంత్రి
Posted On:
04 JAN 2021 5:10PM by PIB Hyderabad
‘ఆత్మనిర్భర్ భారత్’ ను ఇటు వాసి పరంగాను, అటు రాశి పరంగాను ఆవిష్కరించవలసి ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ‘నేశనల్ మెట్రలాజీ కాన్‌క్లేవ్ 2021’ సందర్భంలో ప్రసంగిస్తూ, ఈ మాటలు అన్నారు. నేశనల్ మెట్రలాజి కాన్‌క్లేవ్ 2021 సందర్భం లో ఆయన ‘నేశనల్ అటామిక్ టైమ్ స్కేల్’ ను, ‘భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళి’ని దేశ ప్రజలకు అంకితం చేశారు. అంతేకాకుండా, ‘నేశనల్ ఇన్‌వైరన్ మంటల్ స్టాండర్డ్స్ లబారటరి’ కి కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ‘‘మన ధ్యేయం భారతదేశ ఉత్పత్తులతో అంతర్జాతీయ బజారులను వెల్లువెత్తించడం ఒక్కటే కాదు, ప్రజల మనస్సులను గెలుచుకోవాలని కూడా మనం కోరుకొంటున్నాం. మనం భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండు తో పాటు ఆమోదం సైతం లభించాలని అభిలషిస్తున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
దశాబ్దాల తరబడి భారతదేశం నాణ్యత, కొలతల పరంగా విదేశీ ప్రమాణాలపై ఆధారపడుతూ వచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు. అయితే, ఇప్పుడు భారతదేశం యొక్క వేగం, ప్రగతి, ఎదుగుదల, ప్రతిష్ట, బలం.. వీటిని మన స్వీయ ప్రమాణాలే నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు. మెట్రలాజి అంటే సామాన్య పరిభాష లో తూనిక లు, కొలత ల కు సంబంధించిన విజ్ఞాన శాస్త్రమని, అది ఏ విజ్ఞాన శాస్త్ర పరమైన కార్యసాధనకైనా పునాది ని కూడా వేస్తుందని ఆయన చెప్పారు. ఒక బలమైన కొలిచే సాధనమనేది లేకుండా ఏ పరిశోధన కూడాను ముందుకు సాగదు. మన కార్యసిద్ధులు సైతం ఏదో ఒక విధమైన తూనిక కు నిలచేవే అని ఆయన అన్నారు. ప్రపంచం దృష్టి లో దేశ విశ్వసనీయత ఆ దేశ తూనికలకు, కొలతలకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రం తాలూకు విశ్వసనీయత పై ఆధారపడుతుందని ఆయన అన్నారు. మెట్రలాజి అనేది ప్రపంచం లో మన స్థానం ఏమిటన్నది తెలియజేసే ఒక అద్దం లాంటిదని ఆయన అన్నారు.
ఒక స్వయంసమృద్ధియుత భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న లక్ష్యం రాశి తో పాటు వాసి తో కూడుకొని ఉంటుందని ప్రధాన మంత్రి తెలిపారు. ప్రపంచాన్ని భారతదేశ ఉత్పత్తుల తో నింపివేసేందుకు బదులుగా, భారతదేశ ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రతి వినియోగదారు హృదయాన్ని గెలుచుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు ప్రపంచ డిమాండు ను తీర్చేవి గా మాత్రమే ఉండకుండా ప్రపంచ ఆమోదాన్ని కూడా పొందేలా చూడాలని ఆయన నొక్కి చెప్పారు. ‘‘నాణ్యత, విశ్వసనీయత.. ఈ స్తంభాలపై ‘బ్రాండ్ ఇండియా’ ను బలంగా మనం నిలబెట్టవలసివుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
దేశ ప్రజలకు ఈ రోజు న అంకితం అయినటువంటి ‘భారతీయ నిర్దేశిక్ ద్రవ్య’ అనేది పరిశ్రమ కు భారీ లోహాలు, పురుగు మందులు, ఔషధ నిర్మాణం, వస్త్రాలు తదితర రంగాలలో ఒక ‘సర్టిఫైడ్ రెఫరన్స్ మెటీరియల్ సిస్టమ్’ ను రూపొందించడం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడానికి సహాయకారి కాగలదని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం పరిశ్రమ నియంత్రణ ప్రధానమైన వైఖరి కి బదులు గా వినియోగదారు ప్రధానమైన వైఖరి దిశ గా పయనిస్తోంది అని కూడా ఆయన వివరించారు. ఈ కొత్త ప్రమాణాలతో పాటు దేశంలోని జిల్లాల లో స్థానిక ఉత్పత్తులకు ప్రపంచ గుర్తింపు ను తీసుకువచ్చేటటువంటి ఒక ప్రచార ఉద్యమం కూడా ఉన్నదని, ఇది మరీ ముఖ్యం గా మన ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి ప్రయోజనకారి కాగలదని ఆయన అన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు తుల తూగడమనేది సరఫరా వ్యవస్థ ను అన్వేషిస్తూ భారతదేశానికి తరలి వస్తున్న బడా విదేశీ తయారీ కంపెనీలకు సహాయకారి అవుతుందని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త ప్రమాణాలతో అటు ఎగుమతులతోపాటు ఇటు దిగుమతులకు నాణ్యతపరంగా పూచీ పడినట్లు అవుతుంది అని ఆయన చెప్పారు. ఇది భారతదేశం లో సాధారణ వినియోగదారు కు నాణ్యమైన వస్తువులను కూడా అందిస్తుందని, ఎగుమతిదారు కు ఎదురయ్యే సమస్యలను తగ్గిస్తుందని ఆయన వివరించారు.
-Narendra Modi
@narendramodi
Aatmanirbhar Bharat is about quantity and quality.
Our aim is not to merely flood global markets.
We want to win people's hearts.
We want Indian products to have high global demand and acceptance. pic.twitter.com/7JsfSlBT35
— Narendra Modi (@narendramodi) January 4, 2021
***
(Release ID: 1686026)
Visitor Counter : 196
Read this release in:
Urdu
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam