ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
యుకె కరోనా తాజా సమాచారం ఇప్పటివరకు సోకినవారి సంఖ్య 38
Posted On:
04 JAN 2021 3:39PM by PIB Hyderabad
కొత్త రకం యుకె కరోనా వైరస్ సోకినట్టు 38 శాంపిల్స్ నిర్థారించాయి. అందులో బెంగళూరులోని నిమ్హాన్స్ 10 కేసులు, హైదరాబాద్ లోని సిసిఎంబి 3 కేసులు, పూణెలోని ఎన్ ఐ వి 5 కేసులు, ఢిల్లీలోని ఐజిఐబి 11 కేసులు, ఢిల్లీలోని 8 కేసులు, కోల్ కతా లోని ఎన్ సి బిజి 1 కేసు గుర్తించాయి. అయితే, బెంగళూరులోని ఎన్ సి బి ఎస్, ఇన్ స్టెమ్. హైదరాబాద్ లోని సి డి ఎఫ్ డి, భువనేశ్వర్ లోని ఐఎల్ ఎస్, పూణెలోని ఎన్ సి సి ఎస్ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా గుర్తించలేదు.
సంఖ్య
|
సంస్థ/ లాబ్
|
పరిధి
|
గుర్తించిన కేసులు
|
1
|
ఎన్ సి డి సిమ్, న్యూ ఢిల్లీ
|
ఆరోగ్య మంత్రిత్వశాఖ
|
8
|
2
|
ఐజిఐబి, న్యూ డ్గిల్లీ
|
సి ఎస్ ఐ ఆర్
|
11
|
3
|
ఎన్ సి బిజి కల్యాణి ( కోల్ కతా)
|
బయోటెక్నాలజీ విభాగం
|
1
|
4
|
ఎన్ ఐ వి, పూణె
|
ఐసిఎంఆర్
|
5
|
5
|
సిసిఎంబి, హైదరాబాద్
|
సి ఎస్ ఐ ఆర్
|
3
|
6
|
నిమ్హాన్స్, బెంగళూరు
|
ఆరోగ్య మంత్రిత్వశాఖ
|
10
|
మొత్తం : 38
పాజిటివ్ గా నిర్థారణ జరిగిన శాంపిల్స్ ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని 10 లాబ్ లలో ( ఎన్ ఐ బి ఎం జి, కోల్ కతా; ఐ ఎల్ ఎస్ , భువనేశ్వర్; ఎన్ ఐ వి, పూణె; ఎన్ సి సి ఎస్, పూణె; సిసిఎం బి, హైదరాబాద్; సిడి ఎఫ్ డి, హైదరాబాద్, ఇన్ స్టెమ్, బెంగళూరు; నిమ్హాన్స్, బెంగళూరు; ఐజిఐబి న్యూ ఢిల్లీ, ఎన్ సి డిసి, న్యూఢిల్లీ) జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు.
వీరందరినీ ఆయా రాష్ట ప్రభుత్వాలు నిర్దేశిత ఆరోగ్య కేంద్రాల్లో వేరు వేరు గదుల్లో ఏకాంతంగా ఉంచుతున్నాయి. వారికి సన్నిహితంగా మెలగినవారిని కూడా క్వారంటైన్ లో ఉంచుతున్నారు. సహ ప్రయాణీకులు, కుటుంబ సభ్యులు తదితరుల ఆనవాళ్ళు గుర్తించటం మీద దృష్టిపెట్టారు. ఇతర శాంపిల్స్ మీద కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కొనసాగుతోంది.
పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాలకు ఈ విషయంలో క్రమం తప్పకుండా సలహాలు ఇస్తూ నిఘా, నియంత్రణ, నిర్థారణ, ప్రభుత్వం నిర్దేశించిన 10 లాబ్ లకు నమూనాలు పంపటం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
***
(Release ID: 1686018)
Visitor Counter : 193
Read this release in:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil