సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రసార భారతి (డిడి-ఎయిర్‌) 2020 లో భారీ డిజిటల్ వృద్ధిని నమోదు చేసింది

డిడి మరియు ఆల్‌ ఇండియా రేడియోలకు పాకిస్తాన్‌లో రెండవ స్థానంలో డిజిటల్ ప్రేక్షకులు

Posted On: 03 JAN 2021 4:22PM by PIB Hyderabad

ప్రసార భారతికి చెందిన డిజిటల్ ఛానళ్లు డిడి మరియు ఆకాశవాణి 2020లో  100% కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి. ఇవి బిలియన్ డిజిటల్ వీక్షణలు మరియు 6 బిలియన్ డిజిటల్ వాచ్ మినిట్స్ సాధించాయి.

2020 లో, న్యూస్ఆన్ ఎయిర్ యాప్ 2.5 మిలియన్లకు పైగా వినియోగదారులను, 300 మిలియన్లకు పైగా వీక్షణలను లైవ్ రేడియో స్ట్రీమింగ్‌తో నమోదు చేసింది. ఇందులో 200కి పైగా ప్రసారాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి.

ప్రసార భారతికి చెందిన డిడి నేషనల్‌ మరియు డిడి న్యూస్‌ టాప్‌ 10లో డిడి సహ్యాద్రి నుండి మరాఠీ న్యూస్, డిడి చందనకు చెందిన కన్నడ కార్యక్రమాలు, డిడి బంగ్లా నుండి బంగ్లా న్యూస్ మరియు డిడి సప్తగిరి తెలుగు కార్యక్రమాలు ఉన్నాయి.

డిడి స్పోర్ట్స్ మరియు ఆకాశవాణి స్పోర్ట్స్ లైవ్ కామెంటరీతో స్థిరమైన డిజిటల్ ఫాలోయింగ్‌ను సృష్టించగా, ప్రసార భారతి ఆర్కైవ్స్ మరియు డిడి కిసాన్ టాప్ 10 లో స్థిరమైన డిజిటల్ ప్రదర్శనజాబితాలో ఉన్నాయి.

ఈశాన్యరాష్ట్రాల  వార్తల వినే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆల్ ఇండియా రేడియో న్యూస్ యొక్క ఈశాన్య సేవ కూడా టాప్ 10 లో ఉంది. అలాగే యాదృచ్ఛికంగా లక్ష చందాదారుల డిజిటల్ మైలురాయిని దాటింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2020లో  పాకిస్తాన్‌లో డిడి మరియు ఎయిర్‌ కంటెంట్ భారతదేశంలోని దేశీయ ప్రేక్షకుల తరువాత  రెండవ అత్యధిక డిజిటల్ ప్రేక్షకులను కలిగి ఉంది. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఉంది.

2020లో అత్యంత ప్రాచుర్యం పొందిన డిజిటల్ వీడియోలలో పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి, 2020 రిపబ్లిక్ డే పరేడ్, డిడి నేషనల్ ఆర్కైవ్స్ నుండి ప్రసారం చేసిన 1970 లలో శకుంతల దేవి యొక్క అరుదైన వీడియో ఉన్నాయి.


అన్ని సంస్కృత భాషా ప్రసారాల కోసం ప్రత్యేకమైన ప్రసార భారతి యూట్యూబ్ ఛానెల్ 2020 లో ప్రారంభించబడింది. దీనిలో డిడి,ఎయిర్‌ దేశవ్యాప్త నెట్‌వర్క్‌లో సంస్కృత భాషలో ప్రసారం  చేయబడుతున్న అన్ని రేడియో మరియు టీవీ కంటెంట్ అప్‌లోడ్ చేయబడతాయి, వీక్షకులకు సులభంగా చేరుకోవచ్చు.


మన్ కి బాత్‌కు ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ మరియు ట్విట్టర్ ఖాతాలు 2020 లో వేగంగా వృద్ధిని సాధించాయి. మన్ కి బాత్ అప్‌డేట్స్‌ అందించే ట్విట్టర్ ఖాతాలో ఇప్పుడు 67,000 మందికి పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. యూట్యూబ్ ఛానెల్‌లో మన్ కీ బాత్ యొక్క విభిన్న ఎపిసోడ్‌ల ప్రాంతీయ భాషా వెర్షన్లు ఉన్నాయి.


వివిధ భారతీయ భాషలలోని దాదాపు 1500 రేడియో నాటకాలు డిడి-ఎయిర్‌ నెట్‌వాక్‌లో అందుబాటులో ఉన్నాయి. అవి ఇప్పుడు డిజిటలైజ్ చేయడంతో పాటు యూట్యూబ్ ఛానెల్‌లలో అప్‌లోడ్ చేయబడ్డాయి.

వేలాది గంటల విద్యకు సంబంధిన కార్యక్రమాలు మరియు టెలిక్లాసేర్ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానెళ్లలో వివిధ భారతీయ భాషలలో అందుబాటులో ఉన్నాయి.

గొప్ప చారిత్రక విలువ కలిగిన అరుదైన ఆర్కైవల్ కంటెంట్ డిడి ఎయిర్‌లో మాత్రమే లభిస్తుంది. దీనిని ప్రసార భారతి ఆర్కైవ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో డిజిటైజ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఉన్న డిడి మరియు ఆకాశవాణి యొక్క వివిధ స్టేషన్లలో అనేక దశాబ్దాలుగా రికార్డ్ చేయబడిన వేలాది టేపుల నుండి ఇటువంటి సంగీత, సాంస్కృతిక, రాజకీయ విషయాలను డిజిటిల్ రూపంలో మార్చడానికి ఒక ప్రత్యేక బృందం కృషి చేస్తోంది. కాబట్టి ఈ కంటెంట్ విద్యా మరియు పరిశోధన ప్రయోజనాల కోసం అందరికీ పబ్లిక్ డొమైన్‌లో సులభంగా ఉపయోగించుకోవడానికి  అందుబాటులో ఉంది.

***



(Release ID: 1685913) Visitor Counter : 143