రాష్ట్రప‌తి స‌చివాల‌యం

సందర్శకుల కోసం ఈనెల 5 నుంచి పునఃప్రారంభం కానున్న రాష్ట్రపతి భవన్‌ మ్యూజియం

Posted On: 01 JAN 2021 4:37PM by PIB Hyderabad

కరోనా కారణంగా గతేడాది మార్చి 13వ తేదీ నుంచి మూతబడిన రాష్ట్రపతి భవన్‌ మ్యూజియం కాంప్లెక్స్‌ను, సందర్శకుల కోసం ఈనెల 5 నుంచి మళ్లీ తెరవనున్నారు. సోమవారం, ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఇది తెరిచే ఉంటుంది. https://presidentofindia.nic.in లేదా https://rashtrapatisachivalaya.gov.in/ లేదా https://rbmuseum.gov.in/ ద్వారా సందర్శన సమయాన్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. గతంలోలాగే సందర్శకుడికి రూ.50 చొప్పున నమోదు రుసుము ఉంటుంది. ఇంతకుముందు ఉన్న స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు.
    
    సామాజిక దూరం నిబంధనలు అమలు కోసం, ఉదయం 9.30-11 గం.; ఉదయం 11.30-మధ్యాహ్నం 1 గం.; మధ్యాహ్నం 1.30-3 గం.; మధ్యాహ్నం 3.30-సాయంత్రం 5 గం. కాలవ్యవధితో నాలుగు ముందుస్తు బుకింగ్‌ స్లాట్లను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో స్లాట్‌లో గరిష్టంగా 25 మందిని మాత్రమే అనుమతిస్తారు. మాస్కులు, సామాజిక దూరం, ఆరోగ్య సేతు యాప్‌ వంటి కొవిడ్‌ ప్రొటోకాల్‌ను సందర్శకులు విధింగా పాటించాలి. కొవిడ్‌ సోకే అవకాశాలున్నవారిని ఈ పర్యటనకు అనుమతించరు.

    రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్ అనేది అంశాల వారీగా చరిత్రను వివరించే ప్రదర్శనశాల. కళ, సంస్కృతి, వారసత్వం, చరిత్రకు చిహ్నాలైన వెలకట్టలేని కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. https://rbmuseum.gov.in/ లో మరిన్ని వివరాలను చూడవచ్చు.

***


(Release ID: 1685430) Visitor Counter : 281