ప్రధాన మంత్రి కార్యాలయం

34వ ప్రగతి చర్చలకు అధ్యక్షత వహించిన - ప్రధానమంత్రి

Posted On: 30 DEC 2020 7:31PM by PIB Hyderabad

ఈ రోజు జరిగిన, 34వ ప్రగతి చర్చలకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.  ఈ రోజు జరిగిన సమావేశంలో, వివిధ ప్రాజెక్టులుకార్యక్రమాలు మరియు ఫిర్యాదులను సమీక్షించారు.  రైల్వే మంత్రిత్వ శాఖ; రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ; గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాజెక్టులపై చర్చించారు.   మొత్తం ఒక లక్ష కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులలో - ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్, పశ్చిమ ‌బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, దాద్రా-నగర్-హవేలీలతో సహా, పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి.

పరస్పర చర్చల సందర్భంగా, ఆయుష్మాన్ భారత్; జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలను సమీక్షించారు.   అలాగే వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఫిర్యాదులను కూడా చేపట్టారు.

ఫిర్యాదుల సమగ్ర పరిష్కారాన్ని నిర్ధారించడానికి, చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధానమంత్రి అధికారులందరినీ ఆదేశించారు.  సమీక్షించబడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను ముందుగా పరిష్కరించి, నిర్ణీత తేదీ కంటే ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రధాన మంత్రి, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరారు.  ఆయుష్మాన్ భారత్ పధకంలో, నూరు శాతం నమోదు కోసం అన్ని రాష్ట్రాలు తొందరగా కృషి చేయాలని ఆయన అన్నారు.  జల్ జీవన్ మిషన్ కింద లక్ష్యాలను యుద్ధ ప్రాతిపదికన సాధించడానికి వీలుగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రోత్సహించారు.

ఇంతకూ ముందు జరిగిన, 33వ ప్రగతి చర్చల్లో, 18 రంగాలలోని, 50 కార్యక్రమాలు / పథకాలతో సహా, మొత్తం 280 ప్రాజెక్టులకు సంబంధించిన ఫిర్యాదులను చేపట్టారు.

*****



(Release ID: 1684955) Visitor Counter : 117