మంత్రిమండలి

బాహ్య అంత‌రిక్షాన్ని శాంతియుత ప్ర‌యోజ‌నాల‌కు వినియోగించుకోవ‌డంలో భార‌త‌దేశానికి, భూటాన్ కు మ‌ధ్య స‌హ‌కారం అంశానికి సంబంధించిన ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 30 DEC 2020 3:42PM by PIB Hyderabad

బాహ్య అంత‌రిక్షాన్ని శాంతియుత ప్ర‌యోజ‌నాల కోసం వినియోగించుకోవ‌డంలో స‌హ‌కరించుకోవడం అనే అంశంపై భార‌త‌దేశ గ‌ణ‌తంత్ర ప్ర‌భుత్వానికి, రాయ‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ భూటాన్ కు మ‌ధ్య 2020 వ సంవ‌త్స‌రం న‌వంబ‌రు 19 వ తేదీ న బెంగ‌ళూరు/థింపూ ల‌లో ఇరు ప‌క్షాలు సంత‌కాలు చేసి ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకొన్న అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రానికి (ఎమ్ఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఈ రోజున జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

అంశాల వారీగా వివ‌రాలు:

ఈ ఎమ్ఒయు తో భూమి తాలూకు రిమోట్ సెన్సింగ్‌; శాటిలైట్ క‌మ్యూనికేశన్‌, శాటిలైట్ ఆధారిత మార్గ‌ద‌ర్శ‌నం; అంత‌రిక్ష విజ్ఞానశాస్త్రం, గ్ర‌హ సంబంధిత అన్వేష‌ణ‌; అంత‌రిక్ష నౌక‌, స్పేస్ సిస్ట‌మ్స్‌, గ్రౌండ్ సిస్ట‌మ్ ల ఉప‌యోగం; మరియు అంతరిక్ష సాంకేతిక విజ్ఞాన వినియోగం వంటి సంభావ్య హితం ముడిప‌డ్డ రంగాల‌లో భార‌త‌దేశం, భూటాన్ లు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని కొన‌సాగించ‌డానికి మార్గం సుగ‌మం అవుతుంది.

ఈ ఎమ్ఒయు ఒక సంయుక్త కార్యాచ‌ర‌ణ స‌మూహం ఏర్పాటుకు దోహ‌ద‌ప‌డుతుంది.  డిఒఎస్‌/ ఐఎస్ఆర్ఒ ల‌కు చెందిన స‌భ్యులు, భూటాన్ స‌మాచార, క‌మ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ స‌భ్యులు దీనిలో  సభ్యత్వం కలిగివుంటారు.  ఈ స‌మూహం కార్యాచ‌ర‌ణ కు ఒక కాల పరిమితి ని, సాధనాలు సహా కార్య ప్ర‌ణాళిక‌ ను రూపొందించడం పై కసరత్తు చేస్తుంది.

అమ‌లు సంబంధిత వ్యూహం, ల‌క్ష్యాలు:

ఇరు ప‌క్షాలు సంత‌కాలు చేసిన ఎమ్ఒయు కార్యాచరణ కు కాల పరిమితి ని, సాధనాలు సహా కార్య ప్రణాళిక పై కసరత్తు చేయడం కోసం సహకారానికి సంబంధించిన నిర్ధిష్ట రంగాల‌లో ఆచరణ వ్యవస్థ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతే కాక ఒక సంయుక్త కార్యాచ‌ర‌ణ స‌మూహాన్ని కూడా నియమించడం జరుగుతుంది.

ముఖ్య ప్ర‌భావం:

ఎమ్ఒయు తో భూమి రిమోట్ సెన్సింగ్; శాటిలైట్ క‌మ్యూనికేశన్‌; శాటిలైట్ ఆధారిత మార్గ‌ద‌ర్శ‌నం; అంత‌రిక్ష విజ్ఞానశాస్త్రం; బాహ్య అంత‌రిక్ష అన్వేష‌ణ‌ ల ర‌ంగం లో స‌హ‌క‌రించుకొనేందుకు ఉన్న సంభవనీయతను గుర్తించేందుకు ప్రోత్సాహం అందుతుంది.

ల‌బ్ధిదారుల సంఖ్య‌:

ఈ ఎమ్ఒయు ద్వారా రాయ‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ భూటాన్  స‌హ‌కారం తో మాన‌వాళి ల‌బ్ధికి గాను అంత‌రిక్ష సాంకేతిక విజ్ఞానాన్ని  ఉపయోగించుకొనే రంగంలో సంయుక్త కార్యాచ‌ర‌ణ‌ కు ఉత్తేజాన్ని సమకూర్చడం జరుగుతుంది. ఈ విధంగా, దేశంలోని అన్ని వ‌ర్గాలు, అన్ని ప్రాంతాలు లాభపడతాయి.

పూర్వ‌రంగం:

భార‌త‌దేశం, భూటాన్ లు ఒక లాంఛ‌న‌ప్రాయ రోద‌సీ స‌హ‌కారాన్ని నెల‌కొల్పుకొనే అంశం పై చ‌ర్చిస్తూ వ‌చ్చాయి.  అంత‌రిక్ష స‌హ‌కారానికి ఉద్దేశించిన ఒక అంత‌ర్ ప్ర‌భుత్వ ఎమ్ఒయు కు సంబంధించిన ఒక ముసాయిదా ను 2017 వ సంవ‌త్స‌రం న‌వంబ‌రు లో విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ కు అంద‌జేసి, త‌దుప‌రి ద‌శ‌ లో దానిని భూటాన్ ప‌రిశీలన‌కు కూడా ఇవ్వాల‌ని తలపెట్టారు.  ఈ ముసాయిదా తో పాటు స‌హ‌కారానికి సంబంధించిన ఇత‌ర ప్ర‌తిపాద‌న‌ల‌పైన కూడా 2020 వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి లో నిర్వ‌హించిన ఒక ద్వైపాక్షిక స‌మావేశం లో కూల‌క‌షం గా చ‌ర్చించ‌డ‌మైంది.

దౌత్య మార్గాల‌లో మ‌రిన్ని సార్లు సంప్రదింపులు జ‌రిగాక ఉభ‌య ప‌క్షాలు ఎమ్ఒయు తాలూకు ఒక ఆచ‌ర‌ణీయ ముసాయిదా ను ఖ‌రారు చేసి, దానిని అంత‌ర్గ‌త ఆమోద ప్ర‌క్రియ కోసం నివేదించ‌డ‌మైంది. అవ‌స‌ర‌మైన ఆమోదాల‌ను పొందిన త‌రువాత, ఎమ్ఒయు పై ఉభ‌య ప‌క్షాలు 2020 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 19 వ తేదీ న సంత‌కాలు పెట్టి, ఆ ప‌త్రాన్ని ఒక ప‌క్షం మరొక ప‌క్షానికి ఇచ్చి పుచ్చుకోవ‌డం జ‌రిగింది.  



 

*** 



(Release ID: 1684890) Visitor Counter : 176