రైల్వే మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం అన్న శీర్షికతో సంవత్సరాంతపు విజయాలతో చేపుస్తకాన్ని విడుదల చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వేలు 2020లో సాధించిన చెప్పుకోదగిన విజయాలు చేపుస్తకంలో
రైల్వే మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న చేపుస్తకం
Posted On:
30 DEC 2020 1:03PM by PIB Hyderabad
రైల్వే మంత్రిత్వ శాఖ 2020 సంవత్సరంలో సాధించిన విజయాలపై ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం (బిల్డింగ్ ఆన్ ఆత్మనిర్భర్ భారత్) అన్న శీర్షికతో ముద్రించిన చేపుస్తకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. భారతీయ రైల్వేలు 2020లో సాధించిన చెప్పుకోదగిన విజయాలను, చొరవలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
కోవిడ్-19 సంక్షోభ సమయంలో దేశానికి లైఫ్ లైన్, కోవిడ్ -19 సమయంలో సౌహార్ద్రాన్ని వ్యాప్తి చేసిన రైల్వేలు, రైల్ సురక్ష, మెరుగైన రేపటి కోసం మౌలిక సదుపాయాలు, ఈశాన్య భారతంలో సెవెన్ సిస్టర్స్ అనుసంధానం, ఆత్మనిర్భర్ భారత్, స్వచ్ఛ రైల్, స్వచ్ఛ భారత్, గ్రీన్ రైల్వేస్, స్కిల్లింగ్ ఇండియా, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ పట్టాలపైకి, ఫాస్ట్ ట్రాక్ సరుకు రవాణా, సరుకు రవాణా ముందడుగు, కిసాన్ రైలుతో వ్యవసాయంలో సమృద్ధి, ప్యాసింజర్ సంతృప్తిపరచేందుకు చర్యలు కొనసాగింపు, ప్లాట్‌ఫార్మ్స్ ఆఫ్ ప్రోగ్రెస్, వ్యాపారవ్యవహారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం, వికాస్ కీ రైల్, చురుకైన రైల్వేలు వేగవంతమైన రైల్వేలు, పారదర్శకత, జవాబుదారీతనం తదితర శీర్షికలతో రైల్వేలు సాధించిన చెప్పుకోదగిన విజయాలను ఈ పుస్తకంలో రైల్వే మంత్రిత్వ శాఖ పొందుపరిచింది.
ఈ చేపుస్తకం హిందీ, ఇంగ్లీషు భాషల్లో రైల్వే మంత్రిత్వ శాఖ వెబసైట్ https://indianrailways.gov.in. లింక్‌లో లభ్యమవుతుంది.
****
(Release ID: 1684728)
Visitor Counter : 210