వ్యవసాయ మంత్రిత్వ శాఖ
గత ఆరు సంవత్సరాల్లో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ బడ్జెట్ ఆరు రెట్లు పెరిగింది: హర్‌దీప్ ఎస్ పురి
ఎంఎస్‌పీ వద్ద పంజాబ్‌లోని వరి సేకరణ గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం ఎక్కువ
ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద ఇప్పటివరకు రూ.1,10,000 కోట్లకు పైగా నగదు రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ
Posted On:
26 DEC 2020 3:15PM by PIB Hyderabad
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ బడ్జెట్ గడిచిన ఆరేండ్ల కాలంలో ఆరు రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీ హర్‌దీప్ పురి అన్నారు. ఉత్పత్తి వ్యయానికి కనీస మద్దతు ధర 1.5 రెట్లు పెంచాలన్న స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అమలు చేశారని ఆయన అన్నారు. 2009-14 మధ్య కాలంతో పోల్చితే ఎంఎస్‌పీ ధరకు వ్యవసాయోత్పత్తుల్ని కొనేందుకు గాను సర్కారు ఖర్చు చేసిన మొత్తం 2014-19లో 85 శాతం మేర పెరిగిందని మంత్రి శ్రీ హర్‌దీప్ పురి ప్రధానంగా తెలియ చేశారు. 2013-14తో పోల్చితే 2020-21మధ్య కాలంలో అన్ని ప్రధాన పంటలకు ఎంఎస్‌పీ 40-70 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాది పంజాబ్ రాష్ట్రంలో ఎంఎస్‌పీ వద్ద వరి సేకరణ గత ఏడాతో పోలిస్తే 25 శాతం అధికంగా ఉందని. ఈ ఏడాది సేకరణ లక్ష్యం కంటే ఇది 20 శాతం ఎక్కువ అని ఆయన అన్నారు. పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా నేరుగా రూ.1,10,000 కోట్లకు పైగా రైతుల ఖాతాలకు నగదును బదిలీ చేసినట్టుగా మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కేవలం రూ.17,450 కోట్ల రూపాయల ప్రీమియానికి గాను రైతులకు పంట బీమాగా రూ.87,000 కోట్లు చెల్లించడమైందని వివరించారు.1950లో భారత సాగు రంగం స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 52 శాతంగా నిలిచి ప్రధాన ప్రోత్సాహకారిగా నిలిచిందని తెలిపారు.
అదే సమయంలో మన మొత్తం జనాభాలో 70 శాతం మంది ఈ రంగం ఉపాధికారిగా నిలిచిందని కేంద్ర మంత్రి తెలియజేశారు.2019 నాటికి ఈ రంగం మన మొత్తం జనాభాలో దాదాపు 42 శాతం మందికి ఉపాధి రంగంగా నిలిచిందని, కానీ జీడీపీకి కేవలం 16 శాతం మాత్రమే దోహదపడింది అని వివరించారు. అదే సమయంలో ఈ రంగం సంవత్సరానికి కేవలం 2 శాతం వృద్ధి రేటును మాత్రమే కనబరుస్తోందని మంత్రి తెలిపారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ చేసిన 2018 అధ్యయనం ప్రకారంగా మొత్తం వ్యవసాయ గృహాల్లో 52.5 శాతం మంది రుణభారం అనుభవిస్తూ ఉన్న సంగతిని మంత్రి శ్రీ పూరి ప్రస్తావించారు. వీరి సగటు రుణం 1,470 డాలర్లుగా (సుమారు రూ.1.08 లక్షలు) ఉందన్న విషయాన్ని కేంద్ర మంత్రి హర్‌దీప్ పురి వివరించారు. సరైన కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల మన వ్యవసాయ ఉత్పత్తిలో 30 శాతం వృథాగా పోతోందని తెలిపారు. ఈ కారకాలు చవకైన అసమర్థమైన సరఫరా గొలుసుకు కారణంగా నిలుస్తున్నాయి. ఫలితంగా, వినియోగదారులకు ఉత్పత్తుల ఎంపిక చేసుకొనే వీలు లేకుండా పోతోంది. వ్యర్థం ఎక్కువగా ఉంటుంది మరియు ధరలు అధిక అస్థిరత కలిగి ఉంటాయని ఆయన అన్నారు. అదే సమయంలో భారతదేశ రైతు వాతావరణ మార్పులు, మార్కెట్లు, మధ్యవర్తులు, అవసరమైన మౌలిక సదుపాయాల లేమి వంటి పలు సమస్యలకు లోనవుతున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితులలో ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్తలు కూడా ఈ సంస్కరణలను సిఫారసు చేశారని మంత్రి తెలిపారు. మన రైతులు తమ ఉత్పత్తుల్ని బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతులు ఇవ్వాలని వారు సూచిస్తున్నట్టుగా శ్రీ పూరి ప్రధానంగా ప్రస్తావించారు.
కొన్ని భారతీయ రాష్ట్రాలు ఈ సంస్కరణలను స్వయంగా స్వీకరించి అమలు చేశాయి అని ఆయన తెలిపారు. బీహార్ పరిస్థితిని ఆయన ఈ సందర్భంగా ఉదహరించి తెలిపారు. బీహార్‌లో వ్యవసాయ వృద్ధి సగటు 6 శాతంగా ఉందని అన్నారు. ఇది జాతీయ సగటు కేవలం 2 శాతంతో పోలిస్తే అధికమని అన్నారు. రైతులతో మాట్లాడటానికి వారి సమస్యలను పరిష్కరించేలా సహాయం చేయమని ప్రభుత్వం పదేపదే కోరుతూ వస్తోందని శ్రీ పురి నొక్కి చెప్పారు. మండీలపై తగినట్లు పన్ను విధించడానికి రాష్ట్రాలను అనుమతిస్తామని, ప్రభుత్వం సమయానుకూలంగా వివాద పరిష్కార యంత్రాంగాలను రూపొందించినప్పటికీ, వివాదాల విషయంలో సివిల్ కోర్టులలో దావా వేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
***
(Release ID: 1683912)
Visitor Counter : 257