రాష్ట్రపతి సచివాలయం
క్రిస్మస్ సందర్భరంగా భారత రాష్ట్రపతి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
24 DEC 2020 4:51PM by PIB Hyderabad
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ తోటి పౌరులందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి తన సందేశాన్ని ఇస్తూ “క్రిస్మస్ పవిత్ర దినోత్సవం సందర్భంగా నా తోటి పౌరులు అందరికీ ముఖ్యంగా మన క్రైస్తవ సోదరులు మరియు సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు. క్రిస్మస్ వేడుక సంతోషంతో జరుపుకునే సందర్భం, ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకను ఆరాధించే శుభ సందర్భం. ఈ పండుగ ప్రజల జీవితాలను శాంతి, సద్భావన మరియు కరుణతో నింపుతుంది. ఈ పండుగ సందర్భంగా ఇతరుల పట్ల ప్రేమ, దయతో మన హృదయాలను వెలిగిద్దాము. క్రిస్మస్ పండుగ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని పెంపొందిస్తుంది. మన మానవజాతిలో సామరస్యాన్ని కొనసాగించడానికి సహాయ పడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ పవిత్ర పండుగ సందర్భంగా యేసు క్రీస్తు ప్రేమ, కరుణ మరియు మానవత్వం యొక్క బోధలను తిరిగి నింపండి మరియు మన దేశం, సమాజ శ్రేయస్సు కోసం మమ్మల్ని పునరంకితం చేద్దాం” అని అన్నారు.
రాష్ట్రపతి క్రిస్మస్ సందేశాన్ని వీక్షించేందుకు దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి-
****
(రిలీజ్ ఐడి: 1683503)
సందర్శకుల సూచీ సంఖ్య : : 172