మంత్రిమండలి
భారతదేశంలో "డైరెక్ట్-టు-హోమ్ (డి.టి.హెచ్)" సేవల కోసం సవరించిన మార్గదర్శకాలను ఆమోదించిన - కేంద్ర మంత్రి మండలి
प्रविष्टि तिथि:
23 DEC 2020 4:46PM by PIB Hyderabad
భారతదేశంలో "డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్)" ప్రసార సేవలను అందించడానికి అవసరమైన అనుమతి పొందటానికి మార్గదర్శకాలను సవరించే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నిర్ణయం లోని ప్రధాన అంశాలు :
ప్రస్తుతం 10 సంవత్సరాల స్థానంలో 20 సంవత్సరాల కాలానికి డి.టి.హెచ్. కోసం అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత లైసెన్సు వ్యవధిని 10 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించవచ్చు.
జి.ఆర్. లో 10 శాతంగా ఉన్న లైసెన్సు ఫీజును, ఏ.జి.ఆర్. లో 8 శాతంగా సవరించబడింది.
ప్రస్తుతం ఏడాదికి ఒకసారి వసూలు చేస్తున్న లైసెన్సు ఫీజును ఇక మీదట మూడు నెలలకు ఒకసారి వసూలు చేస్తారు. డి.టి.హెచ్. ఆపరేటర్లకు అనుమతించబడిన ప్లాట్ ఫాం ఛానెళ్ళ మాదిరిగానే, దాని మొత్తం ఛానల్ మోసే సామర్థ్యంలో గరిష్టంగా 5 శాతం వరకు పనిచేయడానికి అనుమతి ఉంటుంది. ఒక్కొక్క పి.ఎస్. ఛానెల్‌కు 10,000 రూపాయల చొప్పున తిరిగి చెల్లించని రిజిస్ట్రేషన్ రుసుమును, డి.టి.హెచ్. ఆపరేటర్ నుండి వసూలు చేస్తారు.
డి.టి.హెచ్. ఆపరేటర్ల మధ్య మౌలిక సదుపాయాల భాగస్వామ్యం. స్వచ్ఛంద ప్రాతిపదికన డి.టి.హెచ్. ప్లాట్‌ఫామ్ మరియు టి.వి. ఛానెళ్ళ ప్రత్యక్ష ప్రసారాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్న డి.టి.హెచ్. ఆపరేటర్లకు అనుమతి ఉంటుంది. టీ.వీ. ఛానెళ్ళ పంపిణీదారులు తమ చందాదారుల నిర్వహణ వ్యవస్థ (ఎస్.ఎమ్.ఎస్) మరియు షరతులతో కూడిన యాక్సెస్ సిస్టమ్ (సి.ఎ.ఎస్) అప్లికేషన్ల కోసం సాధారణ హార్డ్ వేర్ ను పంచుకోవడానికి అనుమతించబడతారు.
ప్రస్తుతం డి.టి.హెచ్. మార్గదర్శకాలలో నిర్దేశించిన 49 శాతం ఎఫ్.డి.ఐ. పరిమితిని ఎప్పటికప్పుడు సవరించినట్లుగా ఎఫ్.డి.ఐ. పై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ (డి.పి.ఐ.ఐ.టి) విధానంతో అనుసంధానించబడుతుంది.
vii. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన సవరించిన డి.టి.హెచ్. మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
ప్రతిపాదిత తగ్గింపు టెలికాం రంగానికి వర్తించే లైసెన్స్ ఫీజు పాలనను సమలేఖనం చేయడానికి ఉద్దేశించబడింది మరియు ఇది వర్తించబడుతుంది. డి.టి.హెచ్. సర్వీసు ప్రొవైడర్లు ఎక్కువ కవరేజ్ కోసం పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ వ్యత్యాసం దారితీస్తుంది. ఇది పెరిగిన కార్యకలాపాలు మరియు అధిక వృద్ధికి దారితీస్తుంది. తద్వారా వారి లైసెన్సు ఫీజు మెరుగుపడి, చెల్లింపులు క్రమంగా జరిగే అవకాశం ఉంది. ప్లాట్ ఫాం సేవలకు రిజిస్ట్రేషన్ ఫీజు సుమారు 12 లక్షల రూపాయల మేర ఆదాయాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. డి.టి.హెచ్. ఆపరేటర్ల మౌలిక సదుపాయాల భాగస్వామ్యం వల్ల కొరతగా ఉన్న ఉపగ్రహ వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. తద్వారా వినియోగదారులు భరించే ఖర్చులను తగ్గించవచ్చు. ప్రస్తుతం ఉన్న ఎఫ్.డి.ఐ. విధానాన్ని అనుసరించడం ద్వారా, దేశానికి ఎక్కువ విదేశీ పెట్టుబడులు వస్తాయి.
డి.టి.హెచ్. అఖిల భారత స్థాయిలో పనిచేస్తుంది. డి.టి.హెచ్. రంగం, అధిక ఉపాధి అవకాశాలు కలిగిన రంగం. ఇది ప్రత్యక్షంగా డి.టి.హెచ్. ఆపరేటర్లతో పాటు కాల్ సెంటర్ల లో ఉన్నవారికి ఉపాధికి కల్పిస్తుంది. పరోక్షంగా క్షేత్ర స్థాయిలో గణనీయమైన సంఖ్యలో ఇన్స్టాలర్లను నియోగిస్తుంది. సవరించిన డి.టి.హెచ్. మార్గదర్శకాలు, ఎక్కువ లైసెన్సు వ్యవధి, పునరుద్ధరణలపై స్పష్టత, సడలించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులు మొదలైనవి, డి.టి.హెచ్. రంగంలో, ఉపాధి అవకాశాలతో పాటు సరసమైన స్థిరత్వం మరియు కొత్త పెట్టుబడులను నిర్ధారిస్తాయి.
*****
(रिलीज़ आईडी: 1683188)
आगंतुक पटल : 334
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam