మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
సంవత్సరాంతపు సమీక్ష ః పశుసంవర్థక, పాడి శాఖ
Posted On:
22 DEC 2020 4:05PM by PIB Hyderabad
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద రూ. 15000 కోట్లతో పశుసంవర్థక మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు
దేశ వ్యాప్తంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ఫేజ్-2 ప్రారంభం, 2.64 కృత్రిమ గర్భధారణల నిర్వహణ, 1.73 లక్షల రైతులకు లబ్ధి
పిఎం- కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రాయితీతో రుణాన్ని అందించేందుకు ప్రత్యేక డ్రైవ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 22, (పిఐబి)ః
1. పశు సంవర్థక శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎహెచ్ ఐడిఎఫ్)
ఆత్మనిర్భర భారత్ అభియాన్ ఉద్దీపన ప్యాకేజీ కింద రూ.15000 కోట్ల పశుసంవర్థక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు. వ్యక్తిగత వ్యాపారవేత్తలు, ప్రైవేటు కంపెనీలు, ఎంఎస్ ఎంఇలు, రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్‌పిఒలు), సెక్షన్ 8 కంపెనీలు (1) పాల శుద్ధి, విలువ అదనపు మౌలిక సదుపాయాలు (2) మాంస శుద్ధి, విలువ అదనపు మౌలిక సదుపాయాలు (3) పశు గ్రాస్ ప్లాంట్లకు ప్రోత్సహించేందుకు ఎహెచ్ ఐడిఎఫ్ ను అనుమతించారు.అర్హత కలిగిన అన్ని ఎంట్రీలకు 3% మేరకు వడ్డీ ఉపసంహరణ/ మాఫీ చేస్తారు. ఇంతవరకు రూ. 150 కోట్ల ప్రాజెక్టుల రుణాన్ని ఎ హెచ్ ఐడిఎఫ్ కింద బ్యాంకులు మంజూరు చేశాయి. అర్హత కలిగిన సంస్థలు రుణం కోసం ఆన్‌లైన్లో ఈ లింక్ ద్వారా https://ahidf.udyamimitra.in. దరఖాస్తు చేసుకోవచ్చు
2) దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ కార్యక్రమం (ఎన్ ఎఐపి) ఫేజ్ 2
మేలు జాతి పశువుల ఉత్పత్తి కోసం 100% కేంద్రం తోడ్పాటుతో అతి పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో, జిల్లాకు 20,000 పశువుల చొప్పున దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ఫేజ్ 1 కింద 76 లక్షల పశువులను కవర్ చేశారు, దాదాపు 90 లక్షల కృత్రిమ గర్భధారణను నిర్వహించడం ద్వారా 32 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందారు. ఎన్ ఎఐపి ఫేజ్ 2ను 1 ఆగస్టు, 2020 నుంచి 604 జిల్లాల్లో (జిల్లాకు 50,000పశువుల చొప్పున) ప్రారంభించారు. నేటివరకు, ఎన్ ఎఐపి ఫేజ్ 2 కింద 2.64 లక్షల కృత్రిమ గర్భధారణలను నిర్వహించగా, 1.73 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు.
3) పాడి పరిశ్రమకు మూలధన రుణాల పై వడ్డీ ఉపసంహరణ/ మాఫీ
పశుసంవర్థకత, పాడిపరిశ్రమ శాఖ పాడి రంగానికి పాడి సహకార, పాడి కార్యకలాపాలలో నిమగ్నమైన రైతు ఉత్పత్తి సంస్థలకు మద్దతు (ఎస్ డిసి &ఎఫ్ పిఒ) అన్న పథకం కింద మూలధన రుణాలపై వడ్డీ ఉపసంహరణ అనే నూతన అంశాన్నిప్రవేశ పెట్టింది. ఎస్ డిసి &ఎఫ్ పిఒ పథకం వడ్డీ ఉపసంహరణ అన్న అంశం కింద ఇటీవల వరకు రూ. 100.85 కోట్ల మేరకు వడ్డీ ఉపసంహరణ మొత్తంగా ఆమోదించింది. ఇది పాల యూనిన్లకు 16.10.2020 వరకు ఉన్న మూలధన రుణాల మొత్తం రూ. 8032.23 కోట్లుకు వర్తిస్తుంది.
4) పశు సంవర్ధక, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు (కెసిసి)
కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పిఎం- కిసాన్ లబ్ధిదారులకు రాయితీతో రుణాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. పశుసంవర్థక & పాడి రైతులను ఈ డ్రైవ్‌లో జతపరిచారు. రాయితీతో కూడిన వడ్డీ రేటుతో వ్యవస్థాగత రుణాలను పొందేందుకు ఆ రైతులకు అవకాశం కలుగుతుంది. దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఇందులో భాగం అయ్యి రూ. 2 లక్షల కోట్ల మేరకు పరపతి ద్వారా లబ్ధి పొందుతారు. నేటి వరకు 51.23 పాడి రైతుల దరఖాస్తులను పాల యూనియన్లు సేకరించి, అందులో 41.40 లక్షల దరఖాస్తులను బ్యాంకులకు పంపడం జరిగింది.
******
(Release ID: 1682789)
Visitor Counter : 169
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam