హోం మంత్రిత్వ శాఖ
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ తో పాటు, విశ్వ భారతి, శాంతినికేతన్ లు భారతదేశంలోనూ, విదేశాల్లోనూ ఎల్లప్పుడూ ఆకర్షణ కేంద్రాలుగా ఉన్నాయన్న - కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
దేశ సాంస్కృతిక వారసత్వం, కళలు, సాంప్రదాయం, స్వాతంత్య్ర పోరాటంలో కొత్త ఆలోచనలు... ప్రతి అంశంలోనూ ... ఇతర ప్రాంతాల కంటే 50 సంవత్సరాల ముందు ఉన్న - బెంగాల్
విశ్వ భారతి 100 ఏళ్ళు గుర్తుగా, ఇది, గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలను ఈ సంస్థ నుండి పునరుద్ధరించే ఒక ప్రయత్నంగా ఉండాలి.
దేశంలోని విద్యావ్యవస్థ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటుకు దోహదపడ్డ - శాంతినికేతన్ మరియు విశ్వ భారతి
50 సంవత్సరాల తరువాత, విశ్వ భారతి 150 వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా, వివిధ రంగాలలో రాణించిన కనీసం పది మందిని పోషించడం మరియు దేశవ్యాప్తంగా గురుదేవులు ఠాగూర్ ఆలోచనలను పెంపొందించడం మరియు వారిని జీవితంలో మరియు సమాజంలో ఒక భాగంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకోవాలి
మానవత్వం యొక్క సందేశాన్ని అందించడంలో కులం, మతం, తరగతి కంటే పైకి ఎదగడానికి ఎల్లప్పుడూ కృషి చేసిన - విశ్వ భారతి
Posted On:
20 DEC 2020 7:31PM by PIB Hyderabad
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వ భారతి మరియు శాంతినికేతన్ విద్యా సంస్థలు, దేశ, విదేశాల్లో ఎల్లప్పుడూ ఆకర్షణ కేంద్రాలుగా ఉన్నాయని, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్ లోని శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, విద్యార్థులు, మేధావులను ఉద్దేశించి, శ్రీ అమిత్ షా, ఈ రోజు ప్రసంగిస్తూ, దేశ సాంస్కృతిక వారసత్వం, కళలు, సాంప్రదాయం, స్వాతంత్య్ర పోరాటంలో కొత్త ఆలోచనలు వంటి ప్రతి అంశంలోనూ, బెంగాల్, ఇతర ప్రాంతాల కంటే 50 సంవత్సరాల ముందు ఉందని పేర్కొన్నారు. విశ్వ భారతి త్వరలో 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటోందని, కేంద్ర హోం మంత్రి అన్నారు. ఇది స్థాపించబడిన సమయంలో కొన్ని ఆలోచనలు ఉండి ఉండాలి, ఇప్పుడు, 100 సంవత్సరాలు పూర్తయిన తరువాత, ఈ సంస్థ నుండి గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలను పునరుద్ధరించే ప్రయత్నంగా ఉండాలి. దేశంలోని విద్యావ్యవస్థ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటుకు శాంతినికేతన్, విశ్వ భారతి సంస్థలు సహకరించాయని ఆయన పేర్కొన్నారు.
1901 లో బ్రహ్మచర్య ఆశ్రమం నుండి ప్రారంభమైన ఈ ప్రయాణం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ఎంతో దోహదపడిందని శ్రీ అమిత్ షా అన్నారు. సంకుచితత్వం యొక్క అన్ని పరిమితులను మించి ఆలోచించడం ద్వారా వ్యక్తిని నిర్భయంగా మార్చడమే విద్య యొక్క ఉద్దేశ్యం అని గురుదేవులు ఉద్భోదించారని, ఆయన చెప్పారు. గురుదేవులు రవీంద్ర నాథ్ ఠాగూర్ ఇచ్చిన మంత్రం ప్రకారం ఇక్కడ నుండి వెలువడే ఆలోచనలు మన విద్యావ్యవస్థను మార్చుకుంటేనే విశ్వ భారతి ప్రయాణం విజయవంతమవుతుందని, ఆయన పేర్కొన్నారు. విలాసవంతమైన జీవితం, ప్రేమానురాగాలు, అన్ని రకాల సామాజిక బంధాలను శాంతి కోసం వెతుకుతూ, సత్యాన్ని తెలుసుకోవాలనే తపన, ఎప్పుడూ ఆగిపోని వ్యక్తులను పెంపొందించడం విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని శ్రీ షా అన్నారు.
వివిధ రంగాల్లో రాణించిన అనేక మందిని, విశ్వభారతి, దేశానికి అందించిందని, కేంద్ర మంత్రి చెప్పారు. విశ్వ భారతి వందవ సంవత్సరంలో, ఈ సంప్రదాయం ఆగదనీ, 50 సంవత్సరాల తరువాత, విశ్వ భారతి 150వ వార్షికోత్సవాన్ని జరుపుకునే ప్రతిజ్ఞను మనం తీసుకోవాలి. వివిధ రంగాలలో రాణించిన కనీసం పది మందిని పోషించడం, దేశవ్యాప్తంగా గురుదేవులు ఠాగూర్ ఆలోచనలను పెంపొందించడంతో పాటు, వారిని జీవితంలో, సమాజంలో ఒక భాగంగా మార్చడం మన లక్ష్యం కావాలని, ఆయన సూచించారు.
శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో బెంగాల్ కు చెందిన యువకులు చాలా మంది సహకరించారు. రాజా రామ్మోహన్ రాయ్, బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ, శ్రీ అరబిందో, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, సుభాష్ చంద్రబోస్ వంటి వారు 19 వ శతాబ్దపు పునరుజ్జీవనోద్యమంలో భారత వారసత్వాన్ని సుసంపన్నం చేయడానికి కృషి చేశారు. గురుదేవులు ఠాగూర్ ఆలోచనల ప్రభావాన్నీ, అతని వ్యక్తిత్వం గొప్పతనాన్నీ రెండు వేర్వేరు భావజాల ప్రజలు - మహాత్మా గాంధీ నుండి సుభాష్ చంద్రబోస్ వరకు గురుదేవులు ఠాగూర్ నుండి ప్రేరణ పొందారు. ఇది గురుదేవులు ఠాగూర్ ఆలోచనల పరిధిని చూపిస్తుంది. ప్రపంచంలోని ఏకైక గొప్ప వ్యక్తి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ అని శ్రీ అమిత్ షా కొనియాడారు. రెండు దేశాలలో ఆయన రచనలను జాతీయ గీతాలుగా గానం చేస్తున్నారు. గురుదేవుల ఆలోచనలు, సంస్కృతి, నీతి, కళల చిత్రణ ఎంత అపారమైనదో ఇది రుజువు చేస్తుంది.
మానవాళి సందేశాన్ని అందించడంలో, విశ్వ భారతి ఎప్పుడూ కులం, మతం, తరగతి కంటే పైకి ఎదగడానికి కృషి చేసిందని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. భారతీయ మతంలో, తత్వశాస్త్రం, సాహిత్యం, సంగీతం, కళలను పరిరక్షించి, ప్రోత్సహించే వ్యవస్థ ఉంది. యూరప్ దేశాలు, ఇతర దేశాల సాహిత్యం మరియు తత్వాన్ని, విశ్వభారతి విలీనం చేసింది. మన వేదాల ప్రపంచ సోదరభావం యొక్క ప్రాథమిక మంత్రాన్ని దృష్టిలో ఉంచుకున్నదే, ఈ మంత్రం “सर्वेभवंतुसुखिनः, सर्वेसंतुनिरामया” (అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరూ అనారోగ్యానికి గురి కాకూడదు).
గ్రామీణాభివృద్ధి దృష్టిని మనం పునరుద్దరించక పోతే, మనం ఆధునిక పద్ధతిలో ముందుకు సాగలేము. దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యం కాదు, అయితే, గురుదేవులు దీనిని విశ్వ భారతి ద్వారా ప్రారంభించారని, ఆయన చెప్పారు. ఇక్కడ నుండి ఆరోగ్యం, పరిశుభ్రత, హస్తకళలు, సాంకేతికత వంటి అన్ని ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లారు.
శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, గురుదేవులు తనలోని విద్యార్థికి చావు లేదని చెప్పేవారని పేర్కొన్నారు. అయన తన 70 సంవత్సరాల వయస్సులో చిత్ర లేఖనం ప్రారంభించారనీ, ఆయన మరణించే ముందు వరకు, దాదాపు మూడు వేలకు పైగా పెయింటింగ్ లను రూపొందించారు. తద్వారా, చివరి శ్వాస వరకు నేర్చుకోవడం మానేయకూడదని ఆయన ప్రపంచానికి రుజువు చేశారని, ఆయన చెప్పారు. గురుదేవ్ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, విశ్వ భారతి బహిరంగ మనస్సుతో, దయగల ఆలోచనలతో, కృషి చేస్తూ, ముందుకు సాగాలని శ్రీ షా సూచించారు.
శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, గురుదేవ్, గద్య మరియు కవితల రచనలను కొనసాగిస్తూనే, ఇంత పెద్ద సంస్థను, ఎంతో విజయవంతంగా నిర్వహించారు. ఇది ఖచ్చితంగా ప్రశంసనీయం. ఠాగూర్ ఆలోచనలను మరోసారి ముందుకు తీసుకురావడానికి సమయం ఆసన్నమైంది. విశ్వ భారతి దేశానికి ఎంతో మంది మేధావులను అందించింది. మహాస్వేతా దేవి, నందలాల్ బోస్, గాయత్రి దేవి, సత్యజిత్ రే, వినోద్ బిహారీ ముఖర్జీలతో సహా చాలా మంది వివిధ రంగాల్లో విశేష కృషి చేశారు. ఈ సంప్రదాయం ఆగకుండా, ఇలాగే కొనసాగాలని, మనం, ఈరోజు, తీర్మానించుకుందాం.
అంతకుముందు, భారత గొప్ప ఆలోచనాపరుడైన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కు, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా శాంతినికేతన్ వద్ద, నివాళులర్పించారు. విశ్వ భారతి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రసిద్ధ సంగీత భవన్ను కూడా శ్రీ అమిత్ షా సందర్శించారు.
*****
(Release ID: 1682315)
Visitor Counter : 280