ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కోవిడ్ అనంతర కాలంలో ఈశాన్య ప్రాంతం భారతదేశంలో ఇష్టమైన పర్యాటక మరియు వాణిజ్య గమ్యస్థానంగా అవతరిస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
19 DEC 2020 5:39PM by PIB Hyderabad
కోవిడ్ అనంతర కాలంలో ఈశాన్య ప్రాంతం భారతదేశంలో ఇష్టమైన పర్యాటక మరియు వాణిజ్య గమ్యస్థానంగా అవతరిస్తుందని, ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్) శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) , పి.ఎమ్.ఓ. సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, పేర్కొన్నారు. దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన 8వ ఈశాన్య ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతం, తన భారీ సహజ, మానవ నైపుణ్య వనరుల సహకారంతో, భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదగడానికి ముందడుగు వేస్తుందని అన్నారు. ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థకు "కొత్త చోదకశక్తి" గా పనిచేస్తుందనీ, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు వైరస్ బారిన పడినప్పుడు, ఈ ప్రాంతం మహమ్మారి లేకుండా ఉండడం ద్వారా యూరోపియన్ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యామ్నాయంగా ఉద్భవిస్తుందని, ఆయన పేర్కొన్నారు.

శేలవులను ఇష్టపడేవారు, వచ్చే సీజన్ నుండి, ఇతర ప్రపంచ పర్యాటక ప్రదేశాల కంటే సహజమైన ప్రకృతి సౌందర్యం కోసం, ఈశాన్య ప్రాంతాన్ని ఖచ్చితంగా ఇష్టపడతారని, డాక్టర్ జితేంద్ర సింగ్, ఆశాభావం వ్యక్తం చేశారు. మహమ్మారి అనంతర కాలంలో వాణిజ్యం ద్వారా మిగతా ప్రపంచం ఆర్థిక పునరుజ్జీవం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, భారతదేశానికి నూతన చోదకశక్తిగా ఈశాన్య ప్రాంతం నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
వెదురుతో సహా అనేక సహజ వనరులు దోపిడీకి గురి అవుతున్న ఈ ప్రాంతం, "ఓకల్ ఫర్ లోకల్" మంత్రాన్ని అమలు చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ఆత్మ నిర్భర్ అభియాన్ ను ముందుకు నడిపించగలదని, ఆయన తెలియజేశారు. కేంద్రప్రభుత్వం, ఇటీవల, ముడి వెదురు వస్తువులపై దిగుమతి సుంకాన్ని 25 శాతం పెంచిన విషయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్, పేర్కొంటూ, ఇది దేశీయ వెదురు పరిశ్రమలైన ఫర్నిచర్, హస్తకళలతో పాటు అగర్ బత్తీ తయారీకి పెద్ద ఎత్తున సహాయపడుతుందనీ, అదేవిధంగా, వెదురును నిర్మాణ సామగ్రిగా ఉపయోగించడాన్ని కూడా ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు వంద సంవత్సరాల నాటి భారతీయ అటవీ చట్టంలో, 2017 సంవత్సరంలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ గురించి ఆయన ప్రస్తావిస్తూ, దీని ఫలితంగా, వెదురు ద్వారా జీవనోపాధి అవకాశాలను పెంచాలనే ఉద్దేశ్యంతో, ఇంట్లో పెరిగిన వెదురును దాని నుండి మినహాయించినట్లు, తెలియజేశారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రోడ్డు, రైలు, విమానమార్గాల అనుసంధానం పరంగా గణనీయమైన అభివృద్ధి జరిగిందని, ఫలితంగా, ఈ ప్రాంతం వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వస్తువులు, వ్యక్తుల కదలికలు సులభతరమయ్యాయని, వివరించారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంత యువత మరింత ఆకాంక్షగా మారిందనీ, ఆర్ధిక పరంగా, ఈ ప్రాంతాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనీ, ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం యొక్క "యాక్ట్ ఈస్ట్" విధానం గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ, ఆగ్నేయాసియా దేశాల పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రవేశ ద్వారంగా ఉన్న ఈశాన్య ప్రాంతం, ఆసియాన్ తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను ప్రోత్సహించడంలో, ప్రత్యేక పాత్ర పోషిస్తుందని, పేర్కొన్నారు. ద్వైపాక్షిక సహకారాన్ని, నూతన శిఖరాలకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ “లుక్ ఈస్ట్” విధానాన్ని, “యాక్ట్ ఈస్ట్” విధానంగా మార్చారని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో - అస్సాం, త్రిపుర, మణిపూర్, సిక్కిం ముఖ్యమంత్రులతో పాటు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీ హర్ష వర్ధన్ ష్రింగ్లా కూడా ఈ సమావేశంలో ప్రత్యేక ప్రసంగం చేశారు.
*****
(Release ID: 1682069)
Visitor Counter : 128