రక్షణ మంత్రిత్వ శాఖ
దేశ సైనిక చరిత్రకు సంబంధించిన జ్ఞానాన్ని పొందవలసిందిగా యువతకు విజ్ఞప్తి చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Posted On:
18 DEC 2020 3:02PM by PIB Hyderabad
మన రక్షణ దళాలు పోరాడిన యుద్ధాల గురించి, వృద్ధ సైనికుల అనుభవాల నుంచి యువత, సాధారణ ప్రజలు స్ఫూర్తిని పొంది దేశభక్తిని అలవరచుకునేందుకు 4వ సైనిక సాహిత్య ఫెస్టివల్ వంటి వినూత్న చొరవలు అవకాశాన్ని కల్పిస్తాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దృశ్య మాధ్యమం ద్వారా ఆయన ఫెస్టివల్‌లో ప్రసంగించారు. సైనిక చరిత్ర ప్రాముఖ్యతను పట్టి చూపుతూ, రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టిన తర్వాత దేశ సరిహద్దు చరిత్ర గురించి సాగుతున్న రచనను పురోగమింపచేసేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్టు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. మన సరిహద్దు చరిత్రపై దృష్టి పెట్టి, అక్కడ పోరాడిన యుద్ధాలు, సైనికులు చేసిన త్యాగాల గురించి సరళమైన భాషలో, బాగా చదివింప చేసే, సాధారణ ప్రజలు తేలికగా అర్థం చేసుకోగలిగిన సాహిత్యం తీసుకురావడమన్నది భావి తరాలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. అనేకమంది సైనిక దళంలో అనుభవజ్ఞులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు జర్నళ్ళను ప్రచురిస్తూ ప్రజలకు, నిపుణులకు మధ్య ఉన్న జ్ఞాన పరమైన తేడాను తగ్గించడంపై దృష్టి పెడుతున్నారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
ఈ ఏడాది సైనిక సాహిత్య ఫెస్టివల్, సాహసోపేతమైన మన సైనికులు వీరత్వం ప్రదర్శించిన 1971 యుద్ధపు 50వ వార్షికోత్సవమైన స్వర్నిం విజయ్ దివస్ వేడుకలు ఏకకాలంలో వచ్చాయని రక్షణ మంత్రి అన్నారు. ఆ యుద్ధంలో సైనికుల వీరత్వం నేటికీ కూడా ఆదర్శంతంగా పరిగణిస్తారని అన్నారు. అనుభవజ్ఞులతో పరస్పరం చర్చించి, వారి అనుభవాల నుంచి ప్రత్యక్ష జ్ఞానాన్నిపొందే అవకాశాన్ని కోల్పోవద్దని యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు. సాహిత్య ఫెస్టివల్ సందర్భంగా వివిధ కార్యక్రమాలను, చర్చలను నిర్వహించడాన్నిరాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇవన్నీ కూడా కేవలం సైనిక అంశాలకు పరిమితమైనవే కాక దేశానికి సంబంధించిన సాంస్కృతిక అంశాలు కూడా ఉండడాన్ని కొనియాడారు. యుద్ధ స్వభావం కూడా కాలాన్ని బట్టి, పరిణామం చెందుతున్న సాంకేతికతలను బట్టి మారుతోందని, ఆయన అన్నారు.మనం ఆధునిక సాంకేతికత విసురుతున్ననూతన రక్షణ సవాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలన్నారు. భవిష్యత్తులో ఇతివృత్తం ఆధారంగా కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా రాజ్‌నాథ్ సింగ్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. సైనిక సాహిత్య ఫెస్టివల్ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
పంజాబ్ గవర్నర్ విజయేంద్ర పాల్ సింగ్ బద్నోర్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
****
(Release ID: 1681810)
Visitor Counter : 326