శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మెగా సైన్స్ ఫెస్టివల్ ఐఐఎస్ఎఫ్ 2020లో సైన్స్ ను వర్చువల్ గా అనుభవంలోకి తెచ్చుకోండి
ఐఐఎస్ఎఫ్ 2020 కార్యక్రమాల ద్వారా విద్యార్థలకు ప్రయోజనం : డాక్టర్ రంజనా అగర్వాల్
ఐఐఎస్ఎఫ్ పరిశోధకులను కాలం, సరిహద్దుల ఆవలకు నడుపుతుంది : శ్రీ జయంత్ సహస్రబుధే
Posted On:
17 DEC 2020 11:14AM by PIB Hyderabad
ఉత్సుకతను కలిగించే పలు అంశాలు ప్రస్తుత మహమ్మారి కాలంలో నిలిచిపోయినా సైన్స్, టెక్నాలజీ మాత్రం ఉన్నతంగానే నిలిచాయి. వర్చువల్ అనుభవం కలిగించనున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) 2020 అలాంటి సజీవ ఉదాహరణల్లో ఒకటి. “విద్యార్థులను వర్చువల్ టూర్ కి తీసుకువె ళ్ల గల 3డి ఎగ్జిబిషన్లు, వర్చువల్ కార్యక్రమాలు, గోష్ఠులు, ఉపన్యాసాలు, ఇంకా ఎన్నో ఇందులో ఉన్నాయి. మొత్తం 41 కార్యక్రమాలు జరగబోతున్నాయి. అందరికీ ఆహ్వానం” అని డాక్టర్ సిఎస్ఐఆర్-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, డెవలప్ మెంట్ స్టడీస్ (నిస్టాడ్స్) డైరెక్టర్ రంజనా అగర్వాల్ ప్రకటించారు. వైఎంసిఏలోని జెసి బోస్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వద్ద ఆమె మాట్లాడారు. విజ్ఞానభారతి (విభా) సంస్థతో కలిసి ఈ విశ్వవిద్యాలయం ఐఐఎస్ఎఫ్ ముందస్తు వివరాల ప్రకటన కార్యక్రమం నిర్వహించింది. 2020 డిసెంబర్ 22-25 తేదీల మధ్యన ఐఐఎస్ఎఫ్ జరుగనుంది.
ఐఐఎస్ఎఫ్ 2020 నిర్వహణలో సిఎస్ఐఆర్-నిస్టాడ్స్, న్యూఢిల్లీ నోడల్ సంస్థగా ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, శాస్ర్తీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్), భూశాస్ర్తాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, బయో టెక్నాలజీ శాఖ (డిబిటి) ఈ కార్యక్రమం ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి.
ఐఐఎస్ఎఫ్ సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, వాటి పరిధి గురించి డాక్టర్ అగర్వాల్ వివరించారు. వాస్తవ శాస్ర్తీయ కార్యకలాపాలు, పరిశోధనలను ఏ మాత్రం మిస్ కాకుండా తమ ఇళ్లలో కూచునే అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా విద్యార్థులు అధికంగా లాభపడవచ్చునని ఆమె అన్నారు.
“కరోనా మహమ్మారి ప్రవేశించినప్పుడు అది కొద్ది నెలల వ్యవధిలో తుడిచిపెట్టుకుపోతుందని, గత ఏడాది వలెనే ఈ కార్యక్రమం నిర్వహించగలమని ఆలోచించాం. కాని అది సాధ్యం కాదని సెప్టెంబరు కల్లా తేలిపోయింది. అందుకే వర్చువల్ వేదికలపై దీన్ని నిర్వహించాలని మేం భావించాం” అని విభా జాతీయ నిర్వాహక కార్యదర్శి శ్రీ జయంత్ సహస్రబుధే అన్నారు. కాలం, సరిహద్దు పరిధులు దాటి ప్రపంచ, ప్రవాస భారత పరిశోధకులు, విద్యావేత్తలను కూడా ఐఐఎస్ఎఫ్ లో భాగస్వాములను చేస్తున్నామని ఆయన వివరించారు. కరోనా సమయంలో కూడా ఈ కార్యక్రమంలో జరుగనున్న కార్యక్రమాల సంఖ్య పెరిగిందని, ఒక దాని వెంట మరొకటిగా ఈ ఫెస్టివల్స్ నిర్వహించే ప్రణాళిక కూడా ఉన్నదని ఆయన చెప్పారు.
ప్రస్తుతం నెలకొన్న వాతావరణలో ఈ మెగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నందుకు సిఎస్ఐఆర్-నిస్టాడ్స్, విజ్ఞాన భారతి, వివిధ మంత్రిత్వ శాఖల కృషిని విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ దినేష్ కుమార్ ప్రశంసించి అభినందించారు.
ఐఐఎస్ఎఫ్ 2020 గురించి నిర్వహించిన ఔట్ రీచ్ కార్యక్రమంలో డాక్టర్ రంజనా అగర్వాల్ ఈ మెగా ఫెస్టివల్ లక్ష్యం, ప్రాధాన్యత గురించి డాక్టర్ రంజనా అగర్వాల్ వివరించారు. ఐఐఎస్ఎఫ్ గురించి అందరికీ తెలియచేయడానికి సైన్స్ కమ్యూనికేటర్స్ గ్రూప్ ఈ ఔట్ రీచ్ కార్యక్రమం నిర్వహించింది.
సైన్స్ ఫెస్టివల్ కు సంబంధించిన కార్యక్రమాల సమాచారం తెలుసుకునేందుకు, భాగస్వామ్య రిజిస్ర్టేషన్ కు ఇక్కడ ఇస్తున్న ఐఐఎస్ఎప్ వెబ్ సైట్ చూడండి.
www.scienceindiafest.org.
***
(Release ID: 1681597)
Visitor Counter : 181