మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

విద్య సహకారాన్ని బలోపేతం చేసుకోనున్న భార‌త్, యునైటెడ్ కింగ్‌డమ్

భారతదేశ జాతీయ విద్యా విధానం-2020ని దూరదృష్టి చ‌ర్య‌గా ప్ర‌శంసించిన విదేశాంగ కార్యదర్శి రాబ్

- ఇది ఇరు దేశాల మధ్య జీవవంతెనగా విద్యను బలోపేతం చేస్తుందని వెల్ల‌డి
- అకడమిక్ అర్హతల పరస్పర గుర్తింపుల‌ కోసం ఉమ్మడి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
- విద్యను అంతర్జాతీయీకరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ఇది తోడ్పడుతుందన్న‌ విద్యా మంత్రి

Posted On: 16 DEC 2020 4:46PM by PIB Hyderabad

 

భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్ వారి విద్యా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల‌ని సంకల్పించాయి. ఈ రోజు జ‌రిగిన ఒక ద్వైపాక్షిక సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’, యుకే విదేశాంగ కార్యదర్శి ఆర్టి డొమినిక్ రాబ్‌లు పాల్గొన్నారు. ఇరుదేశాల మ‌ధ్య‌ విద్య పరిశోధన రంగంలో తమ నిశ్చితార్థాన్ని మరింతగా పెంచడానికి అంగీకరించాయి. వచ్చే సంవత్సరంలో విద్యా అర్హతలను పరస్పరం గుర్తించడంలో సహకారంపై పని చేయాల‌ని నిర్ణ‌యించాయి. సమావేశంలో కేంద్ర విద్యాశాఖ స‌హాయ ‌మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యూకే విదేశాంగ కార్యదర్శి శ్రీ డొమినిక్ రాబ్, భారతదేశ జాతీయ విద్యా విధానం 2020ను దూరదృష్టితో కూడుకున్న విధానం అని ప్రశంసించారు. ప్రతిపాదిత సంస్కరణలు విద్యార్థులకు, ఆర్థిక వ్యవస్థకు మరియు ఇరు దేశాల మధ్య లోతైన క‌లిసి ప‌ని చేయ‌డానికి, సహకారానికి అవకాశాలను తెరుస్తాయని అన్నారు. విద్య భారతదేశం మరియు యుకే మధ్య జీవన వంతెన అని 2018లో యుకే పర్యటన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేసిన ప్రకటనను ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకున్న రాబ్, ఈ వంతెనను మరింత బలోపేతం చేయడానికి కొత్త‌ విధానం సహాయపడుతుందని అన్నారు. భారత దేశంలో మెరుగైన విద్యా కఠినత విష‌య‌మై యుకేకు మంచి  గౌరవం ఉందని అన్నారు. భారతీయ విద్యార్థి స‌మూహం తన దేశానికి ఎంతో విలువైనదని ఆయన అన్నారు. విద్యార్థుల చైతన్యాన్ని సులభతరం చేయడానికి వారి వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనలలో యుకే అనేక ర‌కాల మార్పులు చేసిందని ఆయన తెలియజేశారు. విద్యా అర్హతలను పరస్పరం గుర్తించే దిశగా క‌లిసి పని చేయడానికి ఇరు దేశాల నుండి నియమించబడిన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడానికి భారత్, యుకేలు అంగీకరించాయి.
టాస్క్ ఫోర్స్ యొక్క కూర్పు, విధివిధానాల‌ను అధికారిక స్థాయిలో నిర్ణ‌యిస్తాయి.
ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పొఖ్రియాల్ ‘నిశాంక్’ మాట్లాడుతూ ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం వల్ల విద్యా అర్హతపై పరస్పర గుర్తింపు సాధించే ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. ఇది ఉన్నత విద్య యొక్క అంతర్జాతీయకరణ కోసం భారతదేశం యొక్క ఎజెండాకు మద్దతు ఇస్తుంద‌ని తెలిపారు. అకాడెమిక్ అర్హతలను పరస్పరం గుర్తించే దిశగా పనిచేసే ఒప్పందం ప్రపంచ వ్యాప్తంగా వ‌ల‌స‌ శ్రామిక శక్తిని సృష్టించడం, భారతీయ ఉన్నత విద్యను అంతర్జాతీయీకరించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ దృష్టితో స‌మంగా మిళిత‌మ‌వుతుంద‌ని అన్నారు. కేంద్రజాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020లో ప్రతిపాదించినట్టుగా జులైలో అమ‌లులోకి తేవ‌డమైంది. యుకే దేశంతో భారతదేశ విద్యా సంబంధాలపై శ్రీ పొఖ్రియాల్ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య సంబంధాలు సానుకూలంగా మరియు సహకారంగా ఉన్నాయ‌న్నారు. నేటి ఒప్పందం విద్య, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా సంబంధాలను పెంచడానికి వారి మధ్య నిరంతర పరస్పర విశ్వాసాన్ని సూచిస్తుంద‌ని తెలిపారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలలో పరస్పరం క‌లిసి ప‌ని చేయ‌డాన్ని ఇది మరింత పెంచుతుందన్నారు. ఇరు పక్షాలు ఆశాభావం మరియు విశ్వాసం వ్యక్తం చేశాయి. ఇది లోతైన మరియు బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు దారితీసింది.

 

****



(Release ID: 1681300) Visitor Counter : 168