యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో 6 ప్రపంచ స్థాయి స్క్వాష్ కోర్టులు; మంత్రి శ్రీ కిరెన్ రిజిజు సమక్షంలో శంకుస్థాపన చేసిన కేంద్ర విదేశాంగశాఖమంత్రి
प्रविष्टि तिथि:
16 DEC 2020 6:14PM by PIB Hyderabad
కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రి శ్రీ కిరెన్ రిజిజు సమక్షంలో మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో 6 స్క్వాష్ కోర్టులకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి డాక్టర్ శ్రీ ఎస్. జైశంకర్ స్వయంగా క్రీడా ప్రియుడు మరియు ఆసక్తిగల స్క్వాష్ ప్లేయర్. ఈ ప్రాజెక్టును ఆయన ప్రశంసించారు. స్టేడియం పూర్తిగా సిద్ధమైన తర్వాత ఇందులో స్క్వాష్ ఆడటానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "భారతదేశంలో అద్భుతమైన క్రీడా ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను పెంపొందించడానికి సమయం ఇచ్చే సామర్థ్యం మరియు ఉత్సాహభరితమైన కోచ్‌లు ఉన్నారు. అయితే ప్రతిభావంతులు కోచ్‌లను కలుసుకునే ప్రదేశం లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ఆ లోటు భర్తీ అవుతుంది. మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి ఉత్ప్రేరకం అవుతుంది. అలాగే క్రీడాలను ప్రజలందరికీ చేరేవిధంగా చూడాలి. అది కొందరికి మాత్రమే ప్రత్యేక హక్కు కాకూడదు. ఆ క్రమంలో మేము చాలా క్రీడలను ప్రజల్లోకి తీసుకువెళ్లాం. స్క్వాష్ విషయంలో ఆ దిశలో ఒక అడుగు అని నేను ఆశిస్తున్నాను.." అని చెప్పారు.
750 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.5.52 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను 6 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 6 సింగిల్ స్క్వాష్ కోర్టులు ఉంటాయి. వీటిలో 3 కోర్టులను కదిలే గోడలను ఉపయోగించి డబుల్స్ కోర్టులుగా మార్చవచ్చు.
ఈ కొత్త సదుపాయం ఏర్పాటు ద్వారా ప్రపంచ ఛాంపియన్లను ఉత్పత్తి చేసే అవకాశం లభిస్తుందని క్రీడా మంత్రి శ్రీ కిరెన్ రిజిజు అన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. "నేషనల్ స్టేడియంలో తగినంత స్థలం ఉంది. ఈ కాంప్లెక్స్‌లో ఉన్న స్థలం ఈ సదుపాయం కల్పించడానికి ఉపయోగపడింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ 6 స్క్వాష్ కోర్టులు.. ప్రపంచ ఛాంపియన్లను ఉత్పత్తి చేయబోయే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా కూడా మారబోతున్నాయి. రాబోయే జూనియర్ క్రీడాకారులు ఈ కేంద్రం యొక్క గరిష్ట ప్రయోజనాన్ని పొందుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆటగాళ్ళు సౌకర్యాల కోసం ఎదురుచూడవలసిన అవసరం లేకుండానే వారికి మేము సౌకర్యాలు కల్పించడానికి కృషిచేస్తున్నాము" అని తెలిపారు.
ఏసియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారతదేశం విజయాలు సాధించిన క్రీడల్లో స్క్వాష్ ఒకటి. సౌరవ్ ఘోసల్, దీపికా పల్లికల్ మరియు జోష్నా చిన్నప్పలు ఈ క్రీడలో దేశానికి పతకాలు సాధించారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ శ్రీ సందీప్ ప్రధాన్, సైరస్ పోంచా, సెక్రటరీ జనరల్ స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ); శ్రీ నీలేష్ షా, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఎన్బీసిసి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 1681294)
आगंतुक पटल : 136