వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై ఏర్పాటైన మంత్రివ‌ర్గ సంఘం (సిసిఇఎ)


చెర‌కు రైతుల కోసం దాదాపు 3,500 కోట్ల రూపాయ‌ల సాయానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


ఈ స‌హాయ రాశి ని రైతుల ఖాతాల‌ లోకి నేరు గా జ‌మ ‌చేయ‌డం జ‌రుగుతుంది

ఈ నిర్ణ‌యం అయిదు కోట్ల చెర‌కు రైతుల‌కు, వారిపై ఆధార‌ప‌డ్డ వారికి, అలాగే చెర‌కు మిల్లుల‌ లో, ఇతర స‌హాయ‌క కార్య‌క‌లాపాల‌ లో ప‌నిచేస్తున్న అయిదు ల‌క్ష‌ల మంది శ్రామికుల‌కు ప్ర‌యోజ‌న‌కారి కానుంది

Posted On: 16 DEC 2020 3:34PM by PIB Hyderabad

చెర‌కు రైతులకు (గన్నా కిసాన్) దాదాపు గా 3,500 కోట్ల రూపాయ‌ల సాయాన్ని అందించ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన ఆర్థిక వ్య‌వ‌హారాల మంత్రివ‌ర్గ సంఘం (సిసిఇఎ) స‌మావేశం ఆమోదం తెలిపింది.

ప్ర‌స్తుతం, భార‌త‌దేశం లో చెర‌కు రైతులు, వారిపై ఆధార‌ప‌డ్డ‌ వారు దాదాపు గా 5 కోట్ల మంది ఉన్నారు.  దీనికి అదనంగా, చెర‌కు మిల్లుల‌లోను, ఇతర తత్సంబంధిత స‌హాయ‌క కార్య‌క‌లాపాల‌ లోను ఉపాధి ని పొందుతున్న‌ వారు సుమారు గా అయిదు ల‌క్ష‌ల మంది శ్రామికులు కూడా ఉన్నారు; వీరు అంద‌రి బ్రతుకుదెరువు చ‌క్కెర ప‌రిశ్ర‌మ పై ఆధార‌ప‌డి ఉంది.

రైతులు వారు పండించిన చెర‌కు ను చ‌క్కెర మిల్లుల‌కు అమ్ముతారు.  కానీ,  చ‌క్కెర మిల్లుల య‌జ‌మానుల నుంచి వారికి చెల్లింపులు అందడం లేదు; ఎందుకంటే, వారి వద్ద చ‌క్కెర అదనం గా నిలవ ఉంటోంది.  ఈ సమ‌స్య‌ ను ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌భుత్వం చ‌క్కెర అదనపు నిలవ‌ల‌ను సున్నా కు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.  దీనితో చెర‌కు రైతుల‌కు బ‌కాయిలు చెల్లించ‌డంలో వెసులుబాటు కలుగుతుంది.  ప్ర‌భుత్వం ఈ ఉద్దేశ్యం తో  దాదాపు 3,500 కోట్ల రూపాయల‌ను వెచ్చించనుంది.  ఈ స‌హాయ రాశి ని  చెర‌కు మిల్లుల తరఫున బకాయిల చెల్లింపు లో భాగంగా నేరు గా రైతుల ఖాతాల‌ లో జ‌మ చేయ‌డం జ‌రుగుతుంది.  మిగిలిన రాశి ని, ఒక వేళ మిగిలితే గనక, చక్కెర మిల్లుల తాలుకు ఖాతా లో జ‌మ చేసేయ‌డం జ‌రుగుతుంది.

2020-21 చెర‌కు సీజ‌ను లో చ‌క్కెర మిల్లుల‌కు కేటాయించిన మేక్సిమ‌మ్ అడ్ మిసిబుల్‌ ఎక్స్‌పోర్ట్ కోటా (ఎమ్ఎఇక్యు) ప్రకారం 60 ఎల్ఎమ్‌టి వ‌ర‌కు ఉండే చ‌క్కెర ను ఎగుమ‌తి చేసిన‌ప్పుడు దానిక‌య్యే చేరవేత రుసుములు, అంత‌ర్గ‌త ర‌వాణా, అంత‌ర్జాతీయ ర‌వాణా ఖ‌ర్చులు, హ్యాండ్లింగ్‌, అప్ గ్రేడింగ్ త‌దిత‌ర ప్రోసెసింగ్ వ్య‌యాలు స‌హా మార్కెటింగ్ సంబంధిత ఖర్చులను పూర్తి చేయడ‌మే ఈ స‌బ్సిడీ ఉద్దేశ్యం గా ఉంది. 

ఈ నిర్ణ‌యం తో చెర‌కు రైతులు, వారి మీద ఆధార‌ప‌డ్డ వారు కలుపుకొని అయిదు కోట్ల మందితో పాటు చెర‌కు మిల్లు లు, ఇతర స‌హాయ‌క కార్య‌క‌లాపాల‌ లో తలమునకలుగా ఉండే అయిదు లక్షల మంది శ్రామికుల‌కు కూడా లాభం చేకూరుతుంది.  


***


(Release ID: 1681167) Visitor Counter : 165