వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

హస్తకళ , జిఐ బొమ్మలకు నాణ్యత నియంత్రణ నియమాల నుండి మినహాయింపు

Posted On: 12 DEC 2020 12:15PM by PIB Hyderabad

భారత్ను బొమ్మల తయారీ, ఎగుమతులకు ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చాలన్న ప్రధానమంత్రి మార్గదర్శక ప్రణాళికకు అనుగుణంగా పరిశ్రమ , కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డిపిఐఐటి), సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. దేశవ్యాప్తంగా దేశీయ బొమ్మల ఉత్పత్తి , అమ్మకం. బొమ్మల ప్రామాణీకరణ , నాణ్యతను పాటించడం కోసం నాణ్యత నియంత్రణ ఉత్తర్వును ఈ విభాగం జారీ చేసింది.  2021 జనవరి 1 నుండి ఇది అమల్లోకి వస్తుంది. స్వదేశీ బొమ్మల నాణ్యతా ప్రమాణాలను కొనసాగిస్తూనే ‘టీమప్ ఫర్ టాయ్స్’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు , భాగస్వామ్య పక్షాల సమన్వయ ప్రయత్నాలను ముందుకు తీసుకురావడం ఈ ఉత్తర్వు లక్ష్యం.

ఇప్పుడు, దేశంలోని మధ్యతరహా, చిన్న , సూక్ష్మ బొమ్మల ఉత్పత్తి పరిశ్రమలకు ప్రోత్సాహాన్నిచ్చే ప్రయత్నాల్లో భాగంగా, డిపిఐఐటి టాయ్స్ (క్వాలిటీ కంట్రోల్) రెండవ సవరణ ఉత్తర్వును విడుదల చేసింది. డెవలప్మెంట్ కమిషనర్ (హస్తకళలు)  వద్ద రిజిస్టర్ అయిన కళాకారులు ,  బొమ్మల తయారీకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బీఐఎస్ (కన్ఫార్మిటీ అసెస్‌మెంట్) రెగ్యులేషన్స్, 2018  షెడ్యూల్- II  స్కీమ్ 1 ప్రకారం స్టాండర్డ్ మార్క్ వాడకం నుండి మినహాయింపు పొందుతారు.

బీఐఎస్ (సీఏ) రెగ్యులేషన్స్, 2018  షెడ్యూల్- II  స్కీమ్ 1 ప్రకారం, భారతీయ బొమ్మల ప్రమాణాలను అనుసరించాల్సిన అవసరం లేకుండా , బ్యూరో నుండి ప్రామాణిక మార్క్ లైసెన్స్‌ను  ఉపయోగించడం అవసరం లేకుండా, భౌగోళిక సూచికలుగా నమోదు చేసిన ఉత్పత్తులకు ఈ ఉత్తర్వు మినహాయింపు ఇస్తుంది. డిపార్ట్మెంట్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, ‘‘రిజిస్ట్రార్ ఆఫ్ భౌగోళిక సూచికలు, కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ద్వారా భౌగోళిక సూచీగా నమోదైన ప్రొడక్టుగా పేర్కొంటూ రిజిస్టర్డ్ ప్రొప్రైటర్లు, అధికార వినియోగదారుడు తయారు చేసిన వస్తువులు లేదా బొమ్మలకు ఈ ఉత్తర్వులోని అంశాలు వర్తించవు”అని పేర్కొంది.

“ఈ ఆర్డర్‌లో ఏదీ రిజిస్టర్డ్ ప్రొప్రైటర్ , భౌగోళిక సూచికగా నమోదు చేయబడిన ఉత్పత్తి  అధీకృత వినియోగదారుడు తయారు చేసిన , విక్రయించిన వస్తువులు లేదా కథనాలకు వర్తించదు, (CGPDTM) ”

 

****


(Release ID: 1680502) Visitor Counter : 150