రక్షణ మంత్రిత్వ శాఖ
ఏసియాన్ రక్షణ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ఆన్‌లైన్ లో ప్రసంగించిన రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
చట్టబద్ధపాలనకు ఎదురౌతున్న ముప్పును, సముద్ర మార్గ రక్షణ, సైబర్ సంబంధిత నేరాలు, ఉగ్రవాదాల సమస్యలను ఎదుర్కోవాలి : రాజ్‌నాథ్ సింగ్
Posted On:
10 DEC 2020 1:43PM by PIB Hyderabad
కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ 14వ ఏసియాన్ రక్షణమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆన్‌లైన్ ద్వారా ఈ సమావేశం వియత్నాంలోని హనోయ్‌లో 2020 డిసెంబర్ 10 న జరిగింది. ఎడిఎంఎం ప్లస్ 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సమావేశం జరిగింది.
ఎడిఎంఎం ప్లస్ సమావేశం, 10 ఏసియాన్ దేశాల రక్షణ మంత్రులు, 8 భాగస్వామ్య దేశాల వార్షిక సమావేశం. ఎడిఎంఎం ప్లస్ ఫోరం ఏర్పాటు చేసి ఈ ఏడాది ఇది పదవ సంవత్సరం. ఈ దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం ప్రధానమంత్రి న్యుయన్ క్సుయాన్ ఫూ హాజరయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు ఈ సమావేశంలో ప్రసంగించే ప్రత్యేక అవకాశం లభించింది. ఇది ఈ ఫోరంలో ఇండియాకుగల ప్రాధాన్యతను తెలియజేస్తుంది.ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ , ఆసియాలో బహుళపక్ష, సహకారాత్మక భద్రత,
విషయంలొ ఏసియాన్ కేంద్రిత ఫోరం వహిస్తున్న పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. గత దశాబ్ద కాలంలో బహుళపక్ష సహకారం, వ్యూహాత్మక సంప్రదింపుల ద్వారా ఎడిఎంఎం ప్లస్ సమష్టిగా సాధించిన విజయాలను , ఆచరణాత్మక భద్రతా చర్యలను ఆయన ప్రస్తావించారు. సముద్రయాన భద్రత, మానవతా సహాయం, విపత్తుల సహాయం, ఉగ్రవాద వ్యతిరేక పోరు, శాంతి పరిరక్షణ కార్యకలాపాలు వంటి వాటికి సంబంధించి ఏడు నిపుణుల బృందాలు సాధించిన విజయాలను ఆయన అభినందించారు.
ఎడిఎంఎం ప్లస్ సమావేశం సందర్బంగా ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత, పర్యావరణానికి సంబంధించి కూడా రక్షణమంత్రి ప్రసంగించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి ఇండియా దృష్టికోణం గురించి మాట్లాడారు. ఇండియా పసిఫిక్ ప్రాంతం ప్రత్యేకించి సంప్రదాయికంగా, సంప్రదాయేతరంగా ఎన్నో రకాలుగా భద్రతాముప్పును ఎదుర్కొంటున్నదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ ( ఐపిఒఐ) గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
గత ఏడాది తూర్పు ఆసియా సమావేశం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఐపిఒఐ ఒక అంతర్జాతీయ కార్యక్రమం. ఇది ప్రస్తుత ప్రాంతీయ సహకారం పునాదిగా, యంత్రాంగం ఆధారంగా నడుస్తుంది. ఇండియా, ఐపిఒఐల మధ్య , ఇండో పసిఫిక్‌పై ఏసియాన్ వైఖరి రెండూ పరస్పర సహకారానికి సంబంధించిన అవకాశాలని ఆయన అన్నారు. ఏసియాన్ సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, జపాన్, దక్షిణ క ఒరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల కక్షణమంత్రులనుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన,
సార్వభౌత్వంపట్ల గౌరవం, ఆయా దేశాల ప్రాదేశిక సమగ్రత, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం , అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలను పాటించడం పునాదిగా బాహాటమైన సమగ్రమైన విధానలను ఇండో పసిఫిక్ పాటించాలని రక్షా మంత్రి పిలుపునిచ్చారు. అలాగే సముద్ర చట్టాల ప్రకారం యుఎన్ కన్వెన్షన్‌కు అనుగుణంగా అంతర్జాతీయ జాలాలపై నావిగేషన్, ఓవర్ ఫ్లైట్ స్వేచ్ఛను ఆయన పునరుద్ఘాటించారు. పరస్పర విశ్వాసం , నమ్మకం , సంయమనం అవసరమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఉగ్రవాదం ఈ ప్రాంతానికి, ప్రపంచానికి ఒక పెద్ద సవాలు అని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి మద్దతునిచ్చే వ్వవస్థలు, మద్దతు కొనసాగుతూనే ఉన్నదని, ఇవి ఇండియా పొరుగున కూడా జరుగుతున్నాయన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవలసి ఉందని ఆయన అన్నారు. ఇందుకు సంయుక్తంగా గట్టి చర్యలు అవసరమని ఆయన అన్నారు.
ఏసియాన్ సంబంధింత డిఫెన్స్ ఈవెంట్‌లు అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు రాజ్‌నాథ్ సింగ్ వియత్నాంకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్-19 సంబంధిత ఆంక్షలు ఉన్నప్పటికీ వీటిని అద్భుతంగా నిర్వహించారన్నారు. బ్రూనై దారుస్సలాం కు ఆయన స్వాగతం పలుకుతూ వారి అధ్యక్షతన 2021 ఈవెంట్‌లు విజయవంతంగా నిర్వహించగలరన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
***
(Release ID: 1679723)
Visitor Counter : 301