ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మాన్య శ్రీ శావ్ కత్ మిర్జియోయెవ్ కు మధ్య వర్చువల్ పద్ధతి లో శిఖరాగ్ర సమావేశం

Posted On: 09 DEC 2020 6:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మాన్య శ్రీ శావ్ కత్ మిర్జియోయెవ్ కు మధ్య ఈ నెల 11 న శిఖర సమ్మేళనం వర్చువల్ పద్ధతి లో జరగనుంది.
   
ఇది భారతదేశానికి, మధ్య ఆసియా లోని ఒక దేశానికి మధ్య చోటు చేసుకొంటున్న ప్రథమ ద్వైపాక్షిక ‘వర్చువల్ సమిట్’ కానుంది.  నేతలు కోవిడ్ అనంతర జగత్తు లో భారతదేశం- ఉజ్బెకిస్తాన్ సహకారాన్ని పటిష్టపర్చుకోవడం సహా ద్వైపాక్షిక సంబంధాలను గురించి సమగ్రంగా చర్చించనున్నారు. వారు పరస్పర హితం ముడిపడ్డ ప్రాంతీయ అంశాలపై, ప్రపంచ అంశాలపై తమ తమ అభిప్రాయాలను కూడా ఒకరికి మరొకరు తెలియజేసుకోనున్నారు. 

భారతదేశం, ఉజ్బెకిస్తాన్ లు ఇటీవలి కాలంలో ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాలను కొనసాగించాయి.  ప్రధాన మంత్రి 2015 లోను, 2016 లోను ఉజ్బెకిస్తాన్ ను సందర్శించడం, అధ్యక్షుడు శ్రీ మిర్జియోయెవ్ 2018 లోను, 2019 లోను భారతదేశాన్ని సందర్శించడం వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక నూతన గతిశీలత ను అందించాయి.

వర్చువల్ సమిట్ తో పాటే ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య అనేక ఒప్పందాలు/అవగాహనపూర్వక ఒప్పందాలు తుదిరూపు ను సంతరించుకొనే  అవకాశం కూడా ఉంది.


***


(Release ID: 1679631)