బొగ్గు మంత్రిత్వ శాఖ
గనుల రంగ సామర్ధ్యాన్ని సద్వినియోగం చేసేలా ప్రభుత్వం గనుల రంగంలో పలు నిర్మాణాత్మకసంస్కరణలతో ముందుకు వస్తున్నది:శ్రీ ప్రహ్లాద్ జోషి
Posted On:
02 DEC 2020 5:20PM by PIB Hyderabad
గనుల రంగానికి గల వాస్తవ పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం గనుల రంగంలో పలు నిర్మాణాత్మక సంస్కరణలతో ముందుకు వస్తున్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్‌జోషి తెలిపారు. 15 వ గ్లోబల్ మైనింగ్ శిఖరాగ్ర సమావేశం, మైనింగ్, మెషినరీ ఎగ్జిబిషన్‌లో ఈరోజు ఆయన మాట్లాడారు.
మైనింగ్ రంగంలో ప్రతిపాదిత నిర్మాణాత్మక మార్పులు , ఈ రంగంలో గనుల తవ్వకానికి సంబంధించి ప్రైవేటు రంగం పాల్గొనడాన్ని పెంచేందుకు, గనుల బ్లాకులను వేలం వేయడానికి గనుల అన్వేషణ నిబంధనలను పునర్‌నిర్వచించడానికి ,గనుల అన్వేషణనుంచి ఉత్పత్తి వరకు కార్యకలాపాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగడానికి ప్రభుత్వ చర్యలు ఉపయోగపడతాయి. మైనింగ్ బ్లాక్‌ల వేలానికి గనుల అన్వేషణప్రమాణాల పునర్‌నిర్వచించడానికి, మైనింగ్ హక్కులకు ఓపన్ ఏకరేజ్ లైసెన్సింగ్ పాలసీని పునర్ నిర్వచించడానికి ఇవి దోహదపడతాయి. ఇది దేశంలో గనుల ఉత్పత్తి ని పెంచడానికి ఉపయోగపడుతుందని శ్రీ జోషి పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకువస్తున్న సానుకూల సంస్కరణలను ప్రస్తావిస్తూ శ్రీ జోషి, మార్చి 2020 కీలక సంవత్సరమని, ఈ సంవత్సరంలోనే పెద్ద సంఖ్యలో గడువు తీరిన గనులు ఎన్నో ఉన్నాయని, వాటికి సత్వరం వేలం నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం సానుకూల, అతి పెద్ద పారిశ్రమ అనుకూల చర్యను తీసుకుంది. ఇది కొత్త లీజుదారులకు అన్ని చట్టబద్ధమైన క్లియరెన్సులను ఆర్డినెన్సు ద్వారా బదలీచేయడానికి వీలు కల్పిస్తుంది.
ఈ ప్రత్యేక రంగంలో సంస్కరణల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, ఆర్డినెన్సు రావడంతో ఒడిషాలో ఇటీవల పెద్ద సంఖ్యలో ఇనుపగనుల ఆక్షన్లను విజయవంతంగా పూర్తిచేయగలిగినట్టు తెలిపారు. అయితే కొంతమంది విజయవంతమైన బిడ్డర్లు ఉత్పత్తిని ఆలస్యం చేయడం ద్వారా ఆక్షన్ల ప్రక్రియను తప్పించుకో జూస్తున్నారన్నారు. ఇలాంటి కేసులను తీవ్రంగా పరిగణించనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రప్రభుత్వాల సమన్వయంతో ఇలాంటి కేసులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది.
ఆసక్తిలేని వారిని తొలగించడంతోపాటు భవిష్యత్తు ఆక్షన్ల నుంచి వారిని నిషేధించనున్నారు.
దేశంలో గనులకు సంబంధించిన వనరుల వేలం పూర్తి విజయవంతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఇది రాష్ట్రప్రభుత్వాలకు రాబడి, ఉపాధి కల్పించనుంది.
దేశం 5 ట్రిలియన్ అమెరికన్‌డాలర్ల ఆర్ధిక వ్యవస్థను చేరుకోవడానికి ఎంతో కీలకం. ఇండియలో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. పరిశ్రమ దేశ ఆర్ధిక వ్యవస్థకు , దేశ జిడిపికి , అలాగే పరోక్షంగా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధికి దోహదపడనుంది.
గనుల రంగం పారిశ్రామిక అభివృద్ధితో అనుసంధానతతో ప్రభుత్వం తన ప్రాధాన్యతలను కూడా మార్పుచేసుకుంది. ముడి సరకు లభ్యత, దేశ ఆర్ధిక వ్యవస్థ నిర్వహణ, సహజవనరులు వంటి వాటి దిశగా మార్చింది. రెగ్యులేటరీ పరిస్థితులు సులభతర వాణిజ్యానికి అనుకూలంగా , పారదర్శకంగా ఉండడానికి , వ్యాపార నిర్వహణకు నిర్ణీత కాలావధితో కూడిన విధానాలను తీసుకురావడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది.
ఇటీవలి గనులు, బొగ్గు రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను వివరిస్తూ, శ్రీ జోషి, ఉద్యోగాల కల్పనతోపాటు, ఇంధన దిగుమతులపై ఆధారపడడం తగ్గించడంతోపాటు, ఇది ఆర్ధిక ప్రగతికి దోహదపడుతుందన్నారు. బొగ్గు రంగాన్ని ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరవడంతో రాగల 5 నుంచి 7 సంవత్సరాల కాలంపాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించడానికి ఇది దోహదపడుతుంది.గనుల, ఖనిజాల అన్వేషనలో, ఖనిజేతర గనుల విషయంలో ఎఫ్‌డిఐ పరిమితిని ఆటోమేటిక్‌రూట్ లో 100 శాతానికి పెంచడం జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివిధ ఖనిజాలకు సంబంధించి 400 ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులను అమలు చేయడం ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాదాపు గా తన ఖనిజ అన్వేషణ కార్యకలాపాలను రెట్టింపు చేసింది.
***
(Release ID: 1677871)
Visitor Counter : 302