పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ఎం.ఎన్‌.జి.ఎల్ వారి 100వ సి.ఎన్‌.జి స్టేష‌న్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌

మ‌న ఇంధ‌న ప‌రివ‌ర్త‌న మార్గ సూచి మ‌న‌ల్ని స్వావ‌లంబ‌న దిశ‌గా నడిపి,పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌నున్న‌ద‌న్న శ్రీ‌ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌

Posted On: 01 DEC 2020 12:55PM by PIB Hyderabad

కేంద్ర పెట్రోలియం , స‌హ‌జ‌వాయు వు, స్టీలు శాఖ మంత్ర శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఈరోజు ఎం.ఎన్‌.జి.ఎల్‌కు చెందిన ఐ సిఎన్‌జి స్టేష‌న్ల‌ను వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా జాతికి అంకితం చేశారు.  దీనితో కంపెనీ 100సిఎన్‌జి స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్ట‌యింది.  అలాగే మంత్రి నాసిక్‌లో బ‌స్సుల‌కు సిఎన్‌జి స‌ర‌ఫ‌రాకు సంబంధించి ఎల్ఎన్‌జి , సిఎన్‌జి స్టేష‌న్ సివిల్ ప‌నుల‌ను ప్రారంభించారు. అలాగే పూణేలో మొబైల్ రీ ఫ్యూయ‌లింగ్ యూనిట్ (ఎంఆర్‌యు) కేటాయింపు ద్వారా సిఎన్జి పంపిణీని ప్రారంభించారు
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ శ్రీ ప్ర‌ధాన్‌, ఇండియా 2030 నాటికి ప్రైమ‌రీ ఎన‌ర్జీ మిక్స్‌లో 15 శాతం స‌హ‌జ‌వాయు వాటాను సాధించ‌డానికి క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఇది సుస్థిర ఇంధ‌న వినియోగానికి ఉప‌యొగ‌ప‌డుతుంద‌న్నారు. ఇది ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యాన్ని త‌గ్గిస్తుంద‌ని, సి.ఒ.పి.ఇ -21 వాతావ‌ర‌ణ మార్పుల కు సంబంధించిన సంక‌ల్పాల‌ను నేర‌వేరుస్తుంద‌న్నారు. స‌హ‌జ‌వాయువును  ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల శిలాజ ఇంధ‌న వినియోగం త‌గ్గుతుంది. దీనివ‌ల్ల మ‌న ఇంధ‌న దిగుమ‌తుల బిల్లు త‌గ్గుతుంది. ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌కు సంబంధించిమ‌న మార్గ సూచి స్వావ‌లంబ‌న దిశ‌గా సాగ‌డ‌మే కాక పెద్ద ఎత్తున ఉపాధి క‌ల్పించ‌నుందని ఆయ‌న తెలిపారు.
ఇవాళ సిఎన్‌జి కేంద్రాల ప్రారంభంతో ఎం.ఎన్‌.జి.ఎల్ కు 100 సిఎన్‌జి స్టేష‌న్ల నెట్‌వ‌ర్క్ఉన్న‌ట్టు అయింది. ఈరోజు 5 కేంద్రాలు చేర‌డంతో మ‌న‌కు మొత్తం 2500 సిఎన్‌జి స్టేష‌న్లు ఉన్న‌ట్టు అయింది. అయితే రాగ‌ల 7-8 సంవ‌త్స‌రాల‌లో వీటిని మ‌నం 10,000 వ‌రకు తీసుకువెళ్ల‌వ‌ల‌సి ఉంది అని ఆయ‌న అన్నారు. మ‌హారాష్ట్ర ఎస్‌.ఆర్‌.టి.సి బ‌స్సుల‌కు సిఎన్‌జి రెట్రోఫిట్టింగ్‌కు ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. అలాగే కేర‌ళ ఎస్ఆర్‌టిసి త‌మ బ‌స్సుల‌ను సిఎన్‌జికి మార్చేందుకు ప్ర‌యోగాత్మ‌కంగా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ది. దేశంలో మొద‌టిసారిగా ఎం.జి.ఎన్‌.ఎల్ మొబైల్ రీఫ్యూయ‌లింగ్ యూనిట్ (ఎంఆర్‌యు) ఏర్పాటుకుచొర‌వ తీసుకున్న‌ద‌న్నారు.
స‌హ‌జ‌వాయు వినియోగంలో సిజిడి రంగం ప్ర‌ధాన ప‌రిశ్ర‌మ‌గాఎదిగింద‌న్నారు. మ‌రిన్ని జిఎలు ప‌నిచేయ‌డం ప్రారంభించేకొద్దీ  డిమాండ్ పెర‌గ‌నుంది. దీనితో దేశీయంగా ,ర‌వాణా, వాణిజ్య‌, పారిశ్రామిక రంగాల సిజిడినెట్‌వ‌ర్కుల ద్వారా వినియోగ‌మూ పెర‌గ‌నుంది.
దేశ తొలి 50 ఎల్‌.ఎన్‌.జి ఇంధ‌న స్టేష‌న్లు స్వ‌ర్ణ‌చ‌తుర్భుజి వెంట ఏర్పాఉకు శంకుస్థాప‌న చేయ‌డం జ‌రిగింద‌ని మంత్రి చెప్పారు.అలాగే, అన్ని ప్ర‌ధాన జాతీయ ర‌హ‌దారుల వెంట ఎల్‌.ఎన్‌.జి ఆధారిత సిఎన్‌జి స్టేష‌న్లు ఉండేలా చూడ‌డం జ‌రిగింద‌న్నారు.దేశంలో 10,000 ఎల్‌.ఎన్‌.జి స్టేష‌న్ల ఏర్పాటుకు రాగ‌ల మూడు సంవ‌త్స‌రాల‌లో 10,000 కోట్ల‌రూపాయ‌లు వెచ్చించ‌నున్న‌ట్టు తెలిపారు.
సిఎన్‌జి,ఎల్‌.ఎన్‌.జి మౌలిక‌స‌దుపాయాలు ఒఇఎం రంగం, సిజిడి ప‌రిక‌రాల త‌యారీ, ర‌వాణా రంగం త‌దిత‌రాల‌లో మౌలిక‌స‌దుపాయాల‌ను ముందుకు తీసుకువెళ్ల‌నున్న‌దని, పెద్ద ఎత్తున ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు ఆత్మ‌నిర్భ‌ర్‌భార‌త్ దిశ‌గా పెద్ద ముంద‌డుగు కానున్న‌ద‌ని చెప్పారు.

పెట్రోలియం, స‌హ‌జ‌వాయుశాఖ కార్య‌ద‌ర్శి శ్రీ త‌రుణ్‌క‌పూర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, సిఎన్‌జి, ఎల్‌.ఎన్‌. జి స్టేష‌న్ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం పూర్తి మ‌ద్ద‌తునిస్తున్న‌ట్టు చెప్పారు. ఆయాకంపెనీలు త‌మ ప్లాంట ఏర్పాటును వేగ‌వంతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 2-3 సిబిజి ప్లాంట్ల‌ను త్వ‌ర‌లోనే గ్యాస్ నెట్‌వ‌ర్క్‌కు అనుసంధానం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా కోరారు.

***


(Release ID: 1677595) Visitor Counter : 177