హోం మంత్రిత్వ శాఖ
తీవ్రవాయుగండం పై ఎన్‌సిఎంసి సమావేశానికి అధ్యక్షత వహించిన కేబినెట్ కార్యదర్శి
Posted On:
01 DEC 2020 3:42PM by PIB Hyderabad
తమిళనాడు, కేరళ దక్షిణ తీరంలో తీవ్రతరం అవుతున్న వాయుగుండం నేపథ్యంలో మంగళవారంనాడు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ- తమిళనాడు, కేరళ ప్రధాన కార్యదర్శులు, లక్షద్వీప్ సలహాదారులు, వివిధ మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.
వివిధ తీవ్రతలతో వీయనున్న గాలులు తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ దక్షిణ కోస్తా తీరం, లక్షద్వీప్ లలో భారీ అతి భారీ వర్షాలు డిసెంబర్ 2-4వ తేదీల మధ్యలో తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వాతావరణ శాఖ (ఐఎండి) డిజి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సూచనల మేరకు పంటలు, అత్యవసర సేవలను ధ్వంసం జరుగవచ్చని తెలుస్తోందని ఆయన చెప్పారు. కనుక చేపలు పట్టే కార్యకలాపాలను డిసెంబర్ 4వ తేదీ వరకు ఆపివేయాలని ఆయన సూచించారు.
జిల్లా విపత్తు కమిటీలు సంబంధిత జిల్లాలలో బెస్తవారికి హెచ్చరికలు చేయడం, రక్షణ దళాల మోహరింపు సహా ఏర్పాట్లు, సంసిద్ధత గురించి తమిళనాడు, కేరళ ప్రధాన కార్యదర్శులు, లక్షద్వీప్ సలహాదారు ఎన్‌సిఎంసికి వివరించారు.
తమిళనాడు వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో అవసరమైన బృందాలను మోహరించామని, మిగిలిన బృందాలను స్టాండ్‌బైగా ఉంచినట్టు ఎన్‌డిఆర్ ఎఫ్ డిజి సభ్యులకు తెలిపారు.
పౌరవిమానయాన శాఖ, టెలికమ్యూనికేషన్, విద్యుత్తు, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శులు , ఎన్‌డిఎంఎ, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తమ సంసిద్ధతల గురించి ఎన్‌సిఎంసికి వివరించారు. విధ్వంసం కనిష్ఠస్థాయిలో ఉండేలా తగిన చర్యలు తీసుకోమని, అత్యవసర సేవలు సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించవలసిందిగా కేబినెట్ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
***
(Release ID: 1677399)
Visitor Counter : 240