శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ద్వైపాక్షిక విద్య-పారిశ్రామిక మరియు ప్రభుత్వ సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా వినూత్నతను పెంచి పోషించడానికి మరియు పారిశ్రామిక పరిశోధనాభివృద్ధికి 'గీత' (GITA) ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది: డాక్టర్ హర్షవర్ధన్

Posted On: 28 NOV 2020 2:59PM by PIB Hyderabad

విశ్వ వినూత్నత మరియు సాంకేతిక మైత్రి  Global Innovation and Technology Alliance (GITA) 'గీత'  9వ సంస్థాపన దినోత్సవం సందర్బంగా ఒక  వీడియో సందేశం ఇస్తూ  ద్వైపాక్షిక విద్య-పారిశ్రామిక మరియు ప్రభుత్వ సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా వినూత్నతను మరియు  పారిశ్రామిక పరిశోధనాభివృద్ధిని ప్రోది చేయడంలో  'గీత'  ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నదని భారత ప్రభుత్వ  విజ్ఞానశాస్త్ర & టెక్నాలజీ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.  

" 'గీత'  ద్వారా  విజ్ఞానశాస్త్ర మరియు సాంకేతిక (డి ఎస్ టి) శాఖ ప్రపంచంలో ఎంతో వినూత్నతను సంతరించుకున్న ఇజ్రాయిల్, కొరియా, కెనడా, ఫిన్లాండ్, ఇటలీ, స్పెయిన్ మరియు బ్రిటన్ వంటి దేశాల సహకారంతో  ద్వైపాక్షిక పారిశ్రామిక పరిశోధనాభివృద్ధి ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయగలిగిందని"  ఉత్సవాలను డిజిటల్ మోడ్ లో ప్రారంభిస్తూ డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.  

ప్రభుత్వ , ప్రైవేట్  భాగస్వామ్యంలో ఏర్పాటైన 'గీత'  స్వయం సమృద్హ భారత్ ఇతివృత్తంగా 9వ సంస్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది.  రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో వివిధ భాగస్వామ్య పక్షాల మద్య అభిప్రాయాల మార్పిడి జరిగింది.  

ప్రధానమంత్రి పిలుపు మేరకు తమ మంత్రిత్వ శాఖ ఆత్మనిర్భర్ భారత్ సాధనకు పాటుపడుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.  

"స్వయం సమృద్ధ దేశం  నిర్మించాలన్న ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా స్ఫష్టమైన ఆదేశాల మేరకు పరిశోధనాభివృద్ధిలో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించడానికి, తదనుగుణంగా భాగస్వామ్య పక్షాల సమష్టి  వ్యూహాల రూపకల్పనకు 'గీత' పనిచేస్తోంది. తద్వారా వాణిజ్య ఉత్పత్తులను మరియు సేవలను పంపిణీ చేయనుందని"  ఆయన  వివరించారు.  

      భారత ప్రభుత్వ విజ్ఞానశాస్త్ర మరియు సాంకేతిక శాఖ (డి ఎస్ టి) కార్యదర్శి మరియు గౌరవ అతిథి ప్రొఫెసర్ ఆశుతోష్ శర్మ మాట్లాడుతూ గడచిన కొద్ది సంవత్సరాలలో కార్యకలాపాల స్థాయి పెరగడం,   ఇజ్రాయిల్, కెనడా, స్వీడన్, కొరియా, ఇటలీ మరియు ఫిన్లాండ్ వంటి దేశాలతో సమన్వయము పెరగడం,  సామర్ధ్యం విస్తరణ  ద్వారా ఎన్నో మార్పులు వచ్చాయని  అన్నారు.  

     " ఆత్మనిర్భర్ భారత్ సాధించడం వేరుగా ఉండటం ద్వారా సాధించేది కాదు,  అందరినీ కలుపుకొనిపోయే విధంగా విశ్వ పరిశోధనాభివృద్ధి శృంఖలలో భాగంగా మారి ప్రపంచ స్థాయిలో పంపిణీ జరపాలి.  మన శక్తిసామర్ధ్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిదానితో మమేకం చేయాలి"   అని ప్రొఫెసర్ శర్మ ఉద్ఘాటించారు.  

    ఆత్మనిర్భరతకు మూలాధారమైన మూడు సాంస్కృతిక  అంశాలు ఆత్మ విశ్వాస్ , ఆత్మ సమ్మాన్  మరియు ఆత్మ చింతనను గురించి ప్రొఫెసర్ శర్మ ప్రముఖంగా ప్రస్తావించారు.  ఆత్మ నిర్భరతకు పాటుపడే ప్రతి ఒక్కరూ వాటిని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.  

" కొత్తది  మరియు  దేశ, విశ్వవ్యాప్త అవసరాలతో సాంగత్యం గల  సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంపైననే  డి ఎస్ టి తమ దృష్టిని కేంద్రీకరించింది.  తద్వారా నూతనత్వం ఉన్న క్రొత్త కల్పనల  కోసం భారత్   పాటుపడుతోంది. విజ్ఞానశాస్త్రం మరియు టెక్నాలజీ ఏ విధంగా స్వయం సమృద్ధ భారత్ సాధనకు తోడ్పడగలవో అర్ధం చేసుకోవడానికి మనం జ్ఞాన శృంఖలను ఏకీకరించవలసిన ఆవశ్యకత ఉంది.  ఈ అవకాశాలన్నింటిలో 'గీత'  పెద్దదైన మరియు మెరుగైన పాత్రను పోషించడాన్ని కొనసాగిస్తుంది"  అని ప్రొఫెసర్ శర్మ అన్నారు.  

        రానున్న కాలంలో టెక్నాలజీ అభివృద్ధి బోర్డు (టి డి బి) మరియు 'గీత' మధ్య సహకారం మరింత పెంపొందగలదనే ఆశాభావాన్ని టి డి బి సెక్రెటరీ డాక్టర్ నీరజ్ శర్మ వ్యక్తం చేశారు.  

       అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సహకారం ఫలితంగా ఈ ఏడాది విజయవంతంగా పూర్తయిన మూడు ప్రాజెక్టులను సంస్థాపన దినోత్సవ వేడుకల సందర్బంగా అభినందించడం జరిగింది.  

       కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖలో అదనపు డెవలప్ మెంట్ కమిషనర్ శ్రీ పియూష్ శ్రీవాత్సవ ,  విజ్ఞానశాస్త్ర మరియు సాంకేతిక శాఖలో అంతర్జాతీయ సహకారం విభాగం అధిపతి డాక్టార్ ఎస్. కె.  వర్షిణి ,  గీతా బోర్డు మొదటి సభ్యుడు మరియు హైటెక్  కంపెనీల గ్రూప్ చైర్మన్ దీప్  కపూరియా  తదితరులు కూడా ఉత్సవాలలో పాల్గొన్నారు.  

***(Release ID: 1677126) Visitor Counter : 211