రాష్ట్రప‌తి స‌చివాల‌యం

గురు నానక్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి శుభాకాంక్షలు

Posted On: 29 NOV 2020 5:04PM by PIB Hyderabad

గురు నానక్ దేవ్‌ జయంతి సందర్భంగా భారతీయులందరికీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు.
    
    "దేశంలో, విదేశాల్లో నివశిస్తున్న భారతీయులందరికీ, ముఖ్యంగా సిక్కు వర్గానికి, పవిత్రమైన గురు నానక్‌ జయంతి సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు".

    "గురు నానక్‌ జీవితం, బోధనలు మానవజాతికి స్ఫూర్తిదాయకం. ఐక్యత, సామరస్యం, సోదరభావం, సేవ మార్గాలను ఆయన ప్రజలకు చూపారు. కృషి, నిజాయతీ, స్వాభిమానంతో జీవించగలిగే ఆర్థికతత్వాన్ని బోధించారు".

    "ప్రాథమిక మంత్రమైన 'ఏక్‌ ఓంకార్‌'ను ఆయన తన అనునాయులకు ఉద్బోధించారు. కుల, మత, లింగ బేధం లేకుండా అందరినీ సమానంగా చూడాలని స్పష్టం చేశారు. ఆయన సందేశమైన 'నామ్‌ జపో, కీరత్‌ కరో, వంద్‌ ఛకో'లో ఆయన బోధనల సారమంతా ఉంది".

    "గురు నానక్‌ జయంతి సందర్భంగా, ఆయన బోధనలను ఆచరిద్దామని నిర్ణయం తీసుకుందాం".

రాష్ట్రపతి సందేశాన్ని హిందీలో చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి

***



(Release ID: 1677052) Visitor Counter : 143