కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

పింఛనుదారులు తమ జీవన ప్రమాణ్ పత్రం సమర్పించడానికి 2021 ఫిబ్రవరి, 28వ తేదీ వరకు గడువు పొడిగించిన - ఈ.పి.ఎఫ్.ఓ.


ప్రయోజనం పొందనున్న - 35 లక్షల మంది ఈ.పి.ఎఫ్.ఓ. పెన్షనర్లు

Posted On: 28 NOV 2020 3:26PM by PIB Hyderabad

కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులు మరియు కరోనా వైరస్ కు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న వృద్ధుల జనాభా దృష్ట్యా, ఈ.పి.ఎఫ్. 1995 కింద పింఛను పొందే పెన్షనర్లు, 2021 ఫిబ్రవరి, 28వ తేదీ లోగా తమ లైఫ్ సెర్టిఫికెట్ (జీవన ప్రమాణ్ పత్రం - జె.పి.పి) దాఖలు చేయవలసిన గడువు ఎప్పుడు ఉన్నప్పటికీ, వారు,  దానిని సమర్పించడానికి గడువును 2021 ఫిబ్రవరి,  28వ తేదీ వరకు ఈ.పి.ఎఫ్.ఓ. పొడిగించింది.  ప్రస్తుతం పెన్షనర్లు, నవంబర్, 30వ తేదీ వరకు సంవత్సరంలో ఎప్పుడైనా జె.పి.పి. ని సమర్పించవచ్చు, ఇది జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం వరకు చెల్లుతుంది.

అయితే, ఇప్పుడు, అలాంటి పింఛనుదారులందరూ, 2021 ఫిబ్రవరి,  28వ తేదీ వరకు తమ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించవచ్చు.  జె.పి.పి. సమర్పించడానికి ఇప్పుడు అనేక అవకాశాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.  3.65 లక్షల సాధారణ సేవా కేంద్రాలు (సి.ఎస్.‌సి);  పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకుల శాఖలు; 1.36 లక్షల పోస్టాఫీసులతో పాటు,  తపాలా శాఖ పరిధిలోని 1.90 లక్షల మంది  పోస్టుమ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకులతో కూడిన పోస్టల్ నెట్‌వర్క్ వంటి సౌకర్యాల ద్వారా కూడా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లు పొందవచ్చు.

పెన్షనర్లు తమ సమీపంలోని సి.ఎస్.సి. లను గుర్తించడం కోసం (https://locator.csccloud.in/లింక్ ‌ను ఉపయోగించవచ్చు.  అదేవిధంగా, జె.పి.పి. లను తమ సౌలభ్యం మేరకు ఇంటి నుండి లేదా ఇతర చోట్ల నుండి పోస్ట్ ఆఫీస్ కు ఆన్-‌లైన్ లో  అభ్యర్థనను పంపించడానికి (http://ccc.cept.gov.in/covid/request.aspx లింక్ ‌ను ఉపయోగించవచ్చు.

2020 నవంబర్ ‌లో జె.పి.పి.ని సమర్పించలేకపోయిన 35 లక్షల మంది పెన్షనర్లకు సంబంధించి, ఈ పొడిగించిన కాలంలో, పెన్షన్ చెల్లింపు నిలిపివేయబడదు.

*****



(Release ID: 1676759) Visitor Counter : 248