ప్రధాన మంత్రి కార్యాలయం

అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించిన - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 NOV 2020 12:45PM by PIB Hyderabad

జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న డి.ఎన్.‌ఎ. ఆధారిత స్వదేశీ వ్యాక్సిన్ గురించి మరింతగా తెలుసుకోవడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును ఈరోజు సందర్శించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న డి.ఎన్.‌ఎ. ఆధారిత వ్యాక్సిన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అహ్మదాబాద్‌ లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించాను.  ఈ ప్రయత్నం వెనుక పనిచేస్తున్న బృందం కృషిని నేను అభినందిస్తున్నాను.  ఈ ప్రయాణంలో వారికి మద్దతుగా భారత ప్రభుత్వం వారితో పాటు కలిసి చురుకుగా పనిచేస్తోంది." అని పేర్కొన్నారు. 

*****


(रिलीज़ आईडी: 1676732) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam