ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్ కోట్ లో ఆసుపత్రి లో మంటలు చెలరేగిన ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
27 NOV 2020 10:20AM by PIB Hyderabad
రాజ్ కోట్ లోని ఒక ఆసుపత్రి లో మంటలు చెలరేగిన ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘రాజ్ కోట్ లోని ఒక ఆసుపత్రి లో మంటలు రేగిన కారణంగా ప్రాణనష్టం వాటిల్లిందని తెలుసుకొని తీవ్ర వేదన కు లోనయ్యాను. ఈ దురదృష్టకర ఘటన లో తమ ఆప్తులను కోల్పోయిన వారికి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు సాధ్యమైన అన్ని విధాలుగాను సాయపడటానికి పాలనయంత్రాంగం చొరవ తీసుకొంటోంది’’ అని ట్విటర్ లో నమోదు చేసిన ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(रिलीज़ आईडी: 1676362)
आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam