రైల్వే మంత్రిత్వ శాఖ

మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ (హెచ్.‌ఆర్.‌ఎం.ఎస్) ను ప్రారంభించిన - భారతీయ రైల్వేలు

27 లక్షల మంది ప్రస్తుత, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చనున్న - హెచ్‌.ఆర్.‌ఎం.ఎస్.

రైల్వే వ్యవస్థ యొక్క సామర్థ్యం, ఉత్పాదకతలను మెరుగుపరిచే దిశగా ముందడుగు.

రైల్వేల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతలను పెంచనున్న - హెచ్‌.ఆర్.‌ఎం.ఎస్.

భారతదేశాన్ని డిజిటల్ సాధికార సమాజంగా, జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న గౌరవ ప్రధానమంత్రి ఆశయాన్ని సాకారం చేసే దిశగా ఒక ముందడుగు - హెచ్‌.ఆర్.‌ఎం.ఎస్.

ఉద్యోగులందరి పనితీరుపై పెద్ద ప్రభావాన్ని చూపి, వారికి మరింత సాంకేతిక అవగాహన కల్పించనున్న - హెచ్‌.ఆర్.‌ఎం.ఎస్.

Posted On: 26 NOV 2020 1:45PM by PIB Hyderabad

భారతీయ రైల్వే పూర్తిగా పూర్తిగా ఆన్-లైన్ లో పనిచేసే డిజిటల్ మానవవనరుల నిర్వహణ వ్యవస్థ (హెచ్.‌ఆర్.‌ఎం.ఎస్) ను ప్రారంభించింది.  మానవవనరుల నిర్వహణ వ్యవస్థ (హెచ్.‌ఆర్.‌ఎం.ఎస్) అనేది భారతీయ రైల్వేలకు మెరుగైన ఉత్పాదకత మరియు ఉద్యోగులకు  సంతృప్తినిచ్చే అధిక ప్రోత్సాహక ప్రాజెక్ట్.  ఇది రైల్వే వ్యవస్థ యొక్క సామర్థ్యం మరియు ఉత్పాదకతను మెరుగుపరిచే చర్య.  భారతదేశాన్ని డిజిటల్ సాధికార సమాజంగా మరియు జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి గౌరవ ప్రధానమంత్రి  ఆశయాన్ని సాకారం చేసే దిశగా ఇది ఒక ముందడుగు.  హెచ్.‌ఆర్.‌ఎం.ఎస్. ఉద్యోగులందరి పనితీరుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందనీ, వారిని మరింత సాంకేతిక పరిజ్ఞానం గలవారిగా తీర్చిదిద్దుతుందనీ భావిస్తున్నారు.  

 

రైల్వే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఉపయోగపడే హెచ్.ఆర్.ఎమ్.ఎస్. తో పాటు యూజర్ డిపో మాడ్యూళ్ళను, రైల్వే బోర్డు ఛైర్మన్ మరియు సి.ఈ.ఓ. శ్రీ వినోద్ కుమార్ యాదవ్,  ఈ రోజు,  వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.  

 

ఉద్యోగుల స్వయం సేవా (ఈ.ఎస్.ఎస్) మాడ్యూల్  - డేటా మార్పుకు సంబంధించి కమ్యూనికేషన్ ‌తో సహా హెచ్.‌ఆర్.‌ఎం.ఎస్. యొక్క వివిధ మాడ్యూళ్ళతో కలిసి పనిచేయడానికి రైల్వే ఉద్యోగులకు వీలు కల్పిస్తుంది.

 

భవిష్యనిధి (పి.ఎఫ్) అడ్వాన్సు మాడ్యూల్ -  పి.ఎఫ్. బ్యాలెన్సు తనిఖీ చేసుకోడానికీ, ఆన్-‌లైన్ ‌లో పి.ఎఫ్. అడ్వాన్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికీ రైల్వే ఉద్యోగులకు వీలు కల్పిస్తుంది. అడ్వాన్సు దరఖాసును పరిశీలించే ప్రక్రియ ఆన్-‌లైన్ ‌లో ఉంటుంది.   ఉద్యోగులు వారి పి.ఎఫ్. దరఖాస్తు పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్-‌లైన్ ‌లో చూసుకోవచ్చు. 

 

సెటిల్మెంట్ మాడ్యూల్ - పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల మొత్తం పరిష్కార ప్రక్రియను డిజిటలైజ్ చేస్తుంది. ఉద్యోగులు తమ సెటిల్మెంట్ / పెన్షన్ బుక్-‌లెట్ లో సమాచారాన్ని ఆన్-‌లైన్ విధానంలో నింపవచ్చు. ఉద్యోగులు తమ సర్వీసుకు సంబంధించిన వివరాలను ఆన్- లైన్ ‌లో పొందవచ్చు. పింఛను ప్రక్రియ మొత్తం ఆన్-‌లైన్ ‌లో జరుగుతుంది.  ఇది కాగితం వాడకాన్ని తొలగించడంతో పాటు, పదవీ విరమణ చేసే సమయంలో ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలను సకాలంలో ప్రాసెస్ చేయడానికి అవసరమైన పర్యవేక్షణను కూడా సులభతరం చేస్తుంది.

 

ఈ మాడ్యూళ్ళకు ముందు, భారతీయ రైల్వే ఇప్పటికే హెచ్.ఆర్.ఎం.ఎస్. కి చెందిన ఇతర మాడ్యూళ్ళను ప్రారంభించింది.  అవి - ఉద్యోగుల మాస్టర్ మాడ్యూల్ - రైల్వే ఉద్యోగి యొక్క అన్ని ప్రాథమిక సమాచార వివరాలను నిల్వ చేయడానికి వినియోగిస్తారు;  భౌతికంగా నమోదు చేసే సర్వీసు రికార్డుల స్థానంలో ఎలక్ట్రానిక్ సర్వీసు రికార్డు మాడ్యూల్ - ఉద్యోగుల సర్వీసు వివరాలను డిజిటల్ విధానంలో నమోదుచేసి నిల్వ చేస్తుంది; వార్షిక పనితీరు అంచనా నివేదిక (ఏ.పి.ఏ.ఆర్) మాడ్యూల్ - మొత్తం 12 లక్షల మంది  నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు చెందిన వార్షిక పనితీరు అంచనా నివేదికలను చేతితో వ్రాసే ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తుంది;  ఎలక్ట్రానిక్ పాస్ మాడ్యూల్ - భౌతికంగా కాగితం రూపంలో పాస్ లు ఇచ్చే విధానానికి బదులుగా డిజిటల్ పాస్ లు జారీ చేస్తుంది;  ఆఫీస్ ఆర్డర్ మాడ్యూల్ - ఆఫీస్ ఆర్దర్లను జారీ చేయడంతో పాటు, కొత్త ఉద్యోగుల చేరడం, ఉద్యోగుల పదోన్నతి, ఉద్యోగుల బదిలీ, ఉద్యోగుల పదవీ విరమణ వంటి సమాచార వివరాలను ఎప్పటికప్పుడు హెచ్.‌ఆర్.‌ఎం.ఎస్. డేటాబేస్ ‌లో పొందుపరచడానికి వినియోగిస్తారు. 

 

*****(Release ID: 1676138) Visitor Counter : 223