మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ పథకాలు, కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర విద్యా మంత్రి
Posted On:
26 NOV 2020 2:55PM by PIB Hyderabad
వఇద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ పథకాలు, కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి కేంద్ర విద్యా మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశంక్ గురువారం అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కార్యదర్శి అమిత్ ఖారే, కార్యదర్శి, ఎస్ఇ, అనిత కర్వాల్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
అన్ని రకాల స్కాలర్‌షిప్‌లను, ఫెలోషిప్‌లను సమయానికి విడుదలయ్యేలా చూడవలసిందిగా కేంద్ర మంత్రి పోఖ్రియాల్ యుజిసిని ఆదేశించారు. దానితో పాటుగా ఇందుకోసం ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించవలసిందిగా సూచించారు. అలాగే, విద్యార్ధులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించవలసిందిగా నిర్దేశించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి మాతృభాషలోనే ఇంజినీరింగ్ విద్యను, ఇతర సాంకేతిక విద్యను బోధించడం ప్రారంభించాలని ప్రాథమిక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఇందుకోసం కొన్ని ఐఐటిలను,ఎన్ ఐటిలను మాత్రమే గుర్తించారు.
విద్యార్ధుల సమగ్ర అభివృద్ధి, దేశంలోని విద్యా వ్యవస్థనను పరివర్తన చేసే లక్ష్యంతో జాతీయ విద్యా విధానాన్ని సజావుగా అమలు చేయడంలో మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు అందరూ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు.
వివిధ బోర్డులలో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసిన తర్వాత పోటీ పరీక్షలకు సిలబస్‌ను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటిస్తుందని నిర్ణయించారు. ఈ ఏడాది పరీక్షలను ఎప్పుడు, ఎలా నిర్వహించాలన్న విషయంపై విద్యార్ధుల, తల్లిదండ్రుల, అధ్యాపకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
***
(Release ID: 1676136)
Visitor Counter : 229