మంత్రిమండలి

అసీమ్ మౌలిక సదుపాయాల ఆర్ధిక సంస్థ మరియు ఎన్.‌ఐ.ఐ.ఎఫ్. మౌలిక సదుపాయాల ఆర్ధిక సంస్థ తో కూడిన ఎన్.‌ఐ.ఐ.ఎఫ్. మౌలిక సదుపాయాల ఋణ ఆర్ధిక వేదిక కు మూలధనం సమకూర్చడాన్ని ఆమోదించిన - కేంద్ర మంత్రిమండలి

Posted On: 25 NOV 2020 3:30PM by PIB Hyderabad

అసీమ్ మౌలిక సదుపాయాల ఆర్ధిక సంస్థ (ఏ.ఐ.ఎఫ్.ఎల్) మరియు ఎన్.ఐ.ఐ.ఎఫ్. మౌలిక సదుపాయాల ఆర్ధిక సంస్థ (ఎన్.ఐ.ఐ.ఎఫ్-ఐ.ప్.ఎల్) లతో కూడిన జాతీయ పెట్టుబడి మరియు మౌలికసదుపాయాల నిధి (ఎన్.‌ఐ.ఐ.ఎఫ్) ఆధ్వర్యంలోని ఎన్.‌ఐ.ఐ.ఎఫ్. ఋణ వేదిక (ఎన్.ఐ.ఐ.ఎఫ్. డెట్ ప్లాట్ ‌ఫామ్) ‌లో 6,000 కోట్ల రూపాయల మేర ఈక్విటీ సమకూర్చే ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం,   ఈ క్రింది షరతులకు లోబడి  ఆమోదం తెలిపింది :

i.          ప్రస్తుత 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించబడతాయి.   అయితే, అసాధారణమైన ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత కోవిడ్-19 కారణంగా పరిమిత ఆర్థిక వనరుల లభ్యత దృష్ట్యా, రుణాల పెంపుకు సంసిద్ధత మరియు డిమాండ్ ఉంటేనే ప్రతిపాదిత మొత్తాన్ని పంపిణీ చేయవచ్చు.  

ii.          జాతీయ, అంతర్జాతీయ పింఛను నిధులు మరియు సావరిన్ వెల్త్ నిధుల నుండి ఈక్విటీ పెట్టుబడులను వేగంగా ఉపయోగించడానికి అవసరమైన అన్ని చర్యలను ఎన్ఐఐఎఫ్ తీసుకుంటుంది.

భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలో భాగంగా, ఆత్మ నిర్భర్ భారత్ 3.0 కింద,  కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్, 2020 నవంబర్, 12వ తేదీన ప్రకటించిన పన్నెండు కీలక చర్యలలో ఇది ఒకటి. 

ఎన్.బి.ఎఫ్.సి. ఇన్ఫ్రా డెట్ నిధి మరియు ఎన్.బి.ఎఫ్.సి. ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ లతో కూడిన ఒక ఋణ వేదిక (డెట్ ప్లాట్ ఫారమ్) ను ఎన్.ఐ.ఐ.ఎఫ్. వ్యూహాత్మక అవకాశాల నిధి ఏర్పాటు చేసింది.  ఎన్.ఐ.ఐ.ఎఫ్. తన వ్యూహాత్మక అవకాశాల నిధి (‘ఎన్.ఐ.ఐ.ఎఫ్-ఎస్.ఓ.ఎఫ్’) ద్వారా రెండు సంస్థలలోనూ మెజారిటీ స్థానాన్ని కలిగి ఉంది.  ఇప్పటికే  ఈ వేదికలో దాదాపు 1,899 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది.  వ్యూహాత్మక అవకాశాల నిధి (ఎస్.‌ఓ.ఎఫ్. ఫండ్) ద్వారా పెట్టుబడి పెట్టిన ఎన్.‌ఐ.ఐ.ఎఫ్. సంస్థ ఇతర తగిన పెట్టుబడి అవకాశాలలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, ఈ రెండు సంస్థలకు మద్దతు కొనసాగిస్తూనే ఉంటుంది.  ప్రస్తుత ప్రతిపాదన మౌలిక సదుపాయాల రుణ ఫైనాన్సింగ్ రంగంలో రెండు సంస్థల యొక్క సామర్థ్యాన్ని మరియు ప్రభావాన్ని మరింతగా అంచనా వేయడానికి నేరుగా భారత ప్రభుత్వం నుండి పెట్టుబడిని కోరుతోంది.  అంతర్జాతీయ ఈక్విటీని పెంచడానికి వేదిక చేసే ప్రయత్నాలకు ఇది తోడ్పడుతుంది.  ప్రభుత్వం తాజాగా సమకూర్చిన ఈక్విటీ, ఇప్పటికే ఎన్.ఐ.ఐ.ఎఫ్-ఎస్.ఓ.ఎఫ్. సమకూర్చిన ఈక్విటీతో పాటు, ప్రైవేటు రంగం నుండి సంభావ్య ఈక్విటీ భాగస్వామ్యంతో పాటు, ఈ ఋణ వేదిక ద్వారా 2025 నాటికి ప్రాజెక్టులకు 1,10,000 కోట్ల రూపాయల మేర రుణ మద్దతును విస్తరించడానికి తగిన వనరులను సమకూరుస్తుందని భావిస్తున్నారు. 

అమలు వ్యూహం మరియు లక్ష్యాలు :

ఏ).     వ్యూహం లో భాగంగా, ఏ.ఐ.ఎఫ్.ఎల్. ప్రధానంగా నిర్మాణంలో / గ్రీన్ ఫీల్డ్ / బ్రౌన్ ఫీల్డ్ ఆస్తులపై ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలంలో కార్యకలాపాలతో దృష్టి పెడుతుంది.  ఎన్.‌ఐ.ఐ.ఎఫ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ ఫామ్ దాని స్వంత అంతర్గత మదింపు వ్యవస్థను కలిగి ఉంటుంది, ఇది నిధుల వినియోగాన్ని వేగంగా అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది.

బి).          పరిపక్వ ఆపరేటింగ్ ఆస్తుల కోసం టేక్-అవుట్ వాహకంగా ఎన్.ఐ.ఐ.ఎఫ్-ఐ.ఎఫ్.ఎల్. (ఎన్.బి.ఎఫ్.సి-ఐ.డి.ఎఫ్) పనిచేస్తుంది. అధిక ఖర్చుతో కూడిన బ్యాంక్ ఫైనాన్సు ‌ను తక్కువ ఐ.డి.ఎఫ్. ఫైనాన్సు పోస్ట్-కమీషనింగ్‌ తో భర్తీ చేయడంలో, మౌలిక సదుపాయాల పెట్టుబడిదారులకు ఇది సహాయపడుతుంది.  వచ్చే ఐదు సంవత్సరాలలో (ఎన్.‌ఐ.పి. ప్రణాళికా కాలం), ఎన్.‌ఐ.ఐ.ఎఫ్. మౌలిక సదుపాయాల ఋణ ఆర్ధిక వేదిక 1,00,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణానికి తోడ్పడుతుంది.

సి).          ఈ వేదిక రాబోయే సంవత్సరాల్లో బాహ్య దీర్ఘకాలిక ఈక్విటీ క్యాపిటల్‌తో పాటు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల నుండి ఋణాలను కూడా పెంచాల్సి ఉంటుంది.  భారత ప్రభుత్వం నుండి 6,000 కోట్ల రూపాయల వరకు ప్రతిపాదిత మూలధన ఇన్ఫ్యూషన్ కు  ఇది, 14 -18 రెట్లుగా ఉంటుంది.

డి).          ఎన్.ఐ.ఐ.ఎఫ్. మౌలిక సదుపాయాల ఋణ ఆర్ధిక వేదిక లో  జాతీయ, అంతర్జాతీయ పింఛను, బీమా, సావరిన్ వెల్త్ ఫండ్ల ద్వారా ఈక్విటీ పెట్టుబడులను ఉత్ప్రేరకపరచడానికి ప్రభుత్వం ఈక్విటీ పెట్టుబడులను ఉపయోగించటానికి ఎన్.ఐ.ఐ.ఎఫ్. పటిష్టమైన చర్యలు చేపడుతుంది.

మొత్తం వ్యయం :

ఎన్.‌ఐ.ఐ.ఎఫ్. ఋణ వేదికలో, 2020-21 మరియు 2021-22,  రెండు ఆర్థిక సంవత్సరాల్లో 6,000 కోట్ల రూపాయలు ఈక్విటీగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. 

ప్రభావం :

ఎన్.‌ఐ.ఐ.ఎఫ్. మౌలికసదుపాయాల ఆర్ధిక వేదిక, వచ్చే ఐదు సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల రంగానికి దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల ఋణాలను అందిస్తుందని భావిస్తున్నారు.   జాతీయ మౌలిక సదుపాయాలలో ఊహించిన విధంగా మౌలిక సదుపాయాల రంగానికి ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడంలో ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

ఈ ప్రక్రియ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బ్యాంకుల పరిధి నుండి బయటకు వచ్చి ఉపశమనం కలిగించడానికి మరియు కొత్త హరిత-క్షేత్ర ప్రాజెక్టులకు అవకాశాన్ని కల్పించడానికీ, సహాయపడుతుంది.  మౌలిక సదుపాయాల రంగంలో ఐ.డి.ఎఫ్ / టేక్-అవుట్ ఫైనాన్సింగ్ కార్యకలాపాలను బలోపేతం చేయడం వల్ల మౌలిక సదుపాయాల ఆస్తుల ద్రవ్యతను పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.  

భారతదేశంలో, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఎస్.పి.వి.ల ద్వారా అమలు చేయబడతాయి.  సాధారణంగా, ఎస్.పి.వి. లు, నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా, స్వతంత్ర ప్రాతిపదికన, ఒంటరిగా పెట్టుబడి గ్రేడ్ రేటింగ్ పొందడం సవాలుగా ఉంటుంది.  ఋణ వేదిక బాండ్ మార్కెట్ నుండి ఋణాలను సేకరించి, విశ్వసనీయ మధ్యవర్తిగా పనిచేస్తుందని కూడా భావిస్తున్నారు.  కేర్ రేటింగ్సు ద్వారా ఏ.ఐ.ఎఫ్.ఎల్. సంస్థ ఏ.ఏ. గా రేట్ చేయబడింది. కాగా,  కేర్ రేటింగ్సు మరియు ఐ.సి.ఆర్.ఏ. ద్వారా  ఎన్.ఐ.ఎఫ్-ఐ.ఎఫ్.ఎల్. సంస్థ ఏ.ఏ.ఏ. గా రేట్ చేయబడింది.   బాండ్ పెట్టుబడిదారులు బ్యాంకుల కంటే తక్కువ మార్జిన్లను కోరుకుంటారు, కాని వారి స్వంత నష్టాల నిర్వహణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ.ఏ.ఏ. / ఏ.ఏ. రేటు పొందిన సంస్థలకు చెందిన రుణాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు.  పింఛన్లు, బీమా నిధులతో సహా దీర్ఘకాలిక బాండ్ పెట్టుబడిదారులు సాధారణంగా ఏ.ఏ.ఏ. రేటు పొందిన బాండ్లలో పెట్టుబడి పెడతారు.

ఏ.ఏ.ఏ./ఏ.ఏ. రేటు పొందిన మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా భారతదేశంలో బాండ్ మార్కెట్ అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ మరియు అభివృద్ధిలో బాగా పెట్టుబడి పెట్టిన, బాగా నిధులు సమకూర్చిన మరియు బాగా నిర్వహించబడుతున్న ఎం.ఐ.ఐ.ఎఫ్. ఋణ వేదిక,  బాండ్ మార్కెట్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు కంపెనీల మధ్య ప్రధాన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. 

నేపధ్యం :

జాతీయ మౌలిక సదుపాయాల వేదిక (ఎన్.‌ఐ.పి) ప్రకారం, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు వచ్చే 5 సంవత్సరాలలో వివిధ ఉప రంగాలలో 111 లక్షల కోట్ల రూపాయల మేర  లక్ష్యంగా పెట్టుకున్నాయి, ఇది రుణ ఫైనాన్సింగ్ కోసం గణనీయమైన అవసరాన్ని సృష్టిస్తుంది.  దీనికి డెట్ ఫైనాన్సింగ్‌లో కనీసం 60 నుంచి 70 లక్షల కోట్ల రూపాయలు అవసరం.  ఈ ప్రస్తుత వాతావరణానికి జాతీయ పెట్టుబడి మరియు మౌలికసదుపాయాల నిధి (ఎన్.‌ఐ.ఐ.ఎఫ్) చేత అభివృద్ధి చేయబడుతున్న ప్రత్యేక మూలధన కేంద్రీకృత ఆర్థిక సంస్థలు అవసరం, ఇవి పటిష్టమైన మూలధనం మరియు నైపుణ్యంతో నడిచే విధానంతో ప్రాజెక్టు లకు రుణాలు సమకూర్చడంపై దృష్టి పెట్టవచ్చు.

*****(Release ID: 1675841) Visitor Counter : 256