ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ అహ్మ‌ద్ ప‌టేల్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 NOV 2020 9:47AM by PIB Hyderabad

శ్రీ అహ్మ‌ద్ ప‌టేల్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దుఃఖాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘అహ్మ‌ద్ ప‌టేల్ గారి మ‌ర‌ణంతో దుఃఖిస్తున్నాను. ఆయ‌న ప్ర‌జాజీవ‌న రంగంలో ఉంటూ, స‌మాజానికి సేవ‌లు అందిస్తూ, ఎన్నో సంవ‌త్స‌రాల కాలాన్ని వెచ్చించారు. కుశాగ్ర బుద్ధి తో కాంగ్రెస్ పార్టీని బ‌ల‌వ‌త్త‌రంగా రూపొందించ‌డం లో ఆయ‌న పోషించిన పాత్ర‌కుగాను ఆయ‌న‌ను స‌దా స్మ‌రించుకోవ‌డం జ‌రుగుతుంది.  ఆయ‌న కుమారుడు శ్రీ ఫైసల్ తో మాట్లాడి, నా సంతాపాన్ని వ్య‌క్తం చేశాను.  అహ్మ‌ద్ భాయ్ ఆత్మ‌కు శాంతి ల‌భించుగాక’’ అని ట్విట‌ర్ లో న‌మోదు చేసిన ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***
 


(Release ID: 1675542) Visitor Counter : 160